Karthika Deepam 2 Today Episode: జ్యోత్స్నకు కార్తీక్ మాస్టర్ స్ట్రోక్- పెళ్లి కొడుకుతో ఊహించని షాక్- జ్యో మైండ్ బ్లాక్
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 29 ఎపిసోడ్ లో జ్యోత్స్నకు బుద్ధి చెప్పేందుకు కార్తీక్ ప్లాన్ వేస్తాడు. పారిజాతంతో కలిసి ప్లాన్ అమలు చేస్తాడు. దీప కోసం కార్తీక్ కొన్న చీరను జ్యోత్స్న కట్టుకుంటుంది. అప్పుడే సర్ ప్రైజ్ అంటూ పెళ్లి కొడుకును కార్తీక్ పరిచయం చేస్తాడు.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్నకు నెల రోజుల్లో పెళ్లి కాకపోతే, ఇంకెప్పటికీ కాదని పంతులు షాక్ ఇస్తాడు. మరోవైపు జ్యోత్స్నను సవతిని చేస్తావా? అని కార్తీక్ పై దీప మండిపడుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 29 ఎపిసోడ్ లో చూసేయండి.

కార్తీక్ ప్లాన్
కార్తీక్, దీపతో పారిజాతం ఫోన్లో మాట్లాడుతుంది. జ్యోత్స్నకు బ్రేక్ వేయాలని చెప్తుంది. తనను ఇలాగే వదిలేస్తే తన కోరికలో కూడా న్యాయం ఉందని జనాలు అనుకుంటారంటావ్ అని పారుతో కార్తీక్ అంటాడు. జ్యోత్స్న మన దగ్గర ఆడుతున్న నాటకాన్ని అందరిలో బయటపెట్టాలి. అందుకు మన దగ్గర బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది. దీపకు ఓ మంచి చీర కొనమని పారుకు కార్తీక్ చెప్తాడు.
పారుతోనే ఆడిస్తానని
జ్యోత్స్న మనసులో ఏముందో తాతకు, అత్తకు తెలిస్తే ఏం చేస్తారని కార్తీక్ అడిగితే.. ఉతికి ఆరేస్తారు, నాలుక చీరేస్తారని పారు చెప్తుంది. ఇది జరగాలంటే కార్తీక్ దీప కోసం ఓ చీర కొన్నాడని నువ్వు ఓ చీర కొని జ్యోత్స్న కట్టుకునేలా చేస్తే కథ నేను నడుపుతా కదా అని కార్తీక్ ప్లాన్ వివరిస్తాడు. అలాగే మనవడా, ఈ పారిజాతం ఏం చేస్తుందో నువ్వే చూస్తావ్ అని పారు ఫోన్ పెట్టేస్తుంది. ఆట మొత్తం పారుతోనే ఆడిస్తానని దీపతో కార్తీక్ చెప్తాడు.
బొమ్మ కోసం
సీన్ కట్ చేస్తే, జ్యోత్స్న ఓ బొమ్మల షాప్ కు వెళ్లి ఓ బొమ్మ కొంటుంది. అక్కడే రొమాంటిక్ కపుల్ బొమ్మ ఒకటి ఉంటుంది. అది కావాలని జ్యోత్స్న అంటే, వేరే వాళ్లు కొనుక్కున్నారని షాప్ ఓనర్ చెప్తాడు. అప్పుడే హీరోలా ఓ వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. ఈ గిఫ్ట్ నాక్కావాలి. ఇదొకటే పీస్ ఉందని జ్యో అడుగుతుంది. నాది అని నేను ఒకసారి అనుకుంటే అది నాదేనిన ఆ అబ్బాయి చెప్తాడు.
లక్ష ఇచ్చినా
బొమ్మ వాల్యూ మీద రూ.10 వేలు ఎక్కువ ఇస్తానని జ్యోత్స్న చెప్పినా, ఆ అబ్బాయి మాత్రం ఇవ్వడు. బోడి గిఫ్ట్ కోసం ఇంత ఓవర్ చేస్తున్నావేంటని జ్యో అంటుంది. ఇప్పుడు ఆ వస్తువు నాది. ఇవ్వమంటే ఎలా ఇస్తా? రూ.లక్ష ఇచ్చినా నేను ఇవ్వను. మనది కాని దాని మీద మనసు పడటం మానేయండి. అది దక్కకపోతే మనశ్శాంతి ఉండదు అని జ్యోకు కౌంటర్ వేస్తాడు. ఆ బొమ్మను ప్యాక్ చేసుకుని తీసుకెళ్తాడు. జ్యో కోపంతో వచ్చేస్తుంది.
