Karthika Deepam 2 Today Episode: ఇదేం ట్విస్ట్.. జ్యోత్స్నకు తాళి కట్టిన కార్తీక్.. కాంచన భయం.. జ్యోకు దీప సపోర్ట్
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 15 ఎపిసోడ్ లో జ్యోత్స్నకు నిజం తెలుసని తనకెందుకు చెప్పలేదని కార్తీక్ ను దీప అడుగుతుంది. జ్యోకు సపోర్ట్ గా దీప మాట్లాడుతుంది. జ్యోను టార్చర్ చేసేలా పారును కార్తీక్ రెచ్చగొడతాడు. జ్యోత్స్న, కార్తీక్ కు పెళ్లి అయినట్లు కాంచనకు కల వస్తుంది.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో కార్తీక్ కోసం జ్యోత్స్న, దీప మధ్య ఛాలెంజ్ తో డ్రామా వేరే లెవల్ కు చేరుకుంది. మరోవైపు దీపకు రక్షణగా తాను ఉంటానని పారిజాతం అంటోంది. మరి కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఏప్రిల్ 15 ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.

కార్తీక్ ను ప్రశ్నించిన దీప
గదిలో గాజులు వేసుకుంటూ జ్యోత్స్న మాటలనే దీప గుర్తు చేసుకుంటుంది. అప్పుడే కార్తీక్ వచ్చి.. ఇంకా జ్యోత్స్న గురించే ఆలోచిస్తున్నావా? అని అడుగుతాడు. జ్యోత్స్నకు నిజం తెలుసని ఎందుకు చెప్పలేదని కార్తీక్ ను దీప ప్రశ్నిస్తుంది. జ్యోత్స్నకు ఎప్పుడో తెలుసు కదా అని కార్తీక్ అంటాడు. జ్యోత్స్నకు తెలుసని మనకు తెలుసు, కానీ మనకు తెలుసని జ్యోత్స్నకు తెలియదు కదా అని దీప అంటుంది.
దీప షాక్
డీఎన్ఏ టెస్టు చేయించి జ్యోత్స్న తెలుసుకుంది. నిన్ను చంపడానికి కేక్ లో జ్యోత్స్న విషం కలిపింది. నేను చూసి కేక్ మార్చానని కార్తీక్ చెప్పడంతో దీప షాక్ అవుతుంది. జ్యోత్స్నకు నువ్వంటే ప్రేమ అని దీప అంటుంది. కార్తీక్ విషయంలో జ్యోత్స్నకు సపోర్ట్ చేస్తూ దీప మాట్లాడుతుంది. ఒక మనిషి మీద మనకున్న కోపం అతను చెప్పే మంచి మాటలను కూడా విననివ్వదు. నేను ఒక ఆడదానిగా ఆలోచిస్తే జ్యోత్స్న చెప్పినదాంట్లో తప్పేం ఉందని దీప అంటుంది.
జ్యోత్స్న కోరిక
జ్యోత్స్న నన్ను పెళ్లి చేసుకుంటానంటుందని కార్తీక్ అంటాడు. తన కోరిక కరెక్టే బావ అని దీప అనడంతో కార్తీక్ తల పట్టుకుంటాడు. జ్యోత్స్న మెడలో తాళి కట్టమంది. గన్ పట్టుకుని చచ్చిపోతానని బెదిరించింది. కాల్చుకుంది కూడా, జస్ట్ లో మిస్ అయిందని కార్తీక్ జరిగిన విషయం చెప్తాడు. జ్యోత్న్న నిన్ను ప్రేమిస్తుంది, నీతో బతకాలని అనుకుంటుంది. జ్యోత్స్న మాట్లాడిన దాంట్లో ఏ తప్పూ లేదని దీప ట్విస్ట్ ఇస్తుంది.
ఎందుకు వదులుకుంటా?
పెద్దవాళ్లదే తప్పు. ఊహ తెలిసినప్పటి నుంచి జ్యోత్స్నకు నువ్వు భర్తగా పరిచయం అయ్యావు. జ్యోత్స్న మైండ్ పాడు చేశారని దీప అంటుంది. నువ్వు త్యాగాలు ఏం ప్లాన్ చేయడం లేదు కదా కార్తీక్ డౌట్ పడతాడు. నేను ఎందుకు వదులుకుంటా బావ? అని దీప అనగానే కాస్త రిలీఫ్ అవుతాడు. కార్తీక్ కు పెళ్లి అయిపోయింది కదా, ఇంకా వేరే పెళ్లి చేసుకో అని పారిజాతం చెప్పి ఉండాల్సిందని దీప అంటుంది.
