Karthika Deepam 2 Today Episode: జ్యోత్స్నకు మైండ్ బ్లాక్..నిజ స్వరూపం బయటపెట్టిన దీప.. సుమిత్ర వార్నింగ్.. సూరజ్ కౌంటర్
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే మే 8 ఎపిసోడ్ లో సూరజ్ ను దొంగ అని అంటుంది జ్యోత్స్న. జ్యో చేతిలో రూ.100 పెట్టిన సూరజ్ కౌంటర్ ఇస్తాడు. సుమిత్ర ముందు మరోసారి జ్యో అసలు రంగును దీప బయటపెడుతుంది. దీంతో జ్యోకు షాక్ తగులుతుంది. జ్యోకు సుమిత్ర వార్నింగ్ ఇస్తుంది.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న, సూరజ్ మధ్య టామ్ అండ్ జెర్రీ ఫైట్ ఆసక్తి కలిగిస్తోంది. సూరజ్ ను దెబ్బకొట్టాలని జ్యో చూస్తే, రివర్స్ లో సూరజ్ షాకిస్తాడు. మరోవైపు జ్యో ఎక్కడికి వెళ్లిందోనని సుమిత్ర కంగారు పడుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే మే 8 ఎపిసోడ్ లో చూసేయండి.

సూరజ్ కౌంటర్
నువ్వు దొంగవి, నిన్ను ఊరికే వదిలిపెట్టనని సూరజ్ కు జ్యోత్స్న వార్నింగ్ ఇస్తుంది. మనం ఎలా ఉంటే ఎదుటివాళ్లు అలాగే కనిపిస్తారని సూరజ్ కౌంటర్ ఇస్తాడు. చివరకు ఫోన్, కారు కీ ఇస్తాడు. నిజమైన తెలివి నమ్మించి మోసం చేయడంలో ఉండదు. నమ్మకంగా నిలబడటంలో ఉంటుందని సూరజ్ చెప్తాడు.
డబ్బులు తీసి జ్యోత్స్న చేతిలో పెడతాడు. క్యాబ్ సర్వీస్ కు డబ్బులిస్తానని ముందే చెప్పా కదా అని సూరజ్ చెప్పడంతో జ్యోత్స్నకు మండిపోతుంది. లైఫ్ లో మళ్లీ దొరుకుతావ్, కచ్చితంగా దీనికి కౌంటర్ ఉంటుందని జ్యో అనుకుంటుంది.
నోరుజారిన జ్యో
కారు తీసుకొని జ్యో ఇంటికి వెళ్తుంది. అప్పుడే దీప కాల్ చేసి ఎక్కడున్నారు, ఇంకా ఇంటికి రాలేదని తెలిసింది. ఇంట్లో వాళ్లు కంగారు పడతారు కదా అని దీప అంటుంది. ఊరు వదిలి వెళ్లిపోయాననుకున్నావా? నాకు నచ్చినట్లు తిరుగుతా. అడగడానికి నువ్వెవరు? అని జ్యో అడుగుతుంది. మీ బావ భార్యను అని దీప అంటే.. మధ్యలో మాజీ అనే పదం యాడ్ చేసుకోమ్మని జ్యో అంటుంది.
జ్యోకు షాక్
ఫ్యూచర్ లో బావ నా భర్తగా ఉంటాడని మాట్లాడుతూ జ్యోత్స్న ఇంటి లోపలికి వస్తుంది. అక్కడే కార్తీక్, దీపతో పాటు ఫ్యామిలీ అంతా ఉండటం చూసి జ్యో షాక్ అవుతుంది. పైగా ఫోన్ స్పీకర్ ఆన్ లోనే ఉంటుంది. జ్యో నిజస్వరూపాన్ని దీప మరోసారి బయటపెడుతుంది. జ్యోత్స్నను అందరూ తిడతారు. మా ఫోన్లు లిఫ్ట్ చేయడానికి టైమ్ ఉండదు కానీ దీప ఫోన్ లిఫ్ట్ చేసి తిడతావా? అని సుమిత్ర సీరియస్ అవుతుంది. నువ్వు ఇక మారవా? అని సుమిత్ర అడుగుతుంది.
సుమిత్ర వార్నింగ్
నీ భర్తకు భార్యను అవుతానని దీపకు చెప్పడానికి సిగ్గు లేదా అని పారిజాతం కూడా మండిపడుతుంది. ఇంకోసారి కార్తీక్ గురించి తప్పుగా ఆలోచించినా, తప్పుగా మాట్లాడినా అస్సలు ఊరుకోను. ఒక్కసారి వద్దు అనుకున్నానంటే రక్తం పంచుకున్న వాళ్లనయినా పక్కనపెడతానని సుమిత్ర వార్నింగ్ ఇస్తుంది. అసలు ఇప్పటివరకూ ఇంటికి రాకుండా ఎక్కడున్నావని జ్యోత్స్నను అందరూ అడుగుతారు.