దీప కోసం చీర
సీన్ ఇంటికి మారుతుంది. జ్యోత్స్న ముందుకు వెళ్లి, చీరను పట్టుకుని పారు డ్రామా స్టార్ట్ చేస్తుంది. ఈ చీర కథ ఏంటో చెప్పమని జ్యో అడుగుతుంది. ఈ చీర ఎలా ఉందోనని పారు అడుగుతుంది. అస్సలు బాలేదని జ్యో అంటుంది. కార్తీక్ కు ఇది నచ్చిందని పారు చెప్తుంది. దీపకు చీర పెట్టాలనుకున్నా. ఆన్ లైన్ లో చూశా. ఇది ఎలా ఉందని అడిగితే సూపర్ గా ఉందని కార్తీక్ చెప్పాడు. వెంటనే ఆర్డర్ చేశా. దీప రాగానే కార్తీక్ కు ఎంతో నచ్చిన చీరను వాడి చేతుల మీదుగానే ఇప్పిస్తానని పారు అంటుంది.
ప్లాన్ సక్సెస్
వెంటనే చీరను జ్యోత్స్న లాక్కుంటుంది. ఏ చీర ఎవరికి సొంతం కావాలో దేవుడు రాసే ఉంటాడు. దీప పేరు చెరిపేసి జ్యోత్స్న అనే పేరు రాసుకుంటానని జ్యో చీరతో లోపలికి వెళ్తుంది. ప్లాన్ సక్సెస్ అయినందుకు పారు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. కార్తీక్, దీప రాగానే ప్లాన్ సక్సెస్ అని పారు చెప్తుంది. అందరిని ప్రిపేర్ చేయాలని కార్తీక్ చెప్తాడు.
పెళ్లి సంబంధం
శివ నారాయణ రాగానే జ్యోత్స్నకు ఓ సంబంధం చూశానని చెప్పా కదా, వాళ్లు ఈ రోజు వస్తున్నారని కార్తీక్ చెప్తాడు. అబ్బాయి ఎవరో చెప్పమని సుమిత్ర అడుగుతుంది. అప్పుడే పెళ్లి కొడుకులా ఓ వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. పేరేంటి అని సుమిత్ర అడిగితే.. వినోద్ అత్తయ్య అని అతను వరసలు కలిపేస్తాడు. పెళ్లి కొడుకు నాకు నచ్చాడని దశరథ అంటాడు.
బావంటే ప్రాణం
ఈ పెళ్లి చూపులు అయ్యేసరికి మనకో క్లారిటీ వస్తుంది అత్త అని సుమిత్రకు కార్తీక్ చెప్తాడు. చీరలో రెడీ అయిన జ్యోత్స్న.. బావ నన్ను చూసి మతి పోగొట్టుకోవాలని అనుకుంటుంది. జ్యోను తీసుకెళ్లడానికి దీప, పారు వస్తారు. నా కోసం మా బావ సెలెక్ట్ చేసిన చీర నువ్వెందుకు కట్టుకున్నావని దీప అడుగుతుంది. చీర ఏంటి? బావనే కట్టుకోబోతున్నా. బావంటే ప్రాణం అని జ్యో అంటుంది. దీపకు మండిపోతుంది. చీర ఇస్తావా లేదా? అని దీప అడుగుతుంది.
మైండ్ బ్లాక్
బావ ముందు వయ్యారంగా నిలబడి ఎలా ఉందని అడుగుతానని జ్యో వెళ్తుంది. చీరలో జ్యోను చూసి సుమిత్ర మురిసిపోతుంది. రండి, పెద్ద మేడం మీకో సర్ ప్రైజ్ అని పెళ్లి కొడుకును కార్తీక్ చూపిస్తాడు. మా బావే నాకు కాబోయే భర్తను చూస్తాడని చెప్పావు కదా. అందుకే అన్ని అర్హతలున్న కుర్రాడిని పట్టుకున్నానని కార్తీక్ చెప్పేసరికి జ్యో మైండ్ బ్లాక్ అవుతుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


