Karthika Deepam Sumithra: కార్తీక దీపం సుమిత్ర మతం మార్చుకుందా? సీత నుంచి యాస్మిన్ ఎలా అయింది? నటి వివరణ ఇలా..

Karthika Deepam Sumithra: కార్తీక దీపం సీరియల్లో సుమిత్ర పాత్ర ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి సీతా అయస్ అసలు యాస్మిన్ లా ఎలా మారింది? మతం మార్చుకుందా? రెండో పెళ్లి ఎందుకు చేసుకుంది లాంటి ప్రశ్నలకు ఆమెనే ఓ వీడియో ద్వారా సమాధానం ఇచ్చింది.

Published on: Apr 28, 2026, 18:21:58 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam Sumithra: కార్తీక దీపం సీరియల్లో దీప తల్లి సుమిత్ర పాత్ర పోషిస్తున్న నటి సీతా అయస్ తెలుసు కదా. ఆమె తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో కొన్నాళ్లుగా అభిమానులు తన విషయంలో లేవనెత్తుతున్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది.

Karthika Deepam Sumithra: కార్తీక దీపం సుమిత్ర మతం మార్చుకుందా? సీత నుంచి యాస్మిన్ ఎలా అయింది? నటి వివరణ ఇలా..
Karthika Deepam Sumithra: కార్తీక దీపం సుమిత్ర మతం మార్చుకుందా? సీత నుంచి యాస్మిన్ ఎలా అయింది? నటి వివరణ ఇలా..

మొదటి పెళ్లి పెటాకులు

కార్తీక దీపం సీరియల్లో సుమిత్రగా ప్రేక్షకులకు సుపరిచమైన సీతా లక్ష్మి.. తాను యాస్మిన్ గా ఎందుకు మారాల్సి వచ్చిందో ఆ వీడియోలో వివరించింది.

“నాకు నా తల్లిదండ్రులు పెట్టిన పేరు సీతా లక్ష్మి. అన్ని రికార్డుల్లోనూ ఇప్పటికీ నా పేరు అలాగే ఉంటుంది. కానీ 2012లో నా జీవితంలో ఊహించని ఘటన జరిగింది. నాకు విడాకులు అయ్యాయి. అది నాకు పెద్ద షాక్ లా అనిపించింది. ఎందుకంటే నేను అది అస్సలు ఊహించలేదు. దాని నుంచి కోలుకోలేకపోయాను. అందుకే ఆ తర్వాత నాలుగేళ్లు నేను నటనకు దూరంగా ఉన్నాను” అని ఆమె చెప్పింది.

స్కూల్ ఫ్రెండ్‌తో రెండో పెళ్లి..

“విడాకుల తర్వాత ఎంతో బాధలో ఉన్న నాకు నా స్కూల్ ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు. మొదట సంకోచించినా తర్వాత నేను కూడా ఓకే చెప్పాను. నా భర్త పేరు అబ్దుల్ ఖాదర్. అతడు నా స్కూల్ ఫ్రెండ్. నా విడాకుల సమయంలో హిందువుల్లోనే మరొకరిని చూసుకొని పెళ్లి చేసుకునే అవకాశం నాకు లేదు. దీంతో నేను అతన్ని పెళ్లి చేసుకున్నాను” అని సీత తెలిపింది.

యాస్మిన్‌గా మారిన సీత

నిజానికి తాను మతం మార్చుకోలేదని, ఇప్పటికే ఆధార్ కార్డ్, బ్యాంకు అకౌంట్లలో తన పేరు సీతా లక్ష్మి అనే ఉంటుందని ఆమె స్పష్టం చేసింది. అయితే అతన్ని పెళ్లి చేసుకోవాలంటే తన అత్తగారింటి వాళ్లు ఒప్పుకోవాలని, దీనికోసం తాను కొన్ని పనులు చేయాల్సి వచ్చిందని సీత చెప్పింది. తనకు వాళ్ల సపోర్ట్ అవసరం కావడంతో తాను అలా చేశానని, ఆ తర్వాత తన అత్తగారు తనకు యాస్మిన్ అనే పేరు పెట్టారు అని సీతా లక్ష్మి తెలిపింది.

నేను ఓ ఇండియన్..

ఇక తనకు కులం, మతం పట్టింపులు లేవని, తాను మొదట ఇండియన్ అని, అందరూ అలాగే అనుకోవాలని కూడా చెప్పింది. తన ఇన్‌స్టా ఫాలోవర్లలో చాలా మంది తాను ఎందుకు బొట్టు పెట్టుకోరని అడుగుతున్నారని, అందుకే ఈ వీడియో ద్వారా వాళ్లందరికీ స్పష్టత ఇవ్వాలనే ఇదంతా చెప్పినట్లు సీతా వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో తాను బొట్టు పెట్టుకుంటానని, మరికొన్నిసార్లు తీసేస్తానని చెప్పింది.

బయట నటించే సమయంలో తాను ఎలా ఉన్నా తన భర్త ఇంట్లో వాళ్లు పట్టించుకోరని కూడా సీతా చెప్పింది. ఆమె చేసిన ఈ వీడియోను ప్రశంసిస్తూ చాలా మంది కామెంట్స్ చేయగా.. కొందరు మాత్రం వాళ్లకు పట్టింపు లేనప్పుడు ఎందుకు పేరు మార్చుకున్నారని ప్రశ్నించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More