Karthika Deepam 2 Today Episode: సస్పెన్స్ డ్రామా-దీపను చంపేందుకు జ్యోత్స్న ప్లాన్-కార్తీక్‌కు షాక్ మీద షాక్-బావతో ఆటలు

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 3 ఎసిసోడ్ లో సస్పెన్స్ అదిరిపోయింది. షాక్ లే షాక్ లు. దీపను జ్యోత్స్న చంపాలనుకుంటుందని తెలుసుకున్నకార్తీక్ తన మరదలును సేవ్ చేస్తాడు. మరోవైపు బావే పెళ్లి కొడుకు అని జ్యోత్స్న ట్విస్ట్ ఇస్తుంది.

Published on: Apr 3, 2026, 07:03:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్ లో దీపను చంపేందుకు జ్యోత్స్న ప్లాన్ చేస్తుంది. మరోవైపు సుమిత్ర, జ్యోత్స్న, దీప డీఎన్ఏ టెస్టులు చూసి కార్తీక్ షాక్ అవుతాడు. జ్యోత్స్నకు నిజం తెలిసిందని అనుకుంటాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో టుడే ఏప్రిల్ 3 కార్తీక దీపం 2 ఎపిసోడ్ లో చూసేద్దాం.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohostar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohostar)

కార్తీక్ కంగారు

జ్యోత్స్న డీఎన్ఏ టెస్టు చేయించింది. సుమిత్ర అత్తకు బోన్ మ్యారో తాను ఇవ్వలేదని జ్యోత్స్నకు అనుమానం వచ్చింది. దీప శాంపిల్స్ కూడా సంపాదించింది. జ్యోత్స్న సైలెంట్ గా లేదు మామయ్య. ఏదో పెద్ద ప్లాన్ లో ఉంది. తాను అసలు వారసురాలు కాదన్న విషయం నాకు, దీపకు తెలుసని తనకు తెలిసిపోయిందని దాసుతో కార్తీక్ కంగారుగా చెప్తాడు.

డేంజర్లో దీప

మరోవైపు మేడ మీద ఉన్న దీప దగ్గరకు జ్యోత్స్న వెళ్తుంది. దీప డేంజర్లో ఉంది మామయ్య, వెంటనే తనను సేవ్ చేయాలని కార్తీక్ పరుగులు పెడతాడు. దీపను చంపడానికి జ్యోత్స్న పిలిచిందా? వెంటనే జ్యోత్స్నను ఆపాలని దాసు కూడా వెనకాలే వెళ్తాడు. ఇంట్లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో హడావుడి ఉంటుంది. దీప ఏది అని పారును కార్తీక్ అడుగుతాడు. జ్యోత్స్న మెడ మీదకు వెళ్లడం చూశానని చెప్తుంది.

దీప సేఫ్

అమ్మ మెడ మీదకు వెళ్లిందని కార్తీక్ తో శౌర్య చెప్తుంది. వెంటనే కార్తీక్ పైకి వెళ్తాడు. మరోవైపు దీప మొక్కలకు నీళ్లు పోస్తుంది. వెనకాల నుంచి వచ్చిన జ్యోత్స్న దీపను తోసేయాలని చూస్తుంది. అప్పుడే కార్తీక్ వచ్చి దీప అని పిలుస్తాడు. టెన్షన్ తో జ్యోత్స్న వణికిపోతుంది. కానీ కళ్లు తిరిగి పడిపోతావేమోనని పట్టుకుందామనుకున్నా దీప అని జ్యో కవర్ చేస్తుంది.

కార్తీక్ వార్నింగ్

దీపను నేను కిందకు తోసేస్తున్నా అనుకున్నవా బావ. సారీ బావ నేను అలాంటి దాన్ని కాదు. అంతకంటే ప్రమాదకరమైనదాన్ని అని జ్యో అంటుంది. దీపను కిందకు పంపిస్తారు. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో ఇక్కడితో ఆపేయ్ జ్యోత్స్న అని కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు. కిందకు వెళ్లి రుచికరమైన భోజనం చేద్దాం పదా బావ, ఈ రోజు అందరికీ గుర్తుండిపోతుందని జ్యోత్స్న అంటుంది.

