Serials TRP Ratings: టాప్ 10 తెలుగు టీవీ సీరియల్స్.. కార్తీక దీపం 2, ఇల్లు ఇల్లాలు పిల్లలు, గుండె నిండా గుడి గంటలు హవా

Serials TRP Ratings: తెలుగు బుల్లితెరపై 16వ వారం టీఆర్‌పీ రేటింగ్స్ రసవత్తరంగా మారాయి. స్టార్ మా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, జీ తెలుగు సీరియల్స్ గట్టి పోటీనిస్తున్నాయి. ఏ సీరియల్ టాప్‌లో ఉందో ఈ కథనంలో చూడండి.

Published on: Apr 30, 2026, 15:19:51 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Serials TRP Ratings: తెలుగు టీవీ సీరియల్స్ లో ప్రతి వారం జరిగే రేటింగ్స్ యుద్ధం ఆసక్తికరంగా మారుతోంది. ఈ ఏడాది 16వ వారానికి సంబంధించి విడుదలైన అర్బన్, రూరల్ టీఆర్‌పీ (TRP) డేటాను పరిశీలిస్తే.. ప్రముఖ ఛానెల్స్ మధ్య పోటీ తీవ్రంగా ఉందని అర్థమవుతోంది. ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునే స్టార్ మా (Star Maa), జీ తెలుగు (Zee Telugu) ఛానెల్స్ తమ సీరియల్స్‌తో బాక్సాఫీస్ రేంజ్ వసూళ్ల తరహాలో రేటింగ్స్ రాబడుతున్నాయి.

Serials TRP Ratings: టాప్ 10 తెలుగు టీవీ సీరియల్స్.. కార్తీక దీపం 2, ఇల్లు ఇల్లాలు పిల్లలు, గుండె నిండా గుడి గంటలు హవా
Serials TRP Ratings: టాప్ 10 తెలుగు టీవీ సీరియల్స్.. కార్తీక దీపం 2, ఇల్లు ఇల్లాలు పిల్లలు, గుండె నిండా గుడి గంటలు హవా

ఆ రెండు సీరియల్స్ హవా

స్టార్ మా ఛానెల్‌లో 'కార్తీక దీపం 2' ప్రభంజనం కొనసాగుతోంది. ఈ వారం 11.93 (U+R) రేటింగ్‌తో ఈ సీరియల్ టాప్ పొజిషన్‌లో నిలిచింది. గత కొన్ని వారాలతో పోలిస్తే రేటింగ్ తగ్గినా.. తన అగ్రస్థానాన్ని మాత్రం నిలబెట్టుకుంది.

ఇక ఈ సీరియల్ వెంటే 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' 11.65 రేటింగ్‌తో రెండో స్థానంలో నిలవడం విశేషం. అక్కినేని నాగార్జున స్వయంగా ప్రశంసించిన 'గుండెనిండా గుడిగంటలు' సీరియల్ 11.01 రేటింగ్‌తో తన సత్తా చాటింది.

ఇతర ప్రధాన సీరియల్స్ రేటింగ్స్ గమనిస్తే.. ఇంటింటి రామాయణం 10.37 (U+R), నువ్వు లేక నేను లేను 8.11 (U+R), పొదరిల్లు 8.55 (U+R) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తంగా చూస్తే టాప్ 10లో మొదటి ఆరు స్థానాల్లో స్టార్ మా సీరియల్సే కొనసాగుతున్నాయి.

జీ తెలుగులో 'జయం' జోరు

జీ తెలుగు ఛానెల్‌లో ఈ వారం 'జయం' సీరియల్ 6.69 (U+R) రేటింగ్‌తో నిలకడగా రాణిస్తోంది. అలాగే 'చామంతి' 6.61 రేటింగ్‌తో ఛానెల్‌లో అత్యధిక ఆదరణ పొందిన సీరియల్స్‌లో ఒకటిగా నిలిచింది.

ఫ్యామిలీ డ్రామాగా సాగే 'జగద్ధాత్రి' 6.38 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. జీ తెలుగులో ఇతర సీరియల్స్ రేటింగ్స్ విషయానికి వస్తే.. మేఘసందేశం 5.06, ముక్కుపుడక 3.19 (U+R), గుండమ్మ కథ 3.96 (U+R), చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి 3.73 (U+R), కలవారి కోడలు కనకమహాలక్ష్మి 4.08 (U+R) సీరియల్స్ ఉన్నాయి.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల డేటాను విశ్లేషిస్తే.. ఎమోషనల్ డ్రామాలు, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న కథలకు తెలుగు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. స్టార్ మాలో ప్రైమ్ టైమ్ లో ప్రసారమవుతున్న దాదాపు అన్ని సీరియల్స్ కు మంచి రేటింగ్స్ వస్తున్నాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1. 16వ వారంలో తెలుగులో టాప్ రేటింగ్ సాధించిన సీరియల్ ఏది?

స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమయ్యే 'కార్తీకదీపం 2' సీరియల్ 11.93 (U+R) రేటింగ్‌తో మొదటి స్థానంలో నిలిచింది.

2. జీ తెలుగులో అత్యధిక రేటింగ్ ఉన్న సీరియల్ ఏది?

జీ తెలుగులో జయం (6.69) టాప్ లో నిలిచింది. ఆ తర్వాత 'చామంతి' (6.61), 'జగద్ధాత్రి' (6.38) సీరియల్స్ మెరుగైన రేటింగ్స్ సాధించాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More