సారీ మమ్మీ అని జ్యోత్స్న చెప్తుంది. కానీ సుమిత్ర వినదు. జ్యోపై కోప్పడుతుంది. మరొకసారి ఇది రిపీట్ కాదు ప్రామిస్ అని జ్యో డ్రామా ఆడుతుంది. క్షమించడం అంత ఈజీ కాదని కోపంతో శివ నారాయణ లోపలికి వెళ్లిపోతాడు. అందరూ లోపలికి వెళ్లిపోయాక చిటికెలు కొడుతూ జ్యోత్స్న వస్తుంది.
కౌంటర్ ఉంటుందని
ఏం కౌంటర్ ఇచ్చావే దీప. ఆ రోజు మీ ఇంట్లో దీపకు ఫోన్ చేసి అందరిముందు మీ ఒరిజినాలిటీ చూపించారని, ఈ రోజు మా ఇంట్లోవాళ్లకు నా ఒరిజినాలిటీ చూపించారు కదా. దీనికి కౌంటర్ ఉంటుంది బావ అని జ్యోత్స్న అంటుంది. ఇలాంటివి చాలానే చూశాం కానీ పోయి బువ్వ తిని పడుకో. మేం వచ్చింది అత్త కోసం అని కార్తీక్ చెప్తాడు.
కాంచన కోపం
సీన్ కాంచన ఇంటికి మారుతుంది. రాత్రి టైమ్ లో కార్తీక్ తో దీప వెళ్లడంపై కాంచన కోప్పడుతుంది. మతిలేని జ్యోత్స్నకు రోడ్డు మీద ఏం పని? మా అన్నయ్య రెండు కొట్టాల్సింది. జ్యోత్స్న లాంటి వాళ్లు స్వార్థం కోసం ఏమైనా చేస్తారు. ఫోన్ ఆఫ్ చేసి పడుకోండని కాంచన చెప్పి లోపలికి వెళ్లిపోతుంది. జ్యోత్స్న నిజమైన మనవరాలు అని పారుకు తెలిస్తే మన మీద పగబడుతుందని కార్తీక్ తో దీప అంటుంది.
పారు పంచ్ లు
మరోవైపు సూరజ్ ఇచ్చిన రూ.100 నోటును చూస్తూ జ్యో రగిలిపోతుంది. అప్పుడే జ్యూస్ తాగుతూ పారిజాతం ఎంట్రీ ఇస్తుంది. చేతిలో ఆ నోటు ఏంటీ అని పారు అడిగితే, దీనికో కథ ఉందని జ్యో అంటుంది. నువ్వు నా మనవడిని, మనవరాలిని ఇబ్బంది పెట్టొద్దు. దీప వాళ్ల ఇంటి నుంచి ఫోన్ చేసిందనుకుని నువ్వు నీ బుద్ధి చూపించావు. వాళ్లు తెలివిగా ఇరికించారని పారు చెప్తుంది.
సుమిత్ర కూతురివని పారు, నీ మనవరాలినే అని జ్యో వాదులాడుకుంటారు. పెళ్లి చేసుకోవడానికి ముందే సీఈఓ కావాలని జ్యో అంటుంది. నువ్వు సీఈఓ అవలేవు. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయి హాయిగా కాపురం చేసుకో. నా మనవరాలు దీప కాపురంలో పుల్లలు పెట్టావో జాగ్రత్త అని పారు వార్నింగ్ ఇస్తుంది.
దీప అనాథ కాదు. దానికి పారిజాతం ఉంది. నువ్వు దీప జోలికి వచ్చావనుకో ఊరుకోనని పారు చెప్తుంది. దీప నాకు సొంత మనవరాలు అని చెప్పబోయి పారు కంట్రోల్ చేసుకుంటుంది. సొంత మనిషిలాంటిది అని పారు కవర్ చేస్తుంది. జ్యోకు కౌంటర్ ఇచ్చి పారు వెళ్లిపోతుంది.
సూరజ్ తో దీప
ఉదయం కార్తీక్, దీప స్కూటీపై వెళ్తారు. అప్పుడే సూరజ్ ను చూస్తారు. నాన్నకు హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు కాపాడింది అతనే అని దీపకు సూరజ్ ను చూపిస్తాడు. కార్తీక్, దీప వెళ్లి సూరజ్ ను కలుస్తారు. దీపను సూరజ్ కు పరిచయం చేస్తాడు కార్తీక్. సూరజ్ కు దీప థ్యాంక్స్ చెప్తుంది. కార్తీక్ గురించి తనకు ముందే తెలుసని సూరజ్ చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


