Karthika Deepam 2 Today Episode: దీపకు మరణ గండం.. జాతకంలో షాకింగ్ నిజం! కార్తీక్ నిర్ణయం వెనుక రహస్యం ఏంటి?

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 16 ఎపిసోడ్ లో దీప బిడ్డను వద్దనుకున్న విషయాన్ని సుమిత్రకు జ్యోత్స్న చెప్తుంది. సుమిత్ర షాక్ అవుతుంది. బిడ్డను వద్దనుకోవడం వెనుక ఉన్న కారణాన్ని కనిపెడతానని శ్రీధర్ అంటాడు. మరోవైపు దీపకు మరణ గండం ఉందని గురువు చెప్తాడు.

Mar 16, 2026, 07:01:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 టుడే మార్చి 16 ఎపిసోడ్ లో.. సుమిత్ర దగ్గరకు దీప, కార్తీక్, దశరథ వెళ్తారు. నీకు ఎలా ఉందమ్మా అని సుమిత్రను దీప అడుగుతుంది. నువ్వేంటి ఇక్కడున్నావ్? నిన్ను హాస్పిటల్లో చేర్పించారని విన్నా. నన్ను చూడటానికి వచ్చావా ఏంటీ అని దీపను సుమిత్ర అడుగుతుంది. రావడం ఎందుకు? ఫోన్ చేస్తే సరిపోయేదని సుమిత్ర అంటుంది.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

సుమిత్రకు తెలిసిన నిజం

బిడ్డ క్షేమంగా ఉందా? అని దీపను సుమిత్ర అడుగుతుంది. బిడ్డ క్షేమం గురించి నువ్వు ఎన్ని సార్లు అడిగినా దీప సమాధానం చెప్పలేదు మమ్మీ. ఎందుకంటే దీప తన బిడ్డను వదిలేసుకుంటుంది. తనకు పిల్లలు వద్దంటా. ఈ కడుపు భారంగా ఉందంటా. ఈ బరువు దించేసుకోవాలని హాస్పిటల్లో చేరిందని అప్పుడే వచ్చిన జ్యోత్స్న చెప్పడంతో సుమిత్ర షాక్ అవుతుంది.

రెచ్చగొట్టేలా జ్యోత్స్న

నా భార్య, నా బిడ్డ, నా ఇష్టం. ఎవరూ జోక్యం చేసుకోవద్దని కార్తీక్ అంటాడు. దీప ఏమైందమ్మా నీకు అని సుమిత్ర అడుగుతుంది. ఛాన్స్ దొరికింది కదా అని జ్యోత్స్న రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. ఈ దీప ఎప్పుడూ ఎవరో ఒకరి చావును కోరుకుంటూనే ఉంది. ఒకప్పుడు మా డాడీని చంపాలనుకుంది. అయినా మా వాళ్లకు సిగ్గు లేదు కాబట్టి నమ్మి ఇంట్లో అడుగుపెట్టనిచ్చారని జ్యోత్స్న అంటుంది.

మనుషులను చంపడం

అలా అయితే సిగ్గు లేనిది నీకే. అగ్రిమెంట్ పేరుతో ఇంట్లో ఉండే పర్మిషన్ ఇచ్చింది నువ్వేనని జ్యోత్స్నతో కార్తీక్ అంటాడు. మీలా నేను మనుషులను చంపే రకం కాదు కదా అని జ్యో అంటుంది. కారుతో, లారీతో గుద్దేయడం మాకే అలవాటు మరి అని కార్తీక్ అంటాడు. జ్యోత్స్నను ఇక ఆపుతావా అని దశరథ అరుస్తాడు. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు అడిగి తెలుసుకో మమ్మీ. దీపకు బిడ్డ అడ్డమైపోయిందని సుమిత్రతో జ్యోత్స్న అంటుంది.

గౌరవం లేదు

ఇది నాకు, నా భార్యకు సంబంధించిన విషయం. పూర్తిగా వ్యక్తిగతం. ఎవరూ దయచేసి మాట్లాడొద్దని కార్తీక్ అంటాడు. నీ భార్య వద్దంటుందా? నువ్వే వద్దనుకుంటున్నావా? అని కార్తీక్ ను సుమిత్ర అడుగుతుంది. అప్పుడే వచ్చిన శివ నారాయణ.. సుమిత్ర, వీళ్లు మనకు ఏం చెప్పరు? వీళ్లకు మన అవసరం లేదు. మనపై ఏ గౌరవం వీళ్లకు లేదని అంటాడు. ఇలాంటి పని చేయొద్దని నువ్వైనా దీపకు చెప్పు మమ్మీ, పైగా తనకు మళ్లీ పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదని జ్యోత్స్న అంటుంది.

