Karthika Deepam 2 Today Episode: దీపకు జ్యోత్స్న ఆఫర్- చెంపదెబ్బపై తాత, తల్లి ఆరా- దీప జోలికొస్తే చేయి నరుకుతానన్న పారు

Karthika Deepam 2 Serial April 14th Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఏప్రిల్ 14వ ఎపిసోడ్‌లో దీప, జ్యోత్స్న వాదించుకుంటారు. దీపకు జ్యోత్స్న ఆఫర్ ఇస్తుంది. కానీ, దీప ఒప్పుకోదు. ఇంటికెళ్లిన జ్యోత్స్న చెంపపై ఎర్రగా ఉండటంతో శివ నారాయణ, సుమిత్ర ఆరా తీస్తారు. జ్యోత్స్నకు పారిజాతం వార్నింగ్ ఇస్తుంది.

Published on: Apr 14, 2026, 07:39:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో దీపతో జ్యోత్స్న గొడవ పడుతుంది. బావకు భార్య అంటే నేనే, నిన్ను భార్యగా నేను ఒప్పుకోను అని జ్యోత్స్న అంటుంది. నేను నా బావతో నా మెడలో మూడు ముళ్లు కట్టించుకుంటాను, బావతో తాళి కట్టించుకోకుంటే నాపేరు జ్యోత్స్న కాదు అని జ్యో అంటుంది.

కార్తీక దీపం 2 సీరియల్ ఏప్రిల్ 14 ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ ఏప్రిల్ 14 ఎపిసోడ్

నీ దగ్గర ఏముందే అనాథ

నేను సుమిత్ర కూతురిని కాదు అయితే.. భయపడాలా.. నా దగ్గర నీ నాన్న, తాత, అమ్మ ఉన్నారు. నీ దగ్గర ఏముందే అనాథ అని చేయెత్తి చూపిస్తుంది జ్యోత్స్న. బావ ఉన్నాడు అని, ఎవరి కోసం అయితే నువ్వు బతుకుతున్నా అంటున్నావో ఆ మనిషి నాతో బతుకుతున్నాడు అని స్ట్రాంగ్ పంచ్ ఇస్తుంది జ్యోత్స్న. ఇప్పుడు చెప్పు అనాథ ఎవరో అని దీప అంటుంది.

కరెక్టే.. నువ్వు కొట్టినదానికంటే ఈ మాటే ఎక్కువ మండుతుంది. సరే మనం ఒక డీల్‌కు వద్దాం. ఎక్సెంజ్ ఆఫర్ చేసుకుందాం. నువ్వే సుమిత్ర కూతురు అని చెప్పేస్తే.. ఇవన్నీ నువ్వే తీసేసుకో కానీ బావకు నాకు పెళ్లి చేయి, నాకు ఏం వద్దు. బావ ఉంటే చాలు అని జ్యోత్స్న అంటుంది. ఇక్కడ నీకంటూ ఉంది పేరు మాత్రమే. అన్నీ దీపవే అని కార్తీక్ అంటాడు.

నేను ఆఫర్ ఇచ్చింది దీపకు. కావాలంటే బోనస్‌గా బావకు నాకు పుట్టిన పాపకు నీ పేరు పెట్టుకుంటాం. నేను బావ దూరంగా వెళ్లి బతుకుతాం అని జ్యోత్స్న అంటుంది. దీప ఒప్పుకోదు. చచ్చిపోతుంది.. నేను కూతురు కాదని తెలిస్తే మీ అమ్మ చచ్చిపోతుంది. తెలియని వయసులో ఒక తల్లిని చంపుకున్నావ్. ఇప్పుడు తెలిసి చంపుకుంటున్నావ్. ఏం చేసిన నీ తల్లి బతకదు అని జ్యో అంటుంది.

రోడ్డు మీదకు లాగగలను

అత్తను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే రోడ్ మీదకు లాగగలను అని కార్తీక్ అంటాడు. తలుచుకో.. ఏం చేసిన నీ తల్లి బతకదు. బతకాలంటే కూతురుగా నేనే ఉండాలి. ఇప్పుడు నేను నీ తల్లికి ఊపిరిని కూడా. నా ఆఫర్ ఒప్పుకోవడం తప్పా నీకు ఇంకో దారి లేదు. బాగా ఆలోచించు. భర్త సలహా తీసుకో. ఫోన్ చేసి ఒప్పుకున్నట్లు చెప్పు. నీకు వారసురాలిగా అభిషేకం, నాకు బావతో హనీమూన్ అని జ్యోత్స్న అంటుంది.

ఇలా స్వార్థంగా ఆలోచిస్తే నష్టం నీకే. ఇంతవరకు వచ్చిన నేను నా ఇంట్లోకి రాలేనా అని దీప అంటే.. రానివ్వను అని జ్యో అంటుంది. మెడలో తాళి కాదు నా బావ చిటికనవేలు కూడా తాకనివ్వను అని దీప అంటే.. కార్తీక్ విజిల్ వేస్తాడు. మనిషిగా మారు అని దీప అంటే.. నాకు బావకు పెళ్లి గోవాలో చేస్తే ఎలా ఉంటుందంటావ్ అని జ్యో అంటుంది. గూబ పగిలిపోయేలా ఉంటుందని దీప అంటే.. అయితే అదిరిపోతుందని జ్యో అంటుంది.