పారిజాతాన్ని రెచ్చగొట్టేలా
వెంటనే పారిజాతానికి కార్తీక్ ఫోన్ చేస్తాడు. దీపను జ్యోత్స్న తిట్టింది. దీప గుక్కపెట్టి ఏడుస్తుంది. నీ మనవరాలు మా కాపురంలో నిప్పులు పోసింది. నా భార్య ఒక అనాథ. తల్లి లేని పిల్ల అనే కదా ఏడిపిస్తున్నారు. పుట్టింటి తరపున ఎవరూ లేరు. నువ్వే దీపకు సొంత నానమ్మ అయితే దీపను ఇలా వదిలేసేదానివా? అని పారిజాతాన్ని కార్తీక్ రెచ్చగొడతాడు.
పారు కోపం
దీప అనాథ కాదు, నేనున్నాను అని పారు ఆయాసపడుతుంది. దీప కోసం ఏమైనా చేస్తానని పారు అంటుంది. కష్టాలన్నీ పనిమనుషులకేనా అని కార్తీక్ కావాలనే అంటాడు. ఎక్కడ టచ్ చేయాలో అక్కడే టచ్ చేశావ్ మనవడా. జ్యోత్స్నను నిద్ర పోనివ్వను. ఇక మాటలు అనవసరం. జరగబోయేది బుల్లితెర మీద చూడమని పారు ఊగిపోతుంది.
జ్యోత్స్న ఇలా కావడానికి కారణం పారిజాతం అని చెప్పావ్ కదా. గురువుతోనే పాఠాలు చెప్పిస్తున్నానని కార్తీక్ హుషారుగా దీపతో అంటాడు.
జ్యోకు టార్చర్
జ్యోత్స్న దగ్గరకు పారు వెళ్తుంది. ఈ రాత్రి మనం పడుకోకూడదు. కూర్చుని కబుర్లు చెప్పుకుందామని పారు అంటుంది. ఇలా టార్చర్ చేయమని దీప చెప్పిందా అని జ్యో అడుగుతుంది. ఈ కుటుంబానికి మంచి పని చేయబోతున్నానని పారు అంటుంది. దీపను దత్తత తీసుకోబోతున్నావా? అని జ్యో అడుగుతుంది. పొద్దున మనం బయటకు వెళ్తున్నామని చెప్పి పారు వెళ్లిపోతుంది. నాకు ఈ టార్చర్ ఏంటీ? అని జ్యో అనుకుంటుంది.
కార్తీక్, జ్యోత్స్న పెళ్లి
కార్తీక్, జ్యోత్స్న గుడిలో పెళ్లి చేసుకునేందుకు కూర్చుంటారు. కార్తీక్ తాళి తీసుకుంటాడు. తాళి కట్టు బావ, నీ జీవితంలో దీప లేదని జ్యో అనుకుంటుంది. కార్తీక్ తాళి కడతాడు. అప్పుడే, లేదు.. అలా జరగడానికి వీల్లేదని కాంచన ఉలిక్కిపడి లేస్తుంది. కార్తీక్, జ్యోత్స్నకు పెళ్లి అయినట్లు కాంచనకు కల వస్తుంది.
అది కలనే
తనకు వచ్చిన కల గురించి శ్రీధర్ కు పొద్దున కాంచన చెప్తుంది. నీకు వచ్చిన కల ఏంటీ అని కార్తీక్ అడుగుతాడు. నువ్వు జ్యోత్స్న మెడలో తాళి కట్టినట్లు మీ అమ్మకు కల వచ్చిందంట్రా అని శ్రీధర్ చెప్తాడు. కార్తీక్ పై జ్యోత్స్నకు ఇంకా ప్రేమ ఉంది. అందుకే అగ్రిమెంట్ పేరుతో దగ్గర పెట్టుకుంది. కానీ జ్యోత్స్న మెడలో కార్తీక్ తాళి కట్టడమన్నది ఎప్పటికీ కలేనని శ్రీధర్ కొట్టిపడేస్తాడు.
తాత, తండ్రి ఇలా ఎవరి వారసత్వం వచ్చినా కార్తీక్ కు రెండు పెళ్లిళ్లు అవుతాయి కదా అని కాంచన భయపడుతుంది. అలా అయితే మామయ్య కూడా రెండు పెళ్లిళ్లు చేసుకోవాలి కదా అని కార్తీక్ లాజిక్ మాట్లాడతాడు. నేను దీపను పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు జ్యోత్స్నను కూడా భార్యను అని చెప్తూ దీప వైపు చూసి కార్తీక్ ఆగిపోతాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