తప్పు దీప

జ్యోత్స్న నా కూతురు. నా ప్రాణం. దీన్ని ఎవరైనా దూరం చేస్తే నేను బతుకుతానా? ఎవరైనా దూరం చేసే ప్రయత్నం చేసినా నా ప్రాణాలు పోయినట్లే. నేను నా బిడ్డను ఇంత ప్రాణంగా ప్రేమిస్తుంటే నువ్వేంటి దీప వదిలేసుకుంటున్నావ్. తప్పు దీప అని సుమిత్ర దగ్గుతుంది. దశరథ అందరిని బయటకు పంపిస్తాడు. దీప కడుపులో బిడ్డ బతకాలండీ అని దశరథతో సుమిత్ర అంటుంది. నా ప్రయత్నం నేను చేస్తానని దశరథ చెప్తాడు.

కాంచన బాధ

దీప మాటలను తలుచుకుంటూ కాంచన కుమిలిపోతుంది. ఇంటికి వెళ్దామా అని శ్రీధర్ అడిగితే, మీరు వెళ్లిపోండి, ఎక్కడికి వెళ్లాలో నాకు అర్థం కావడం లేదని కాంచన బాధపడుతుంది. ఆలోచనలను వదిలేసి వెళ్లిపోలేం. నా కొడుకు చేసిన పనికి నేను కోలుకోవడానికి చాలా టైమ్ పడుతుందని కాంచన అంటుంది. అప్పుడే వచ్చిన కార్తీక్ అమ్మతో మాట్లాడాలని అంటాడు.

ఫీలైన శ్రీధర్

నాతో మాట్లాడొద్దని కాంచన అంటుంది. కార్తీక్ అంటే ఆకాశం. నిన్ను అలా తలెత్తి చూసేవాణ్ని. కానీ ఇప్పుడు మామూలు మనిషిగా నేలమీదకు దిగిపోయావు. నువ్వు నీ బిడ్డను వద్దనుకున్నావు కానీ నేను నా బిడ్డను వద్దనుకోలేదు కదా. నువ్వు నాకు కావాల్రా. నీలా నేను వదిలేసుకునే తండ్రిని కాదు. నా కొడుకు అన్ని ఆలోచించే చేస్తాడనే నమ్మకం పోయిందని శ్రీధర్ ఫీల్ అవుతాడు.

కారణం ఏంటీ?

నువ్వు చెప్తున్న దాని వెనుక ఏదో బలమైన కారణం ఉందనిపిస్తుంది. ముందు ఆ కారణం ఏంటో చెప్పు అని కార్తీక్ ను శ్రీధర్ అడుగుతాడు. భార్య బిడ్డను మోయలేనంది, వీడు సరేనన్నాడు. వీడికి భార్య సంతోషంగా ఉంటే చాలు తల్లి అవసరం లేదని కాంచన కోప్పడుతుంది. నువ్వు బయటకు చెప్పుకోలేక మోస్తున్న ఆ భారం ఏంటీ అని కార్తీక్ ను శ్రీధర్ అడుగుతాడు.

అది నువ్వే తెలుసుకో మాస్టారు అని కార్తీక్ అంటాడు. అదేంటో నేను తెలుసుకుంటానని శ్రీధర్ చెప్తాడు. మీ అమ్మ మాత్రం ఈ విషయంలో నిన్ను ఎప్పటికీ క్షమించదు. నీ తల్లి ఆశలను నీ నిర్ణయాల కోసం చంపే అర్హత నీకు ఉందేమో కానీ బతికించే అవకాశం మళ్లీ ఉండదని చెప్పిన శ్రీధర్ కాంచనను తీసుకొని వెళ్తాడు.

చావు ముంగిట్లో

గుడికి వెళ్లి గురువును దశరథ కలుస్తాడు. దీప జాతకాన్ని చూపించి ఈ వ్యక్తి భవిష్యత్ ఎలా ఉండబోతుందో చెప్పమని గురువును అడుగుతాడు. ఇప్పటివరకూ అంతా ప్రశ్నార్థకంగానే ఉందంటాడు. కొన్ని దైవ లిఖితాలు. చూడటానికే కాదు మార్చడానికి సరిపోదు. ఈ జాతకం కలిగిన వ్యక్తి చావు ముంగిట్లో ఉంది. మరణ గండం ఉంది. తన ఉనికే తనకు ప్రమాదం. రాబోయే ప్రమాదం నుంచి ఈ మనిషి తప్పించుకోలేదని గురువు చెప్తాడు.

ప్రమాదం తప్పదని గురువు చెప్పడంతో దశరథ షాక్ అవుతాడు. మరోవైపు అవసరం నాది, నిందలు నువ్వు పడుతున్నావు బావ అని దీప ఫీల్ అవుతుంది. ఆపరేషన్ జరిగేంత వరకు ఎన్ని అవమానాలైనా మనం మోయాలి దీప అని కార్తీక్ అంటాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More