Karthika Deepam 2 Today Episode: దీప కడుపులో బిడ్డ సేఫ్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డాక్టర్.. కాంచన షాకింగ్ నిర్ణయం!
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 23 ఎపిసోడ్ లో హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన సుమిత్ర ఎమోషనల్ అవుతుంది. మరోవైపు దీప కడుపులో బిడ్డ క్షేమంగా ఉందని డాక్టర్ గుడ్ న్యూస్ చెప్తుంది. కాంచనకు దశరథ ఈ విషయం చెప్పడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు.
కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 23 ఎపిసోడ్ లో.. సుమిత్రకు పారిజాతం దిష్టి తీసి ఆహ్వానిస్తుంది. మళ్లీ ఈ ఇంట్లో అడుగుపెడతానని అనుకోలేదని దశరథతో సుమిత్ర అంటుంది. నీ కోసం దశరథ హోమం చేయించాడు. మీ మామయ్య బలంగా కోరుకున్నాడు. జ్యోత్స్న నిన్ను కాపాడిందని పారిజాతం అంటుంది.

సుమిత్ర కన్నీళ్లు
ఇంజెక్షన్ అంటేనే భయపడే నా కూతురు ఇంత పెద్ద ఆపరేషన్ కు ముందుకు వచ్చిందంటే తల్లి కోసమే కదా అని జ్యోత్స్న చేతులు పట్టుకుని సుమిత్ర కన్నీళ్లు పెట్టుకుంటుంది. నీ కూతురు గండాన్ని దాటించిందని శివ నారాయణ అంటాడు. నేను ఏదైతే నమ్మలేదో అదే ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది. నేను సుమిత్ర కూతురిని. ఈ గ్రానీ తప్పు దారి పట్టించిందని జ్యోత్స్న అనుకుంటుంది.
మంచి రోజులు
చిన్న పని ఉంది బయటకు వెళ్లొస్తానని దశరథ అంటే, ఎవరూ ఎక్కడికి వెళ్లొద్దని సుమిత్ర అడుగుతుంది. భార్యకు నచ్చజెప్పి లోపలికి దశరథ పంపిస్తాడు. నేను మరో చోటుకు వెళ్లాలి నాన్న. మనకు మంచి రోజులు మొదలయ్యాయి. నాకు చిన్న పని ఉందని తండ్రికి చెప్పి దశరథ వెళ్లిపోతాడు.
కార్తీక్ ప్రశ్నలు
మరోవైపు కార్తీక్, దీప బాధపడుతూ కూర్చుంటారు. అత్తను డిశ్చార్జ్ చేశారు. మనం కూడా ఇంటికి వెళ్లిపోతాం. అమ్మకు మన మీద కోపం ఉంది. మనం చెప్పేది అమ్మ వినదు. ఇప్పుడు అమ్మ నిన్ను వెళ్లిపొమ్మన్నా లేదా అమ్మనే దూరంగా వెళ్లిపోతానంటే నేను ఏం చేయాలి? ఎవరి వైపు నిలబడాలి? ఏ తప్పు చేయని నిన్ను వదులుకోలేను. అమ్మను వదులుకోలేననని దీపతో కార్తీక్ అంటాడు.
బిడ్డ సేఫ్
దీనికి పరిష్కారం ఒక్కటే. అమ్మతో నిజం చెప్పడం తప్పా వేరే దారి లేదు. నాన్నను వదులుకున్నంత తేలికగా నిన్ను వదులుకోలేనని దీపతో కార్తీక్ అంటాడు. అప్పుడే డాక్టర్ హారిక్ వస్తుంది. ఒక తల్లి ప్రాణం కాపాడేందుకు దీప తన బిడ్డ ప్రాణాన్ని వదులుకునేందుకు సిద్ధపడింది. కానీ బిడ్డ మాత్రం అందుకు సిద్ధపడలేదు. నిజంగా ఇది అద్భుతం. మీ బిడ్డ మీతోనే ఉందని డాక్టర్ ట్విస్ట్ ఇస్తుంది.
ఇది వినగానే కార్తీక్, దీప చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ బిడ్డ సేఫ్ గా మీతోనే ఉంది కార్తీక్ అని డాక్టర్ చెప్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. మీరు రెండు కాదు చాలా ప్రాణాలు కాపాడారు. వెంటనే ఇంటికి వెళ్లి అమ్మకు చెప్పాలి. ఇక్కడికి ఓ ఆశతో వచ్చాం. ఇప్పుడు ఆనందంతో వెళ్తున్నామని కార్తీక్ తెగ సంతోషపడతాడు.
