Karthika Deepam 2 Today Episode: జ్యోత్స్నకు దిమ్మతిరిగే షాక్-వైరా వెన్నుపోటు-గన్‌తో షూట్-కార్తీక్‌కు తగిలిన బుల్లెట్
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 23 ఎపిసోడ్ లో రూ.30 కోట్ల డబ్బు వైరా దగ్గరకు చేరుతుంది. మొత్తం డబ్బు తనకే అని జ్యోత్స్నకు వైరా వెన్నుపోటు పొడుస్తాడు. కార్తీక్, పారు వచ్చి రౌడీ బ్యాచ్ ను చితకబాదుతారు. జ్యోను వైరా చంపాలనుకుంటాడు. ఆ బుల్లెట్ కార్తీక్ కు తగులుతుంది.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ జ్యోత్న్స కిడ్నాప్ డ్రామా చుట్టూ సాగుతోంది. దశరథ తెచ్చిన రూ.30 కోట్లను వైరాకు చెందిన వ్యక్తి తీసుకెళ్తాడు. ఆ తర్వాత అసలు ఏం జరిగింది? ఫాలో అయిన కార్తీక్.. జ్యోత్స్న నాటకాన్ని కనిపెట్టాడా? అన్నది కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 23 ఎపిసోడ్ లో చూసేయండి.

డబ్బుతో జంప్
డబ్బుతో ఉన్న కారును పోలీసులతో కలిసి దశరథ, దాసు ఫాలో అవుతారు. వాళ్ల వెనకాలే స్కూటీపై కార్తీక్, పారు వస్తారు. ఓ చోట దశరథను కారు ఆగి ఉంటుంది. వెళ్లి చూస్తే కార్లో ఎవరూ ఉండరు. డబ్బు కూడా ఉండదు. బ్యాగ్ తీసుకుని వెళ్లిపోయాడు సార్. ఫాలో కావొద్దంటూ మీరు వినలేదు. వాడు మన ప్రతి మూమెంట్ ను కనిపెడుతున్నాడని దశరథ చెప్తాడు.
దీపను జ్యోత్స్న గా
మీరు ఇంటికి వెళ్లండి, మీ కూతురిని మేం సేఫ్ గా తీసుకొస్తామని పోలీసులు చెప్పడంతో దశరథ ఇంటికి వెళ్తాడు. అప్పుడే పారుతో కలిసి కార్తీక్ ఓ ప్లాన్ వేస్తాడు. మరోవైపు ఇంట్లో సుమిత్ర ఏడుస్తూనే ఉంటుంది. దీపను చూసి ఒక్కసారిగా జ్యోత్స్న అని అనుకుంటుంది. మామయ్య నా కూతురు వచ్చేసిందని గట్టిగా అరుస్తుంది. ఏం మాట్లాడుతున్నావని శివ నారాయణ అనగానే.. దీపను చూసి సుమిత్ర షాక్ అవుతుంది.
నా కూతురి కోసం నా మనసు ఎంత మతి లేకుండా తయారైందో నాకు అర్థమవుతోందని సుమిత్ర ఫీల్ అవుతుంది. ట్యాబ్లెట్స్ వేసుకోకపోతే మీ ఆరోగ్యం ఏమవుతుందని దీప అడుగుతుంది. నా ఆరోగ్యం పాడైపోతే నీకేంటీ? నాకు దూరంగా ఉండు అని దీపపై సుమిత్ర సీరియస్ అవుతుంది. జ్యోత్స్నను చూసేవరకు మంచినీళ్లయినా ముట్టుకోనని సుమిత్ర అంటుంది.
10 కోట్లు ఇవ్వాలని
సీన్ వైరా, జ్యోత్స్న దగ్గరకు మారుతుంది. డబ్బున్న బ్యాగ్ తో వైరా మనిషి వస్తాడు. బ్యాగ్ లో డబ్బు చూసి వైరా, జ్యోత్స్న తెగ సంతోషపడతారు. నేనంటే మా మమ్మీకి, డాడీకి ఎంత ప్రేమో ఇప్పటికైనా నమ్ముతావా వైరా? నాకు రావాల్సిన రూ.10 కోట్లు బ్యాగులో పెట్టి, నన్ను మెయిన్ రోడ్ మీద డ్రాప్ చేయమని జ్యో అడుగుతుంది. వెంటనే వైరాతో పాటు ఉన్న రౌడీ బ్యాచ్ అంతా నవ్వుతుంది.
