Karthika Deepam 2 Today Episode: సుమిత్ర తండ్రి దక్షిణామూర్తి ఎంట్రీ- శివ నారాయణ ఆగ్రహం- గోడకు తల బాదుకున్న సుమిత్ర

Karthika Deepam 2 Serial May 11th Episode: కార్తీక దీపం 2 సీరియల్ మే 11వ ఎపిసోడ్‌లో సుమిత్ర తండ్రి దక్షిణామూర్తిని తనకు తెలియకుండా కార్తీక్ ఇంట్లోకి తీసుకొస్తాడు. దక్షిణామూర్తిని చూసి శివ నారాయణ ఆగ్రహంతో ఊగిపోతాడు. చాలా సీరియస్ అవుతాడు. సుమిత్ర కూడా తండ్రి చనిపోయాడంటుంది. గోడకు తల బాదుకుంటుంది.

Published on: May 11, 2026, 07:52:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో శివ నారాయణ ఇంటి బయట ఒకతను నిలబడి ఉంటాడు. ఇంతలో కార్తీక్, దీప వస్తారు. ఇంట్లోకి వెళ్లాల, వాళ్లు బాగా కావాల్సినవాళ్లు అని కార్తీక్ చెబుతాడు. వాళ్ల గురించి గొప్పగా చెబుతాడు. శివ నారాయణను కలవడానికి వచ్చానని ఆ పెద్దాయన చెబుతాడు.

కార్తీక దీపం 2 సీరియల్ మే 11 ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ మే 11 ఎపిసోడ్

కంటపడితో రక్తపాతమే

ఇంకేం వచ్చి కలవండని అతని చేయి పట్టుకుని కార్తీక్ తీసుకొస్తాడు. అతన్ని చూసి పారిజాతం తెగ షాక్ అవుతాడు. దక్షిణామూర్తి. ఈ ముసలోడి కంటపడితే రక్తపాతమే. అతనెవరో తెలియకుండా కార్తీక్ గాడు తీసుకొస్తున్నాడని పారిజాతం అనుకుంటుంది. సుమిత్రను చూసి దక్షిణామూర్తి ఆగుతాడు. తనే మా అత్త సుమిత్ర అని, తను కాంచన కొడుకు అని కార్తీక్ చెబుతాడు.

ఇంతలో పారు పరిగెత్తుకుంటూ వచ్చి శివ నారాయణను గుద్దుకుంటుంది. కార్తీక్ వచ్చి తాత నీకు సర్‌ప్రైజ్ అని దక్షిణామూర్తి అనే కొత్త క్యారెక్టర్‌ను పిలుస్తాడు. దక్షిణామూర్తిని చూసి శివ నారాయణ షాక్ అయిపోతాడు. ఏం తాత చిన్నప్పటి స్నేహితున్ని చూసి సర్‌ప్రైజ్ అయ్యావా అని కార్తీక్ అంటే.. స్నేహితుడు కాదు.. శత్రువు అని కోపంగా అరుస్తాడు శివ నారాయణ. నా ఇంటికి ఎందుకు వచ్చావురా. వెళ్లిపో అని శివ నారాయణ అరుస్తాడు.

నాకు కావాల్సిన వాళ్లు ఇంట్లో ఉన్నారని దక్షిణామూర్తి అంటాడు. అంతలో సుమిత్ర వచ్చి దక్షిణామూర్తిని చూసి చేతిలో ప్లేట్ కింద పడేస్తుంది. బాగున్నావా అని దక్షిణామూర్తి అడిగితే.. బతికి ఉన్నావా అని అడుగు అని సుమిత్ర అంటుంది. అంట మాట ఎందుకమ్మా. నేను నీ తండ్రిని అని దక్షిణామూర్తి అంటాడు.

రక్తంతో రాయబడిన శిలా శాసనం

అది నీ కూతురు చనిపోయిందని కర్మకాండలు జరిపినప్పుడు ఏమైంది, తిలోదకాలు వదిలనప్పుడు ఏమైంది. నా జీవితంలో జరిగిన చెడు సంఘటనలన్నింటి శిలా శాసనం ఉంది. అది రక్తంతో రాయబడింది, దాని కింద గాయం చేసినవారి పేరు కూడా రాయబడి ఉంది. ఆ పేరే దక్షిణామూర్తి అని శివ నారాయణ అంటాడు.

నువ్వేదో ఉత్తముడిలా మాట్లాడకు శివ నారాయణ అని దక్షిణామూర్తి అంటే కార్తీక్ తాత ఆవేశంతో దగ్గరికి వస్తాడు. ఇద్దరు మాట మాట అనుకుంటారు. నీతి లేని నీ కుటుంబంతో వియ్యం అందడమే నా తప్పు అని దక్షిణామూర్తి అంటే.. శివ నారాయణ చేయి ఎత్తి కొట్టడానికి వెళ్తాడు. దశరథ్ ఆపుతాడు. దశరథ్‌ను అల్లుడు అని దక్షిణామూర్తి పిలిస్తే.. ఎవరు నీకు అల్లుడు అని శివ నారాయణ కోప్పడుతాడు.