ఇది మారదు బావ పదా అని దీప, కార్తీక్ వెళ్లిపోతారు. తర్వాత జ్యోత్స్న ఇంటికి వెళ్తుంది. అసలు ఏమైందని జ్యోత్స్నను నిలదీస్తుంది సుమిత్ర. ఏం కాలేదని, దీప వచ్చిందని బావ ఇంటికి వెళ్లిపోయాడని, తనే డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చినట్లు చెబుతుంది జ్యోత్స్న. చూశారా మావయ్య కార్తీక్ జ్యోత్స్నను వదిలేసి పోయాడట అని సుమిత్ర అంటే.. అసలు ఇంతదాకా తెచ్చుకోవడం ఎందుకు అని శివ నారాయణ అంటాడు.

నా కూతురు ఇచ్చిన బహుమతి

జ్యోత్స్న చెంపపై దీప కొట్టిన అచ్చు చూసి చెంపకు ఏమైందని అడుగుతాడు శివ నారాయణ. సుమిత్ర కూడా అడుగుతుంది. దీప చెంపదెబ్బపై జ్యోని తల్లి, తాత ఆరా తీస్తారు. నా కూతురు దీప ఇచ్చిన బహుమతి అయి ఉంటుందని దశరథ్ మనసులో అనుకుంటాడు. సుమిత్ర తాకితే నొప్పితే అరుస్తుంది జ్యోత్స్న. ఐస్ పెట్టుకుంటే సరిపోతుందని, రెస్ట్ తీసుకోవాలని వెళ్లిపోతుంది జ్యోత్స్న. పారిజాతం ఎదురవుతుంది. ఇద్దరు చూసుకుంటారు. జ్యో వెళ్లిపోతుంది.

అద్దంలో దీప కొట్టిన చెంపదెబ్బ చూస్తూ రగిలిపోతుంది. వెన్నె రాసుకోలేకపోయావా అని పారిజాతం వచ్చి అడుగుతుంది. అడ్డదిడ్డంగా జ్యో అనేసరికి ఇలా వాగితేనే దీప కొట్టినట్లుంది. నీకు కార్తీక్ వెర్రి పట్టుకుందని, జ్యో చేసిందంతా చెబుతుంది పారిజాతం. నీకు ఈ బుద్ధులన్నీ నేర్పించి చచ్చింది నేనే. అమ్మ తల్లి క్షమించు. కార్తీక్ దీప మొగుడు వాన్ని అలాగే వదిలేయు అని పారిజాతం అంటుంది.

అయినా జ్యోత్స్న వినదు. జరిగింది అంతా నేను మారుస్తాను. దీపను బ్రతకనివ్వను అని జ్యో అంటే.. అది నేనుండగా జరగదు. దీపను చంపడం కాదు కదా. దాని ఒంటిమీద నీ గోటి గీత పడిన నీ చేయి నరికిపారేస్తాను పారిజాతం వార్నింగ్ ఇస్తుంది. దాంతో జ్యో షాక్ అవుతుంది. దీబ గర్భగుడి అయితే.. నేని గాలిగోపురాన్ని. దీపను ఏం చేయాలంటే ఈ గోపురాన్ని దాటాలి అని పంచ్‌లు ఇస్తుంది పారిజాతం.

కాంచనకు అనుమానం

నువ్వు ఏం చేయలేవు. బుక్‌లో రాసుకో. ఇప్పుడు నా ట్రెండ్ నడుస్తోంది. బ్రేకులు లేని లారీలా గుద్దుకుంటుపోతాను అని పారిజాతం వెళ్లిపోతుంది. గ్రానీ ఉండగా దీపను ఏం చేయలేను అనుకుంటా.. సాయిరాం.. దీపకంటే ముందు గ్రానీని ఏదోటి చేయాలి అని జ్యోత్స్న అనుకుంటుంది. దీప ఈ చెంపదెబ్బను మర్చిపోను. ఇంతకంటే అవమానం నీకు ఎలా చేయాలో నాకు బాగా తెలుసు అని రగిలిపోతుంది జ్యోత్స్న.

మరోవైపు కార్తీక్‌ను తిడుతుంది కాంచన. జ్యోత్స్న మీతో ఇంతలా ఆడుకుంటుంది. మీరెందుకు భరిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని కాంచన అంటుంది. ఇంతలో శౌర్య వచ్చి ఎక్కడికి వెళ్లారని అడుగుతుంది. ఎక్కడికి లేదే ముందు వాళ్లు ఫ్రెష్ అప్ కానీ. స్నానం చేసి వెళ్లండి. కార్తీక్ జ్యోత్స్నతో జాగ్రత్తరా అని కాంచన అంటుంది. అమ్మకు అనుమానం వచ్చినట్లుందని కార్తీక్ అనుకుంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More