Karthika Deepam 2 Today Episode: దీపను చంపే చస్తా.. కార్తీక్ పెళ్లి చేసుకోవాలంటూ జ్యోత్స్న కండీషన్.. బావ మరదళ్ల ఛాలెంజ్

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 6 ఎపిసోడ్ లో దాసును జ్యోత్స్న నానామాటలు అంటుంది. తనను పెళ్లి చేసుకుంటే నిజాలు ఒప్పుకుంటానని కార్తీక్ తో చెప్తుంది. కానీ కార్తీక్ అందుకు ఒప్పుకోడు. నిజం చెప్పేస్తానంటాడు. దీపను చంపేస్తానని జ్యోత్స్న వార్నింగ్ ఇస్తుంది.

Published on: Apr 6, 2026, 07:03:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్ జ్యోత్స్న ఎత్తులు, కార్తీక్ పై ఎత్తులతో ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. కేక్ లో జ్యో విషం కలపడం, కార్తీక్ ఆ కేక్ మార్చేయడం హైలైట్ గా నిలిచింది. మరి కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 6 ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

దాసుపై సీరియస్

నా స్థాయి బట్టలే కొనలేనివాడివి నువ్వు నాకు మంచి బతుకునిస్తావా అని దాసును అవమానించేలా జ్యోత్స్న మాట్లాడుతుంది. ఈ ఇంటి వారసురాలిగా ఉండాలన్నది మా నానమ్మ కోరిక. ఆ రోజు బిడ్డను మారుస్తుంటే అడ్డు పడొచ్చు కదా. కానీ నువ్వు ఆ పని చేయలేదు. ఎందుకంటే నీ కూతురు కోట్లలో బతకడం నీకు ఇష్టమే. కానీ కొన్ని రోజుల తర్వాత జ్ణానోదయం అయిందని జ్యోత్స్న అంటుంది.

ఇది నా ఆస్తి

ఎవరైతే నా బావను నాకు కాకుండా చేసిందో అదే ఈ ఇంటి వారసురాలని తెలిసింది. నిజం చెప్తానని నువ్వు దిగావు. ఇప్పుడు శౌర్య దీప కూతురు కాదని ఎవరో తీసుకెళ్తే శౌర్య వెళ్తుందా? వెళ్లదు ఎందుకంటే కంఫర్ట్. అలాగే ఇది నా ఇల్లు. దశరథ, సుమిత్ర మా అమ్మానాన్న. శివ నారాయణ ఆస్తి నాది. వారసురాలు అంటూ ఇప్పుడు ఎవరో వస్తే పూలు చల్లి స్వాగతిస్తానా? అని జ్యోత్స్న గట్టిగా అరుస్తుంది.

జ్యోత్స్న బ్లాక్ మెయిల్

నేను ఇప్పుడే కిందకు వెళ్లి నిజం చెప్తానని దాసు అంటే.. నేను మేడ మీద నుంచి దూకి చస్తానని జ్యోత్స్న బ్లాక్ మెయిల్ చేస్తుంది. నువ్వు నిజం చెప్పేలోపే నా చావు కేక మమ్మీకి వినిపిస్తుంది. ఆమె గుండె ఆగి చస్తుంది. బాధతో మా డాడీ, బెంగతో తాతయ్య ఇలా అందరూ చచ్చిపోతారని జ్యోత్స్న అంటుంది. నా కూతురు నాక్కావాలి అని కార్తీక్ కు చెప్పి దాసు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

కాంచన అనుమానం

సీన్ కాంచన ఇంటికి మారుతుంది. ఇప్పుడు నా కొడుకు నాకు అర్థం కావడం లేదు. భోజనాల దగ్గర, కేక్ కటింగ్ దగ్గర కార్తీక్ ను గమనించారా? ఏదో జరిగిపోతుందన్నట్లు ఊరికే కంగారు పడ్డాడని కాంచన అంటుంది. అందరిలో ఉన్నాడో కానీ వాడు దేని గురించో టెన్షన్ పడుతున్నాడని శ్రీధర్ చెప్తాడు. కార్తీక్ అలా ఎందుకు ఉన్నాడో చెప్పమంటే తెలీదని దీప చెప్తుంది.

కొన్ని విషయాలు మీరు బాధపడకూడదని దాస్తున్నా. కొన్ని విషయాలు మీరు తట్టుకోలేరని దాస్తున్నానని కాంచనతో దీప అంటుంది. తరతరాలుగా అత్తా కోడళ్ల మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో గాయపడ్డ సైనికుడిలా మగాడు మిగిలిపోతున్నాడని శ్రీధర్ వెటకారంగా చెప్తాడు.

