కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: ఆఫీస్‌లో దీపతో కార్తీక్ రొమాన్స్- ఇద్దరి మరదళ్ల మధ్య కార్తీక్-జ్యో ప్రయోగం, బిత్తరపోయిన దీప

Karthika Deepam 2 Serial May 21st Episode: కార్తీక దీపం 2 సీరియల్ మే 21వ ఎపిసోడ్‌లో సీఈఓ పోటీ అగ్రిమెంట్‌పై జ్యోత్స్న, దీప సంతకం చేస్తారు. ఇద్దరికి ఎదురెదురుగా క్యాబిన్ ఇస్తారు. ఆఫీస్‌లో దీపతో కార్తీక్ రొమాంటిక్‌గా ప్రవర్తిస్తాడు. ఆ కోపంతో దీపపై జ్యోత్స్న ల్యాప్‌ట్యాప్ ప్రయోగం చేస్తుంది.

Published on: May 21, 2026, 07:16:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో ఆఫీస్‌లో సీఈఓ పోటీకి అగ్రిమెంట్‌పై జ్యోత్స్న సంతకం చేస్తుంది. దీపను చేయమంటే.. అసలు తనకు సంతకం చేయొచ్చా అని ఎగతాళి చేస్తుంది జ్యోత్స్న. తను 5వ తరగతి వరకు చదువుకుందని కార్తీక్ అంటాడు. ఏదో ఎంబీబీఎస్ చదివినట్లు చెప్పావని వెటకారంగా అంటుంది జ్యోత్స్న.

కార్తీక దీపం 2 సీరియల్ మే 21 ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ మే 21 ఎపిసోడ్

తండ్రి కోసం చదువు ఆపి

దానికి పని మనుషులు, ఇస్త్రీ చేసేవాళ్లు, 2 లక్షల స్కూల్ ఫీజు, 25 లక్షల కారులో వెళ్లడంతో నీ చదువు అయింది. కానీ, ఓ మధ్య తరగతి ఆడపిల్లకు రోజు ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా అని దీప అంతవరకు చదువుకోవడం ఎంత కష్టమైందో గొప్పగా చెబుతాడు కార్తీక్. తండ్రి కష్టం చూసి తనకిష్టమైన చదువును ఐదో తరగతిలోనే ఆపేసిందని, నీకు యూనివర్సిటీ డిగ్రీ ఎంతో తనకు ఐదో తరగతి కూడా అంతే అని కార్తీక్ అంటాడు.

నీ చదువు నీకు ఏ జ్ఞాపకాన్ని ఇవ్వలేదు. కానీ, తనకు ప్రతీది జ్ఞాపకంగా మారింది. దీప సంతకం పెట్టు అని కార్తీక్ అంటాడు. కే దీప అని దీప సైన్ చేస్తే.. కే అంటే అని జ్యో అడుగుతుంది. కార్తీక్. అదే నా చిరునామా అని దీప చెబుతుంది. కథ ఇప్పుడే మొదలైందని జ్యో అంటుంది. ఇకనుంచి మీరిద్దరు టెంపరరీ సీఈఓలు అని, వాళ్లకు క్యాబిన్స్ చూపించమని శివ నారాయణ చెబుతాడు.

జ్యోత్స్న, దీపకు క్యాబిన్స్ ఎదురెదురుగా ఉంటాయి. జ్యోత్స్న, దీప మాటలతో సెటైర్లు, పంచ్‌లు వేసుకుంటారు. సూరజ్‌ను రోడ్డుపైకి తేవడం గుర్తు చేసిన కార్తీక్ ఓ పొగరుబోతు గురించి చెప్తున్నానంటాడు కార్తీక్. జ్యోత్స్నకు పంజాగుట్టా బ్రాంచ్ ఇచ్చారని చెబుతుంది. ఇదంతా ఇంగ్లీష్‌లో ఉందని దీప చెప్పడంతో జ్యోత్స్న నవ్వుతుంది. దీప ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటుందని చెప్పి మైత్రివనం బ్రాంచ్ వచ్చిందంటాడు.

గెలిచే ఛాన్స్ కూడా ఉంది

ఇక్కడ పోటీ గట్టిగా ఉంటుంది. గెలిచే ఛాన్స్ కూడా ఉందని కార్తీక్ అంటే.. మనసులో ఈ రెండు వారాల్లో ఏదైనా జరగొచ్చు. దీప గెలవదు. నేను గెలుస్తాను అని జ్యో అనుకుంటుంది. మరోవైపు శివ నారాయణ ఇంట్లో శౌర్య ఉంటుంది. కాంచన కళ్లు మూసి శ్రీధర్‌‌ను దాక్కోమంటుంది. కాంచన పట్టుకోలేనంటుంది. దాంతో శ్రీధర్‌ను శౌర్య కళ్లు మూయమంటే.. సరేనన్న శ్రీధర్ కాంచన కళ్లు మూసేందుకు వెళ్లి ఆగిపోతాడు.