వైరా వెన్నుపోటు
సారీ జ్యోత్స్న, నేను నిన్ను మోసం చేశా. దీన్నే వెన్నుపోటు అంటారు. మొత్తం డబ్బు నేనే తీసుకున్నా కాబట్టి నిన్ను ఏం చేయకుండా వదిలేస్తున్నానని వైరా అనడంతో జ్యోత్స్నకు మైండ్ బ్లాక్ అవుతుంది. నిన్ను బతకనివ్వను, నీ అంతు చూస్తా. మర్యాదగా నా వాటా నాకు ఇస్తావా లేదా? నువ్వు నీచుడివి. ఆడపిల్లను మోసం చేస్తావా? అని జ్యో ఫైర్ అవుతుంది. వైరా అండ్ బ్యాచ్ మాస్కులు వేసుకొని వెళ్లిపోదామని అనుకుంటారు.
కార్తీక్ ఫైటింగ్
అప్పుడే కౌబాయ్ లా పారిజాతం అదిరే ఎంట్రీ ఇస్తుంది. పిఠాపురం పారు అని అరుస్తుంది. రౌడీ అటాక్ చేయబోతే హీరోలా కార్తీక్ ఎంట్రీ అదిరిపోతుంది. రౌడీలను కార్తీక్ చితక్కొడతాడు. ఎవడ్రా నువ్వు అని వైరా మాస్క్ ను కార్తీక్ తీసేస్తాడు. ఒకసారి ఇచ్చిన డోసు సరిపోలేదా అని వైరాను కార్తీక్ బాదుతాడు. డబ్బున్న బ్యాగ్ కోసం జ్యోత్స్న, వైరా గొడవపడతారు. వైరా తలపై జ్యో కర్రతో కొడుతుంది.
కార్తీక్ కు బుల్లెట్
జ్యోను చంపేందుకు వైరా గన్ పేలుస్తాడు. కార్తీక్ అడ్డుగా వెళ్తాడు. కార్తీక్ అని పారు గట్టిగా అరుస్తుంది. మరోవైపు జ్యోను తీసుకు రానందుకు దశరథపై సుమిత్ర అరుస్తుంది. ఇంకా మిమ్మల్ని నమ్ముకుని లాభం లేదు, నేనే వెళ్లి నా కూతురిని తెచ్చుకుంటానని సుమిత్ర వెళ్లబోతుంది. అప్పుడే జ్యోత్స్న ఇంటికి వస్తుంది. కూతురిని సుమిత్ర హత్తుకుంటుంది.
జ్యో చేతులకు రక్తం చూసి అందరూ షాక్ అవుతారు. ఏమైందని సుమిత్ర అడుగుతుంది. బావను గన్ తో షూట్ చేశారని జ్యో చెప్తుంది. నా బావ ఎక్కడున్నాడు? అని దీప కంగారు పడుతుంది. బాగానే ఉందని చేతికి కట్టుతో కార్తీక్ వస్తాడు. వైరా గన్ పేల్చడం, కార్తీక్ చేతికి బుల్లెట్ తగలడం, డబ్బుతో వైరా ఎస్కేప్ కావడం చూపిస్తారు.
శివ నారాయణ సీరియస్
కార్తీక్ రాక పోయి ఉంటే మీ మనవరాలి ప్రాణాలు పోయి ఉండేది. అయితే వీళ్లు రావడం వల్ల కిడ్నాపర్ తప్పించుకున్నాడు. లేదంటే మేం కిడ్నాపర్ ను పట్టుకునేవాళ్లమని పోలీసులు చెప్తారు. నువ్వు వెళ్లడం వల్ల నా మనవరాలు రిస్క్ లో పడింది. నా మనవరాలిని కాపాడటానికి నువ్వు రిస్క్ చేశావని కార్తీక్ పై శివ నారాయణ సీరియస్ అవుతాడు.
కిడ్నాప్ పగతో చేశాడు. మనం కేసు పెట్టి జైలుకు పంపించిన వైరానే ఇదంతా చేశాడని కార్తీక్ చెప్తాడు. వెంటనే శివ నారాయణ ఆవేశంతో గన్ తీసుకుని వస్తాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


