Karthika Deepam 2 Today Episode: షాకింగ్ ట్విస్ట్-అబద్ధం చెప్పానని నింద తనపై వేసుకున్న దీప! కార్తీక్ నిర్ణయంతో అంతా షాక్

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 13 ఎపిసోడ్ లో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. దీపను జ్యోత్స్న గన్ తో షూట్ చేసినట్లు ఊహించుకున్న దశరథ నిజం చెప్పకుండా ఆగిపోతాడు. దీప నింద మొత్తాన్ని తన మీద వేసుకుంటుంది. కార్తీక్ ఈ నిర్ణయం తనదేనంటాడు.

Published on: Mar 13, 2026, 06:48:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 13 ఎపిసోడ్ లో.. తాను దీప గురించి నిజం చెప్పినట్లు, జ్యోత్స్న దీపను షూట్ చేసినట్లు ఊహించుకున్న దశరథ నో అని గట్టిగా అరుస్తాడు. దీపను చంపేస్తానని దాసుతో జ్యోత్స్న చెప్పిన మాటలను దశరథ గుర్తు చేసుకుంటాడు. తొందరపడితే దీపను జ్యోత్స్న బతకనివ్వదని దశరథ అనుకుంటాడు.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

అబద్ధం చెప్పారని

నీ కోడలు నీతో అబద్ధం చెప్పిందని స్ఫష్టంగా అర్థమైంది. అందుకు నీ కొడుకు కూడా సపోర్ట్ చేశాడని నీకు తెలుసు. నిజాలు బయటపడాలంటే దీపనే అడగాలి అని కాంచనతో పారిజాతం అంటుంది. కానీ దశరథ ఏమో దీపను వెనకేసుకొస్తాడు. బావ, దీప అబద్ధం చెప్తున్నారని జ్యోత్స్న చెప్పింది. కానీ నేను నమ్మేలేదు. అయితే రిపోర్ట్స్ చూశాక మీపై నమ్మకం పోయిందని శివ నారాయణ అంటాడు.

కార్తీక్ దే తప్పు

తప్పు చేసింది దీప అని నువ్వు అంటున్నావు. కానీ అందుకు మూల కారణం కార్తీక్. కడుపులో బిడ్డకే సమస్య ఉందని కన్నతల్లికే అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముందని జ్యోత్స్నతో కాంచన అంటుంది. డాక్టర్ చెప్పింది నిజమే కదా. మరి తప్పు ఎవరిది? సమస్య ఉందని చెప్పిన నా కొడుకుదే అవుతుందని కాంచన మండిపడుతుంది.

ఇష్టం లేదన్న దీప

నిజం చెప్పకుండా నువ్వు వెళ్లావో నన్ను చంపినంత ఒట్టేనని కాంచన అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఇది కోపం కాదు. నా బాధ. నువ్వంటే బయటదానివి నా బాధ నీకు ఎలా అర్థం అవుతుందని దీపతో కాంచన అంటుంది. నిజం మాత్రం చెప్పాల్సిందేనని కాంచన పట్టుపడుతుంది. బావ చెప్పలేడు, ఎందుకంటే కడుపులో బిడ్డను నేను వద్దనుకుంటున్నా. ఈ బిడ్డను కనడం నాకు ఇష్టం లేదని దీప చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.

బొట్టు చెరిపేయ్

మరోవైపు కాశీ, స్వప్నతో దాసు మాట్లాడతాడు. పెళ్లి రోజు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదని స్వప్న అంటుంది. అయితే పాపిట్లో సింధూరం దిద్దుకున్నావు కదా దాన్ని చెరిపేసేయ్ అని స్వప్నతో కావేరి అంటుంది. భర్త అనే రెండు అక్షరాలే బరువు అయినప్పుడు నుదుటిపై సింధూరం ఏం మోస్తావని కావేరి కోపంతో అంటుంది.

స్వప్న కోపం

కాశీ తప్పు లేదా? నిజాయతీ, నమ్మకాన్ని సంపాదించుకోవడం చాలా కష్టం. దాన్ని పోగొట్టుకోవడం అంటే ఏంటో మీరే ఆలోచించండని స్వప్న మండిపడుతుంది. దాసు, కావేరి ఎంత చెప్పినా స్వప్న వినదు. మీకు ఇష్టం లేకపోతే ఇంట్లో నుంచి వెళ్లిపోతానని స్వప్న అంటుంది. పెళ్లి అయినప్పటి నుంచి పెళ్లి రోజు వరకు జరిగిన మీ జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకోండని చెప్పి దాసు వెళ్లిపోతాడు. కావేరి కూడా లోపలికి వెళ్తుంది.

దీపపై నింద

బిడ్డను కడుపులో మోయడం ఇష్టం లేదా? అని దీపను కాంచన అడుగుతుంది. అవును అత్తయ్య, నాకు పిల్లలను కనడం ఇష్టం లేదు. అందుకే బిడ్డ వల్ల నాకు సమస్య ఉందని బావతో అబద్ధం చెప్పించానని నింద మొత్తం తనపైనే దీప వేసుకుంటుంది. కాంచనను పారిజాతం రెచ్చగొడుతుంది. బిడ్డను వద్దనుకున్నావా? నీ కొడుకు వారసత్వాన్ని నీ చేతుల్లో పెడతానని నాకు ఎందుకు మాట ఇచ్చావ్ అని కాంచన అడుగుతుంది.

డాక్టర్ మెసేజ్

నీకు ఎందుకు ఇష్టం లేదో చెప్పు, నీకు ఏం తక్కువ చేశానో చెప్పు. మరోసారి ఏమైనా పిల్లలను కనాలని అనుకున్నావా? అని దీపను కాంచన అడుగుతుంది. అప్పుడే డాక్టర్ చేసిన వాయిస్ మెసేజ్ గురించి జ్యోత్స్న చెప్తుంది. ఈ కాన్పు అయిన తర్వాత దీపకు ఈ జన్మలో మళ్లీ పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ పంపిన వాయిస్ మెసేజ్ ను అందరికీ జ్యోత్స్న వినిపిస్తుంది.

నిర్ణయం నాదే

ఇంత బుద్ధిలేని నిర్ణయాన్ని ఎలా తీసుకున్నావ్ దీప అని శ్రీధర్ ప్రశ్నిస్తాడు. దీపను నిలదీసి అడగాలని అనిపించట్లేదా? అని కార్తీక్ ను కాంచన అడుగుతుంది. నింద నీ ఒక్కదాని మీదే వేసుకోకు దీప. మేం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం. మేం అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే నిర్ణయం నాదే అని కార్తీక్ అంటాడు.

ఏదో వస్తువును వదిలేసుకున్నంత తేలికగా బిడ్డను వదిలేసుకుంటున్నాం అంటారేంటీ? అది ప్రాణం రా. ఈ ఇంటి నాలుగో తరం. మీ అత్తకు బ్లడ్ క్యాన్సర్. ఇక్కడ ఓ ప్రాణాన్ని కాపాడుకునేందుకు ఇంతలా పరితపిస్తుంటే, ఒక ప్రాణాన్ని ఎలా వద్దనుకుంటారని శివ నారాయణ అడుగుతాడు. ఇప్పుడు నీ కూతురు, అల్లుడు కలిసి మీ అమ్మను చంపేస్తామంటే మాట్లాడవేంటీ అని దశరథను శివ నారాయణ, కాంచన అడుగుతారు.

దశరథకు ఈ విషయం ముందే తెలుసు. నిజాన్ని దాచాడని పారిజాతం షాక్ ఇస్తుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More