Karthika Deepam 2 Today Episode: దీప పతనమే నా లక్ష్యం- అసలు నిజం చెప్పమంటూ దాసుపై జ్యోత్స్న ఫైర్- దీపను కాపాడే మార్గం
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 17 ఎపిసోడ్ లో ఎవరేమన్నా ఒకే నిర్ణయం మీద నిలబడదామని దీపతో కార్తీక్ అంటాడు. దీప ప్రాణాలు కాపాడే మార్గాన్ని గురువు చెప్తాడు. తండ్రిని దాసు అని పేరుతో జ్యోత్స్న పిలుస్తుంది.
కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 17 ఎపిసోడ్ లో.. ఆపరేషన్ జరిగే వరకు ఎన్ని అవమానాలైనా మోయాలి. బిడ్డను వద్దనుకున్నామని వీళ్లకు తెలుసు. కానీ ఎందుకు వద్దనుకున్నామో తెలియదు. జ్యోత్స్న తన సొంత కూతురు కాదంటే అత్త చనిపోతుంది. మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. దానిపైనే నిలబడదాం దీప అని కార్తీక్ చెప్తాడు.

దశరథ బాధ
ఈ సమాజం అంత ప్రశ్నించినా సరే నీతోనే నేనుంటా దీప అని కార్తీక్ అంటాడు. వెంటనే దీప ఎమోషనల్ అయిపోతుంది. కార్తీక్ ను హత్తుకుంటుంది. మరోవైపు గురువుతో మాట్లాడుతూ దశరథ బాధపడతాడు. నేను జరిగే దాన్ని అడ్డుకోలేకపోతున్నా. మార్చలేకపోతున్నా. మానసికంగా ఒప్పుకోలేకపోతున్నా గురువు గారు. ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేనని దశరథ అంటాడు.
హోమం చేయాలని
ఆ ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నమైనా చేయాలి. ఓ ప్రాణం కోసం మరో ప్రాణం పోతుందంటే దానికంటే ముందు నా ప్రాణం పోతే బాగుండు. నా కూతురు బాగుండాలి. కూతురి కడుపులో ఉన్న బిడ్డ బతకాలి. నా భార్య బతకాలి. మార్గం చూపించండి గురువు గారు అని దశరథ ప్రాధేయపడతాడు. అయితే హోమం చేయాలని గురువు చెప్తాడు.
సపోర్ట్ గా స్వప్న
మరోవైపు దీపకు మతి పోయిందా? బిడ్డను వద్దనుకోవడం ఏంటీ? అని శ్రీధర్ తో కావేరి అంటుంది. అన్నయ్య ఒక పని చేశాడంటే అందులో మనకు అర్థం కాని ఓ ప్రయోజనం ఉంటుంది. వాళ్లకు పిల్లలంటే చాలా ఇష్టం. అలాంటి వాళ్లు బిడ్డను వదులుకునేందుకు సిద్ధమయ్యారంటే ఎవరికి చెప్పుకోలేని పెద్ద కారణం ఉందేమోనని స్వప్న అంటుంది. ఆ కారణం చెప్పకపోయినా వాళ్లు తప్పు చేయరు మామయ్య అని కాశీ అంటాడు.
శ్రీధర్ ప్రశ్నలు
మీ ఇద్దరిని చూస్తుంటే భలే ముచ్చట వేస్తుంది. మనసులు కలవట్లేదని విడాకుల కాగితం మీద సంతకాలు పెట్టిన మీరే.. కార్తీక్, దీప విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారు. కార్తీక్, దీప తప్పు చేస్తున్నారని నేనంటే, కాదని మీరంటున్నారు. మరి మీ తప్పులు ఒప్పులుగా అనిపించడం లేదా? ఒప్పుకోవడానికి మీ అహాలు అడ్డొస్తున్నాయా? అని స్వప్న, కాశీని శ్రీధర్ అడుగుతాడు. ఆ విషయం మాట్లాడొద్దని స్వప్న అరుస్తుంది.
