Karthika Deepam 2 Today Episode: జ్యోత్స్నకు మొగుడయ్యేలా ఉన్నావ్-కార్తీక్‌కు దీప షాక్-జ్యో ప్లాన్-దీపపై సుమిత్ర సీరియస్

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఏప్రిల్ 16 ఎపిసోడ్ లో కాంచనకు వచ్చిన కల గురించి మాట్లాడుతూ దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. అదే సమయంలో శివ నారాయణ ఫ్యామిలీ అక్కడికి వస్తుంది. దీప మాటలు విన్న జ్యోత్స్న మరో కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. సుమిత్రకు దీప మీద కోపం వచ్చేలా చేస్తుంది.

Apr 16, 2026, 06:54:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న మెడలో కార్తీక్ తాళి కట్టినట్లు కాంచన కల కనడంతో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కల నిజం అవుతుందేమోనని కాంచన భయపడుతుంది. మరోవైపు బావను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని జ్యోత్స్న అనుకుంటుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక్ దీపం 2 టుడే ఏప్రిల్ 16 ఎపిసోడ్ లో చూద్దాం.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

దీప కోపం

కాంచనకు వచ్చిన కల గురించి కార్తీక్ మాట్లాడుతుంటే దీప కోపంతో వెళ్లిపోతుంది. ఎందుకు చెప్పావమ్మా అని కార్తీక్ అడిగితే తప్పంతా నాదేరా అంటూ కాంచన కూడా లోపలికి వెళ్లిపోతుంది. తల్లి, భార్య ఎందుకు అలుగుతారో తెలియదు. మనం ఏ తప్పు చేయకున్నా సారీ చెప్పాల్సిందేనని కొడుక్కి శ్రీధర్ హితబోధ చేస్తాడు.

బావను పెళ్లి చేసుకుంటానని

బావతో మెడలో తాళి కట్టించుకుంటానని జ్యోత్స్న చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ గంగానదికి ఆనకట్ట వేయడం కష్టమనుకుంటూ కార్తీక్ వస్తాడు. ఆ కన్నీళ్లు ఏంటీ అని కార్తీక్ అడుగుతాడు. నీకు తెలియనట్లు నటించకు అని దీప అంటుంది. బావతో తాళి కట్టించుకోకపోతే తన పేరు జ్యోత్స్ననే కాదని జ్యోత్స్న సవాలు చేసింది. ఈ విషయం అత్తకు తెలియదు. కానీ అత్తకు కల వచ్చిందని దీప ఫీల్ అవుతుంది.

నువ్వే మొగుడిగా

ఇది నిజంగా జరిగి తీరుతుందని దీప గొడవ చేస్తుంది. జ్యోత్స్న అసలే రాక్షసి. దాన్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? దానికి ఎవరో ఒకరిని మొగుణ్ని చేస్తానని కార్తీక్ అంటాడు. అదే ఏదో నువ్వే అయ్యేలా ఉన్నావని దీప షాక్ ఇస్తుంది. నీకు నా మీద అనుమానం ఏంటే తల్లి? కలలన్నీ నమ్మి నా మీద లేనిపోని అనుమానం పెట్టుకోకు. ఊహలు మాత్రం ప్రశాంతాన్ని పోగొడుతాయి. ప్రాణాలు తీస్తాయని కార్తీక్ వివరిస్తాడు.

కార్తీక్ ఇంటికి ఫ్యామిలీ

కార్తీక్ ఎంత చెప్పినా దీప వినదు. మళ్లీ దాని నోటి నుంచి నిన్ను పెళ్లి చేసుకుంటాననే మాట రానివ్వు, చాలా పెద్ద గొడవ అవుతుంది. అది నీ కోసం మన ఇంటికి వస్తే అని దీప అడుగుతుంది. మన ఇంటి వాకిట్లో కూడా అడుగుపెట్టనివ్వనని కార్తీక్ అంటాడు. సరిగ్గా అదే సమయంలో జ్యోత్స్నతో సహా శివ నారాయణ ఫ్యామిలీ మొత్తం కార్తీక్ ఇంటికి వస్తుంది.

