కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: మొదటి గండం దాటిన దీప- తాబేలు కథతో జ్యోత్స్నకు కార్తీక్ కౌంటర్- కూతురికి సుమిత్ర వార్నింగ్
Karthika Deepam 2 Serial May 22nd Episode: కార్తీక దీపం 2 సీరియల్ మే 22వ ఎపిసోడ్‌లో ఆఫీస్‌లో దీపను జ్యోత్స్న నానా మాటలో అవమానిస్తుంటుంది. ఆ గ్యాప్‌లో దీపకు మెయిల్ ఐడీ క్రియేట్ చేసి ఫోన్‌కు పంపిస్తాడు. దాంతో దీప లాగిన్ అవుతుంది. తన ముందు కాళ్లమీద కూర్చుని ఓడిపోయానని దీప అనేలా చేస్తానని జ్యో అంటుంది.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో మేనేజర్ వంశీ వచ్చి దీపకు ల్యాప్‌ట్యాప్ ఇచ్చి ఇందులోనే వర్క్ చేయాలని చెబుతాడు. మెయిల్ ఐడీతో ఓపెన్ చేసి చూడండని అని అతను అంటే.. నాకు ఓటర్ ఐడీ ఉందని దీప అంటుంది. దాంతో జ్యో అందరిముందు దీపను అవమానిస్తుంది.

దీపకు జ్యోత్స్న అవమానం
స్టాఫ్ అందరికి చెప్పి వంటల గురించి అయితే బాగా చెబుతుంది కానీ, మెయిల్ ఐడీలు ఓపెన్ చేసి లాగిన్‌లు, యాప్‌లు అంటే కంగారుపడిపోదు అంటుంది జ్యోత్స్న. వంటలు చేసుకునే మనిషే వచ్చి సీఈఓ అవ్వాలనుకుంటున్నప్పుడు మేనేజర్‌గా ఉన్న నువ్వు కూడా సీఈఓ అవ్వాలని కోరుకోవడంలో తప్పులేదనిపిస్తోంది కదా అని వంశీని జ్యో అంటే అవును అని అతను అంటాడు. తర్వాత కాదంటాడు.
వంటలు చేసుకునే మనిషిని సీఈఓగా నిలబెట్టడం ఏంటని అనిపిస్తుంది కదా. అదే నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే వెళ్లిపోయేదాన్ని. కానీ, ఇక్కడ విచిత్రం ఏంటంటే నీకు చేతకాదని నీకు తప్పా ఇక్కడ అందరికి అర్థమైతుంది. హౌజ్ కీపింగ్‌కు మాత్రమే పనికి వచ్చే నీలాంటివాళ్లను ఈ పోస్టుకు సజ్జెస్ట్ చేయడం ఏంటో. యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసిన నేను లాగిన్ కూడా చేతకాని వాళ్లతో పోటీ పడుతున్నాను అని జ్యో నానా మాటలు అంటుంది.
దీప ఫీల్ అవుతుంది. ఏడుపు మొఖం పెడుతుంది. దాంతో ప్యూన్‌ను పిలిచిన కార్తీక్ మెయిల్ ఐడీ ఉందా, ఎవరు క్రియేట్ చేశారని అడుగుతాడు. ఫ్రెండ్ క్రియేట్ చేశాడని చెబుతాడు ప్యూన్. మనకు తెలియకుంటే మన ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు. అది మన ఫోన్‌కు పంపించొచ్చు, పాస్‌వర్డ్ పంపొచ్చు అని కార్తీక్ అంటాడు. దాంతో ఓపెన్ చేయవచ్చు, లాగిన్ కావచ్చు. ఈమాత్రం దానికే మనుషులు కంగారుపడిపోతారు అని కార్తీక్ అంటాడు.
మొదటి గండం దాటిన దీప
దాంతో దీప సంతోషిస్తుంది. వంశీతో మెయిల్ ఐడీ ఉందని, లాగిన్ అవ్వమని చెబుతుంది దీప. స్టాఫ్ అందరిని చూస్తూ ఈ మాత్రం దానికి ఇంత హడావిడి దేనికి. సినిమా చూస్తున్నట్లు చూస్తున్నారు. హ్యాపీగా వర్క్ చేసుకోండి అని కార్తీక్ వెళ్లిపోతాడు. తర్వాత దీప దగ్గరికి వెళ్లిన జ్యోత్స్న ఈ మొదటి గండాన్ని అంటే బావ గట్టెక్కించాడు. తర్వాత ఏం చేస్తావ్ అని జ్యో అంటుంది.
సీఈఓ అయి కన్నవాళ్లకు దగ్గర అవ్వాలని చూస్తున్నావా. కన్నతల్లి దూరమైతే ఎలా ఉంటుందో చూపిస్తా. నా ముందు మోకాళ్ల మీద కూర్చుని జ్యోత్స్న నేను ఓడిపోయాను అని నీతో చెప్పించి, నీ తండ్రితోనే నువ్వు చేతకానిదానివని ఆఫీస్ నుంచి గెంటించేలా చేస్తాను చూడు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది జ్యో. దీప మాత్రం సైలెంట్‌గా ఉండిపోతుంది. మరోవైపు కాశీతో స్వప్న చాలా ప్రేమగా ఉంటుంది.