అదంతా చూసిన పారిజాతం శ్రీధర్‌పై పంచ్‌లు వేస్తుంది. కార్తీక్ టాపిక్ తీసుకొచ్చి పారిజాతంపైనే సెటైర్లు వేస్తాడు శ్రీధర్. పారిజాతంపై కాంచన ఫైర్ అవుతుంది. తర్వాత నాన్న కోసం శౌర్య ఏడుస్తుందని అనసూయ ఫోన్ చేస్తే తనే తీసుకొచ్చినట్లు శ్రీధర్ చెబుతాడు. కార్తీక్‌కు పని చెప్పాలని ఫైల్ చదవమంటుంది జ్యోత్స్న. కానీ, పక్కనే టేబుల్ వేసుకున్న కార్తీక్ భార్య దీపకు సైట్ కొడతాడు. చాటుగా కన్నుకొడతాడు.

జ్యోత్స్న ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. మా ఆవిడకు సైట్ కొడుతున్నా. నిజం చెప్పాలంటే నా భార్యతో నేను ఈరోజే ప్రేమలో పడ్డాను అని కార్తీక్ అంటాడు. ఇది ఆఫీస్ బావ అని దీప అంటుంది. ఆఫీస్‌లో దీప దగ్గరికి జరిగి రొమాంటిక్‌గా మాట్లాడుతాడు కార్తీక్. తన కళ్లముందే దీపతో కార్తీక్ రొమాంటిక్‌గా ఉండటం చూసి జ్యోత్స్న భరించలేకపోతుంది. ఆఫీస్‌లో ప్రేమ కవితలు చెప్పేందుకు నిన్ను తీసుకురాలేదని, నాకు సపోర్ట్‌గా ఉండాలని అంటుంది జ్యోత్స్న.

ఇద్దరి మరదళ్ల మధ్య కార్తీక్

తాత దగ్గరికి వెళ్లి కూర్చో అని జ్యోత్స్న అంటే.. లేదు నాకు ఇక్కడే బాగుంది. ఇలా ఇద్దరి మరదళ్ల మధ్య కాలు మీద కాలేసుకుని కూర్చొంటే పాపికొండలకు బోట్ షికారుకు వెళ్లినట్లే ఉందని కార్తీక్ అంటాడు. బ్రేక్ టైమ్‌లో క్యాంటిన్‌కు రమ్మని ఇన్‌డైరెక్ట్‌గా దీపకు చెప్పి వెళ్లిపోతాడు కార్తీక్. దీప మురిసిపోతుంది. తర్వాత కార్తీక్ వెంటే వెళ్తుంది దీప. కార్తీక్ దగ్గరి దీప వెళ్తుంది. దీపను మేడమ్ అని కార్తీక్ పిలుస్తాడు.

నీ సొంత కంపెనీకి కాబోయే సీఈఓ అని కార్తీక్ అంటాడు. నీ భార్యకు మించిన అధికారం, ప్రేమకు మించిన ఐశ్వర్యం ఇంకేం లేదని దీప అంటుంది. అంతలో జ్యోత్స్న వచ్చి వాటే డైలాగ్ అంటుంది. అది హాట్ సీట్. దాంట్లో కూర్చునే వాళ్లకే తెలుస్తుందని జ్యోత్స్న అంటుంది. ఎన్నో దాటే వచ్చామని కార్తీక్ అంటాడు. కాఫీ వేస్ట్ అయిపోయిందని కార్తీక్ వెళ్లిపోతాడు.

నీ గెలుపు నీకోసం. నా గెలుపు కుటుంబం కోసం. కూతురు జోలికి వస్తేనే ఊరుకోలేదు. కుటుంబం జోలికి వస్తే ఊరుకుంటానా అని జ్యోత్స్నకు స్వీట్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది దీప. ఫస్ట్ డే అని నేను ఇంకా నీ మీద ఏ ప్రయోగం చేయలేదు. చేస్తే ఎలా ఉంటుందో చూస్తావుగా అని జ్యోత్స్న నవ్వుకుంటుంది. తర్వాత మేనేజర్ వచ్చి దీపకు ల్యాప్‌ట్యాప్ ఇస్తాడు. వివరాలు, ఫైల్స్ అన్ని అందులో ఉంటాయని, మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వమని అతను చెబుతాడు.

దీపకు అవమానం

కార్తీక్ చెప్పేందుకు ట్రై చేస్తుంటే ఛైర్మన్‌కి కంప్లైంట్ చేస్తానని జ్యోత్స్న బెదిరిస్తుంది. దీపకు అంతా అయోమయంగా ఉంటుంది. ల్యాప్‌ట్యాప్‌లో వర్క్ అనేసరికి బిత్తరపోతుంది దీప. తన దగ్గర ఓటర్ ఐడీ ఉందని చెబుతుంది. దాంతో జ్యోత్స్న గట్టిగా నవ్వుతుంది. స్టాఫ్ అందరి ముందర దీప పరువు తీస్తుంది జ్యోత్స్న.

ఎవరి దగ్గర ఏం చెప్పాలో తెలుసుకో వంశీ. వంటల గురించి అడిగితే చెబుతుంది కానీ ల్యాప్‌ట్యాప్ ముందర పెట్టి యాప్, లాగిన్ అంటే కంగారుపడిపోదు అని జ్యోత్న్న చులకనగా మాట్లాడుతుంది. అలా మొదటి రోజే దీపపై ల్యాప్‌ట్యాప్ ప్రయోగం చేస్తుంది జ్యోత్స్న. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More