అన్నంలో విషం

జ్యోత్స్న భోజనంలో ఏమైనా కలిపిందో లేదో తెలుసుకోవాలని కార్తీక్ అనుకుంటాడు. మనకు స్పెషల్ గా భోజనాలు తెప్పించాను బావ అని జ్యోత్స్న అనడంతో కార్తీక్ కు అనుమానం ఇంకా పెరుగుతుంది. అందరూ భోజనాలకు రెడీ అవుతారు. తినే అన్నంలో విషం కలిపి అందరినీ ఒకేసారి చంపాలని జ్యోత్స్న అనుకుంటుందా అని కార్తీక్ డౌట్ పడతాడు.

దీపకు తినిపించాలని

మా మమ్మీ ప్రాణాలను దీప కాపాడిందని నేను అంటున్నా. దీనికి నువ్వైతే కరెక్ట్ గా క్లారిటీనిస్తావ్ అని కార్తీక్ తో జ్యోత్స్న ఆడుకుంటుంది. నువ్వే చెప్పు అని కార్తీక్ అంటాడు. ఈ రోజు దీప ముఖ్య అతిథి కాబట్టి మొదటి ముద్ద తనే తింటుంది. అవసరమైతే నేనే కలిపి తినిపిస్తానని జ్యోత్స్న అంటుంది. మొదటి ముద్దు పారిజాతం తినిపిస్తానని దీప నోటి వరకూ తీసుకెళ్తుంది.

షాక్ మీద షాక్

పారును కార్తీక్ అడ్డుకుంటాడు. నువ్వు దీపకు తినిపించడంలో స్పెషల్ ఏం లేదు. అదే జ్యోత్స్నకు దీప తినిపించింది అనుకో అని కార్తీక్ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. దీప నీ చేత్తో కలిపి జ్యోత్స్నకు ఓ ముద్దు పెట్టు అని కార్తీక్ చెప్తాడు. దీప తినిపిస్తే జ్యోత్స్న తింటుంది. ఇప్పుడు కార్తీక్ షాక్ అవుతాడు. ఉప్పునిప్పులా ఉండే దీప, జ్యోత్స్న అక్కాచెల్లెలిలా కనిపిస్తున్నారని సుమిత్ర హ్యాపీగా అంటుంది.

బావే పెళ్లికొడుకు

ఆ తర్వాత కేక్ కటింగ్ ప్లాన్ చేస్తుంది జ్యోత్స్న. మా మమ్మీ కోరిక ఏదైనా సరే తీర్చడానికి నేను రెడీ అని జ్యోత్స్న అంటుంది. పెళ్లి చేసుకోవాలని సుమిత్ర అడుగుతుంది. త్వరలోనే పెళ్లి చేసుకుంటా, బావే నా పెళ్లి కొడుకు అని జ్యోత్స్న ట్విస్ట్ ఇస్తుంది. బావే నాకు కాబోయే పెళ్లి కొడుకును సెలెక్ట్ చేస్తాడని చెప్పాలనుకుంటున్నానని జ్యో కవర్ చేస్తుంది.

దీపను దత్తత తీసుకోమని దశరథకు చెప్పి, ఈ ఇంటి వారసురాలని చేస్తానని దాసుతో పారు చెప్తుంది. మరోవైపు జ్యోత్స్న కొత్తగా నీతి వాక్యాలు బోధిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే దీప కూడా ఈ ఇంట్లో ఉండొచ్చు. దీప లాంటి అమ్మాయి ఇంట్లో ఉంటే దేవుడి గదిలో దీపం ఉన్నట్లేనని పారు అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More