తాళి కట్టు బావ

ఇక జ్యోత్స్న, కార్తీక్ మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. నేను చస్తే నీకేంటి బావ? మా నాన్నకు అంటే నా మీద ప్రేమ ఉంది కాబట్టి సెంటిమెంట్ తో బ్లాక్ మెయిల్ చేస్తుంటానని జ్యోత్స్న అంటుంది. తప్పులు ఒప్పుకో మరదలా అని కార్తీక్ అంటే, తనను పెళ్లి చేసుకోమ్మని జ్యోత్స్న అడుగుతుంది. నన్ను నీ భార్యను చేసుకున్నావంటే నేను మంచిదానిగా మారిపోతా. నేను నీ భార్యగా ఉంటా. నాకు ఏం తక్కువా? నా మెడలో తాళి కట్టు అని కార్తీక్ ను జ్యోత్స్న అడుగుతుంది.

దీపను చంపేస్తా

దీప తప్ప ఎవరిని నా భార్యగా ఊహించుకోలేనని కార్తీక్ అంటాడు. నేను కూడా అంతే, ఈ ఇంటి వారసురాలిగా తప్ప దాసు కూతురిగా ఊహించుకోలేేనని జ్యోత్స్న అంటుంది. తప్పు ఒప్పుకోవాల్సిందేనని కార్తీక్ అంటే, అది జరగదని జ్యోత్స్న తెగేసి చెప్తుంది. నేనే వెళ్లి అందరికీ నిజం చెప్పేస్తానని కార్తీక్ అంటాడు. నేను చస్తాను, చంపేముందు దీపను చంపే చస్తా. దీప ప్రాణం అంటే నీకు లెక్కే కదా. దీప కడుపులో ఓ ప్రాణం పెరుగుతుంది. బోనస్ గా మరో ప్రాణం పోతుందని జ్యోత్స్నలోని విలన్ మరో లెవల్ కు వెళ్తుంది.

ఛాలెంజ్

నీకు భయాన్ని పరిచయం చేస్తానని కార్తీక్, అది నీ వల్ల కాదని జ్యోత్స్న ఛాలెంజ్ చేసుకుంటారు. నేను పెట్టే టార్చర్ తట్టుకోలేక నీకు నువ్వు నిజం చెప్పేలా చేస్తానని కార్తీక్ సవాలు చేస్తాడు. ట్రై చేయ్, అంతవరకు ఈ నిజాలు ఎవరు చెప్పొద్దని జ్యోత్స్న అంటుంది. ఐయామ్ ఎ విలన్, ఉత్తమ విలన్ అని జ్యోత్స్న పొగరుగా అంటుంది. నిన్ను కమెడియన్ గా మారుస్తానని కార్తీక్ చెప్తాడు. అక్కడి నుంచి జ్యోత్స్న, కార్తీక్ వెళ్లిపోతారు.

పెళ్లి సంబంధాలు

నీ జాతకం చెప్పేస్తా. నీకు కార్తీక్ మీద ఇంకా ఆశ చావలేదు కదా. టెర్రస్ మీద మీ మంతనాలు ఏంటీ? అని జ్యోత్స్నను పారిజాతం అడుగుతుంది. నీకు చెప్పాల్సిన అవసరం లేదని జ్యో అంటుంది. దీపకు ఏదైనా హానీ చేయాలనుకుంటున్నావా అని పారు అడుగుతుంది. అప్పుడే సుమిత్ర, దశరథ, శివ నారాయణ వస్తారు. జ్యోత్స్నకు ఇక సంబంధాలు చూడాల్సిందేనని దశరథ అంటాడు.

దిష్టి తీసిన కార్తీక్

నేను నీ మనవరాలిని తాత. నేను ఏం చేస్తే మీరు ఆనందంగా ఉంటారో నాకు తెలుసు కదా అని శివ నారాయణతో డ్రామా ఆడుతుంది జ్యోత్స్న. మరోవైపు ఇంటికి వచ్చిన కార్తీక్ స్వయంగా తన చేతులతో దీపకు, కడుపులో బిడ్డకు దిష్టి తీస్తాడు. దీంతో కార్తీక్ పై దీపకు, కాంచనకు డౌట్ వస్తుంది. దీపకు ఎందుకు దిష్టి తీశావని కాంచన అడగడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More