నా కూతురు భర్త అని దక్షిణామూర్తి అంటే.. నీ కూతురు చనిపోయింది. నీ కూతురును నువ్వు ఎప్పుడు చంపుకున్నావో అప్పుడే నా తండ్రిని కూడా నేను చంపేసుకున్నా. ఊరి బయట శ్మశానంలోని సమాధిలో నీ కూతురు నిద్రపోతుంటుంది వెళ్లి వెతుక్కో అని సుమిత్ర ఆగ్రహంగా మాట్లాడుతుంది. పౌరుషంలో ఈ శివ నారాయణ కోడలు ఏమాత్రం తగ్గదని శివనారాయణ అంటే.. తనలో ఉంది ఈ దక్షిణామూర్తి రక్తం. పౌరుషం ఎక్కడికి పోతుందని పెద్దాయన అంటాడు.

తల బాదుకున్న సుమిత్ర

ఎప్పుడో జరిగిన గొడవకు మళ్లీ ప్రాణం పోయద్దని, వెళ్లిపోమ్మని దక్షిణామూర్తిని అంటాడు దశరథ్. నా కూతురుతో మాట్లాడాలని దక్షిణామూర్తి అంటాడు. పిండం పెట్టావుగా మళ్లీ కూతురు ఎక్కడుంది. నేను నిజంగా చస్తే కానీ ఊరుకోవనుకుంటా అని కోపంతో తనకు తానే గోడకు తల బాదుకుంటుంది సుమిత్ర. అంతా వచ్చి ఆపుతారు. సుమిత్ర స్పృహ కోల్పోతుంది. దక్షిణామూర్తిని పట్టుకోడానికి వస్తే దశరథ్ ఆపుతాడు.

దక్షిణామూర్తిని శివ నారాయణ వెళ్లమంటాడు. నేను వెళ్తాను. కానీ, నన్ను వెతుక్కుంటూ మీరే వస్తారు. ఈ జన్మలోనే వస్తారు అని దక్షిణామూర్తి వెళ్లిపోతాడు. శివ నారాయణ కోపంతో ఊగిపోతుంటాడు. సుమిత్రకు దీప సేవలు చేస్తుంటే చేయి తీసేస్తుంది జ్యోత్స్న. దాంతో దక్షిణామూర్తి కోసం వెతుక్కుంటూ వెళ్తుంది దీప. వెళ్లిపోయాడని, హాల్లో తాత ఉన్నాడని చెప్పడంతో పైకి వెళ్లి చూస్తుంది దీప.

తాత ఉన్నాడంటే కుటుంబం కూడా ఉన్నట్లే కదా. ఈ కథ మనం తెలుసుకోవాలి. అమ్మ కుటుంబం ఎక్కడుందో కనుక్కోవాలని, పారిజాతం గారెకి అంతా తెలిసే ఉంటుంది. అడగలాని దీప అంటుంది. సుమిత్ర దగ్గర ఒక్క దశరథ్ ఉంటాడు. బయటకి వచ్చిన పారిజాతంను సుమిత్ర అత్త ఫ్యామిలీ చనిపోయిందని చెప్పారు. అసలు ఏమైందని కార్తీక్ అడుగుతాడు. నేను నోరు విప్పానంటే గొడవలు అయిపోతాయిరా అని పారిజాతం అంటుంది.

శివ నారాయణ వార్నింగ్

ఇంకా దీంట్లో దాచేదేముంది. ఈ రెండు కుటుంబాలు ఎందుకు విడిపోయాయో చెప్పు అని కార్తీక్ అంటాడు. దాంతో ఆ దక్షిణామూర్తికి అని పారిజాతం అనేసరికి.. శివ నారాయణ కోపంగా అరుస్తాడు. నేను ఏం చెప్పట్లేదని పారిజాతం అంటుంది. ఆ పేరు, ఆ గతం గురించి నువ్వు నోరు విప్పొద్దు. అసలు దాని గురించి ఎవరు అడిగారని చాలా సీరియస్ అయిపోతాడు శివ నారాయణ. దాంతో జ్యోత్స్న అడిగిందని అబద్ధం చెప్పి బాగా ఇరికిస్తుంది పారిజాతం.

జ్యోత్స్న మీ అమ్మ కుటుంబం లేదు. చనిపోయింది. చనిపోయినవాళ్ల జాతకం అవసరం లేదు. అసలు దక్షిణామూర్తిని ఎవరు తీసుకొచ్చారు అని శివ నారాయణ అంటే.. జ్యోత్స్న బావే తీసుకొచ్చాడంట అని అంటుంది. కార్తీక్ నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావనేది పక్కన పెడితే మనదంతా ఒక్కటే కుటుంబం. రెండు కుటుంబాలుగా చేసే పరిస్థితి తీసుకురాకు అని శివ నారాయణ అంటాడు.

ఎవరో తెలియక తీసుకొచ్చాని కార్తీక్ భయంతో చెబుతాడు. ఎవరొచ్చిన ఇంటి బయటే మాట్లాడు. స్నేహితులే కాదు శత్రువులు కూడా ఇంటికి వస్తారు. వేషం చూసి మోసపోకు అని శివ నారాయణ అంటాడు. సరేనని కార్తీక్ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More