కాంచన అనుమానం

నాన్న, అన్నయ్య, వదినను చూసి కాంచన హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇవన్నీ ఏంటీ అని కాంచన అడుగుతుంది. చూస్తుంటే కల నిజమయ్యేలా ఉంది. జ్యోత్స్నను కార్తీక్ కు ఇచ్చి పెళ్లి చేయమని అడిగేందుకు అయితే రాలేదు కదా అని కాంచన అనుమానపడుతుంది. నా అల్లుడు ఏడమ్మా అని దశరథ అంటే, అల్లుడు ఏంటి అన్నయ్య? మేనల్లుడు కదా అని కాంచన అంటుంది.

జ్యోత్న్స ప్లాన్

దీప, కార్తీక్ ను పారిజాతం పిలుస్తానంటే జ్యోత్స్న అడ్డుకుంటుంది. నేనే వెళ్లి పిలుస్తానని జ్యో వెళ్తుంది. జ్యోత్స్న మెడలో నువ్వు తాళి కట్టినట్లు అత్తకు తెల్లవారు జామున కల వచ్చినట్లు చెప్తే బాధపడకుండా ఎలా ఉంటాను? నీ భార్యగా ఈ మాట తీసుకోవడం కష్టంగా ఉంది బావ అని దీప చెప్పడం జ్యోత్స్న వింటుంది. బాధపెట్టే అవకాశం నువ్వే ఇచ్చావని జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

స్పీకర్ ఆన్ చేసి

పెరట్లో వాళ్లు లేరని తిరిగి ఇంట్లోకి వెళ్లి జ్యోత్స్న అబద్ధం చెప్తుంది. కార్తీక్ కు కాల్ చేస్తుంది. దీప ఫోన్ తీసుకుని జ్యోత్స్న మీద అరిచేస్తుంది. జ్యో కావాలనే స్పీకర్ ఆన్ చేస్తుంది. నీకు నచ్చినట్లు ఫోన్ చేసి, నచ్చినట్లు మాట్లాడొచ్చని అనుకున్నావా? డ్యూటీ టైమ్ లో తప్పా మామూలు టైమ్ లో నువ్వు ఫోన్ చేస్తే ఊరుకోనని దీప వార్నింగ్ ఇస్తుంది. ఈ మాటలను అందరూ వింటారు. బాధపడ్డట్లు జ్యో తెగ నటిస్తుంది.

సుమిత్ర సీరియస్

అప్పుడే పారు ఫోన్ తీసుకుని మేం కుటుంబంతో సహా మీ ఇంటికి వచ్చామని చెప్తుంది. కార్తీక్, దీప లోపలికి వెళ్తారు. దీప ఎందుకు అలా మాట్లాడిందని కాంచనను శివ నారాయణ అడుగుతాడు. కార్తీక్ వెళ్లి కవర్ చేయాలని ప్రయత్నిస్తాడు. మీ భార్య ఇలా మాట్లాడుతుందని తెలియక వచ్చాం. నువ్వు మాట్లాడిన ప్రతి మాట మేం విన్నాం దీప. నా కూతురిని పట్టుకుని బుద్ధి ఉందా లేదా అని అడుగుతావా? అని సుమిత్ర సీరియస్ అవుతుంది.

దీపకు సారె

సుమిత్రను కూల్ చేయాలని దశరథ, పారిజాతం ప్రయత్నిస్తారు. కానీ దీప ఇలా మాట్లాడుతుందని అసలు ఊహించలేదని సుమిత్ర అంటుంది. అప్పుడే దాసు, అనసూయ కూడా వస్తారు. మేం దీపకు పుట్టింటి సారె తెచ్చాం. దీప కడుపుతో ఉంది. తనకు పుట్టిల్లు లేదనే లోటు తీర్చేందుకు ఇలా చేస్తున్నామని పారిజాతం చెప్తుంది.

దీప నా మనవరాలు లాంటిది. సుమిత్రకు కూతురు లాంటిది. దశరథ, సుమిత్ర చేతుల మీదుగా పెళ్లి జరిగింది కాబట్టే వాళ్లే ఈ కార్యక్రమం నిర్వహించాలని పారు హడావుడి చేస్తుంది. దీప చేతులకు సుమిత్ర గాజులు వేస్తుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More