శౌర్యను చూడాలని
హాస్పిటల్లో కార్తీక్, దీప ఉంటారు. శౌర్యను చూడాలనిపిస్తుందని దీప అంటుంది. శౌర్య ఇచ్చిన బిడ్డ బొమ్మ బయటే ఉంది కదా అందుకే గుర్తొస్తుందని బ్యాగ్ లో కార్తీక్ పెట్టాలని అనుకుంటాడు. అప్పుడే శివ నారాయణ, జ్యోత్స్న వస్తారు. ఆ బొమ్మ బయటే ఉండని, చూస్తే అయినా మారతారేమోనని శివ నారయణ అంటాడు.
కారణం ఏంటో?
నిన్న మీరు మాట్లాడినదానికి మీ ముఖాలు చూడొద్దని అనుకున్నా. కానీ జ్యోత్స్న వచ్చి ఇదేనా పెద్దరికం అని అడిగితే, మరో ప్రయత్నం చేద్దామని వచ్చానని శివ నారాయణ అంటాడు. నేను నీకు తాత లాంటివాడిని. జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించిన వ్యక్తిగానే ఇక్కడికి వచ్చా. మీరు బిడ్డను పోగొట్టుకోవాలనే నిర్ణయం తీసుకోవడం భరించలేనిది. నాకే ఇలా ఉంటే, మీకు ఎలా ఉండాలి? ఇంత బాధను కూడా ఓర్చుకున్నారంటే దాని వెనుక ఉన్న కారణం ఏంటో అర్థం కావడం లేదని శివ నారాయణ అంటాడు.
నిర్ణయం మార్చుకోవాలన్న తాత
దీపకు మళ్లీ పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పారు. మీరేమో నిర్ణయం మార్చుకోమని అంటున్నారు. కానీ ఏదో ఒక రోజు చాలా బాధపడతారు. ఇప్పటికీ అవకాశం మీ చేతుల్లోనే ఉంది. ఓ సారి ఆలోచించండని శివ నారాయణ అడుగుతాడు. కానీ కార్తీక్ ఒప్పుకోడు. బావ మాత్రం వెంటనే నో అంటాడని చెప్పా కదా తాత అని జ్యోత్స్న అంటుంది. దాసు కాల్ చేయడంతో జ్యో బయటకు వెళ్తుంది.
తండ్రిని పేరుతో
తప్పులు చేసి తప్పించుకుని తిరుగుతున్నావ్. ఇక పాపాలు చేయకమ్మా తప్పించుకోలేవని జ్యోత్స్నతో దాసు అంటాడు. చెప్పు దాసు అని జ్యోత్స్న పేరు పెట్టి పిలుస్తుంది. ముందు ఎందుకు పిలిచావో చెప్పు దాసు? నువ్వు నా నాన్నవి కాదు కదా. బాబాయి అని పిలుద్దామంటే మా నాన్న తమ్ముడివి కాదు కదా. ఇలా పిలిస్తే బాధగా ఉందా? నువ్వు నా సొంత తండ్రివి కానప్పుడు ఏమైపోతే నాకేంటీ? అని జ్యోత్స్న అంటుంది.
దాసు వార్నింగ్
నేనే అసలైన దశరథ కూతురిని. ఇదే కదా నువ్వు నన్ను నమ్మించాలనుకున్న నిజం. చెప్పు దాసు. నువ్వు ఫీల్ అవుతున్నావంటే నువ్వే మా నాన్నవి. నువ్వు నాన్నవి కాదు అని జ్యోత్స్న చెప్తుంది. దీపను ఇబ్బంది పెట్టకమ్మా. ఇప్పటికే చేసిన పాపాలు చాలు. అవకాశం దొరికిందని నువ్వు కార్తీక్, దీపను టార్చర్ చేస్తున్నావంటే ఆ పాపం నిన్ను వదిలిపెట్టదని దాసు వార్నింగ్ ఇస్తాడు.
పాపాలను చూడటం కూడా పాపమే దాసు. ఇప్పుడు సరిచేయాలని ట్రై చేస్తున్నావు. అది నీ వల్ల కాదు దాసు. ఆట మీరు మొదలెట్టారు నేను ముగిస్తా. దీప నా శత్రువు. దాని పతనమే నా లక్ష్యం. దీప ఎవరి కూతురు? ఎవరికి పుట్టింది? అని జ్యోత్స్న అడగడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