సొంత మనవరాలు కాదని
ఇన్నాళ్లు నువ్వు నా సొంత మనవరాలివి అనుకున్న కాబట్టి మన మధ్య ఎడతెగని బంధం ఉండేది. దాసు కూతురివి అనుకున్న కాబట్టి ఆ నిజం బయటపడితే నీకు సాయంగా నిలబడేందుకు నేను తప్ప ఎవరూ లేరనుకున్నా. కానీ ఎప్పుడైతే నువ్వు సుమిత్ర, దశరథ కూతురివి అని తెలిసిందో అప్పుడే నీకు భయం పోయింది. హాస్పిటల్లో దీప గది ముందు నన్నెందుకు కాపలా పెట్టావ్? అని జ్యోత్స్నను పారిజాతం అడుగుతుంది.
మా డాడీ వాళ్ల చెల్లెలు ఇంటికి వెళ్లాడు. దీప డిశ్చార్జ్ కూడా ఈ రోజే కదా. గ్రానీ నువ్వు నాకో సాయం చేస్తావా? నాకో పని చేసి పెట్టాలని పారును జ్యోత్స్న అడుగుతుంది. మరోవైపు లగేజీ సర్దుకుని ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు కాంచన రెడీ అవుతుంది. షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది. కార్తీక్, దీపను బయటే ఆగమని కాంచన చెప్తుంది. అనసూయను దిష్టి తీయమంటుంది.
లగేజీ సర్దుకున్న కాంచన
నా కోడలు ఈ ఇంట్లోకి అడుగుపెట్టడం నేను గడప దాటడం ఒకేసారి జరగాలని కాంచన అంటుంది. కార్తీక్ మాట్లాడాలి అంటే కాంచన వినదు. దీప ఎందుకు అలా నడుస్తున్నావని శ్రీధర్ అడుగుతాడు. కడుపు తీసేసుకున్న ఆడది అలా కాకపోతే ఇంకా ఎలా నడుస్తుందండీ. దించేసుకున్న బరువు తాలూకా నొప్పి ఉంటుందని కాంచన కోప్పడుతుంది.
ఎవరూ లేని కొత్త ఇంటికి వెళ్తానని కాంచన అంటుంది. చెల్లెమ్మతో పాటు నేనూ వెళ్లిపోతున్నా. ఇప్పుడు ఆమెతో ఉండటమే అవసరం. ఎలాగైనా బతికేస్తామని అనసూయ అంటుంది. సరే తీసుకెళ్లిపోండి, అందరూ వెళ్లిపోండి. అందరికీ బాధలు ఉన్నాయి. కానీ ఎదుటివాళ్లు చెప్పేది కూడా వినాలి కదా అని కార్తీక్ అంటాడు. అవి వినే మాటలు కాదు కదా అని కాంచన అంటే, వినాలి చెల్లెమ్మ అని దశరథ వస్తాడు.
దీప కడుపులో బిడ్డ
నలుగురు వెళ్లారు, ముగ్గురు వచ్చారని కాంచన అంటుంది. నీ అంచనా తప్పు చెల్లెమ్మ. నీకిచ్చిన మాటను ఈ అన్నయ్య తప్పడు. హాస్పిటల్ కు నలుగురం వెళ్లాం. ఇప్పుడు కూడా నలుగురం వచ్చాం. దీప కడుపులో బిడ్డ క్షేమంగానే ఉందని దశరథ చెప్పడంతో కాంచన ముఖం వెలిగిపోతుంది. మీ అన్నయ్య నిన్నెప్పుడు మోసం చేయడమ్మా అని దశరథ అంటాడు.
ఇదిగో మళ్లీ నా కూతురిని నీ చేతికి అప్పగిస్తున్నానని దీప చేతిని కాంచన చేతిలో పెడతాడు దశరథ. నీ కోడలు, నీ కోడలి కడుపులో పెరుగుతున్న బిడ్డ, ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని దశరథ అంటాడు. మీ కోడలు, కొడుకు మీకు ఇచ్చిన మాట తప్పలేదు అత్తయ్య అని దీప అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