కాశీ తాగిన కాఫీ తాగుతుంది స్వప్న. ప్రేమ గురించి గొప్పగా చెబుతుంది స్వప్న. పెళ్లి బాగా కమర్షియల్ అయిపోయిందంటుంది స్వప్న. ఒకరు పుట్టి, చదివి, జాబ్ తెచ్చుకుని, పెళ్లి చేసుకుని ఓ ఉమ్మడి కుటుంబంలో అందరూ సంపాదించేసరికి బంధాలు కనుమరుగైపోతున్నాయని స్వప్న చెబుతుంది. వస్తువులకు కొనేటప్పుడు వారెంటీ ఉన్నట్లే పెళ్లికి కూడా ఉంటే బాగుంటుందని స్వప్న అంటుంది.
శౌర్యకు జ్యో పిన్ని
మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం చేస్తే సరిపోతుంది కదా అని స్వప్న అంటుంది. నీతో వాదించలేను కానీ రాయలసీమ టొమాటో రసం పెట్టు అని కాశీ అంటాడు. దాంతో సరేనని స్వప్న వెళ్లిపోతుంది. అగ్రిమెంట్‌లు, గ్యారెంటీలు రాసుకుంటే పెళ్లి కాదు వ్యాపారం అవుతుంది అని కాశీ అనుకుంటాడు. మరోవైపు ఇంటికి కార్తీక్, దీప, జ్యోత్స్న వెళ్తారు. శౌర్యకు జ్యోత్స్న పిన్ని అవుతుందని కార్తీక్ అంటాడు.
మొదటి రోజు ఆఫీస్ గురించి కాంచన అడుగుతుంది. నేను చెబుతానని జ్యో అంటుంది. ఏదో గొడవ జరిగినట్లే ఉందని కాంచన అంటే.. గొడవ అనేది ఇద్దరు సమానమైన వాళ్ల మధ్య జరుగుతుందని జ్యో అంటుంది. బావ అంటే తాళి కట్టాడు. చదువు సంధ్య లేని పల్లెటూరి మొద్దుని నువ్వు కోడలిగా ఎలా ఒప్పుకున్నావ్ అత్త అని జ్యోత్స్న అంటుంది. దీపకు బుర్ర లేదని జ్యో అంటుంది. నాలిక తిరిగినట్లు నోరు మాట్లాడితే ఒంటికి దెబ్బలు పడతాయని కాంచన చేయి చూపిస్తుంది.
కొట్టు అత్త.. నువ్వు నా మేనత్త. నీకు నన్ను కొట్టే హక్కుందని అంటుంది జ్యో. ఆఫీస్‌లో ల్యాప్‌ట్యాప్ చూడగానే దీపకు చేతులు వణికాయని జ్యో చెబుతుంది. కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోపెట్టడం అనే సామేత ఏదో ఉందిగా అది చెప్పరాదు గ్రానీ అని జ్యో అంటే.. పారిజాతం చెబుతుంది. ఈ సామేత దీపలాంటి వాళ్లకు బాగా సూట్ అవుతుందని జ్యో అంటే.. అప్పుడే వచ్చిన సుమిత్ర కోప్పడుతుంది.
తాబేలు, కుందేలు కథ
కానీ, కార్తీక్ మాత్రం వద్దంటాడు. తాబేలు, కుందేలు కథ చెబుతాడు. గర్వం ఏదో రోజు తల దించుకుంటుంది, నమ్మకం తల ఎత్తుకుంటుంది. ఇందాక ఏమన్నావ్. కార్పొరేట్ ఆఫీస్‌లో గరిటెలు తిప్పేవాళ్లకు ఏం తెలుస్తుందనేగా. ఆ ఆఫీస్‌లో కూడా చేసేది వంటల గురించే అని కార్తీక్ కౌంటర్ ఇస్తాడు. నా భార్యకు ఉన్నతమైన విద్య లేదు, కానీ, సంస్కారం ఉందని చాలా విషయాల్లో గొప్పగా చెబుతాడు కార్తీక్.
నా భార్య తాబేలు లాంటిదే. ఈ రేసులో కూడా నా భార్యే గెలుస్తుంది. అప్పుడు గెలిచిన మనిషి నీకు శిఖరంలా కనిపిస్తుంది అని కార్తీక్ అంటాడు. బాగా చెప్పావురా అని కార్తీక్‌ను మెచ్చుకున్న సుమిత్ర జ్యోత్స్నను తిడుతుంది. ఇలాంటి పంచాయితీలు పెట్టకు. నువ్వు నా బలహీనత కదా అని ఏం చేసిన భరిస్తా అనుకోకు. నాలో మొండిది కూడా ఉంది. ఆ మొండిదానికి కడుపున పుట్టినవాళ్లను మర్చిపోయేంత శక్తి ఉందని కూతురు జ్యోత్స్నకు సుమిత్ర వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.
దీపకు మామ సపోర్ట్
ఏదైనా నేర్చుకుంటే వస్తుందని దీపకు సపోర్టింగ్‌గా మాట్లాడతాడు శ్రీధర్. అందరికి చెప్పేసి వెళ్లిపోతాడు. తర్వాత మేడమ్ మాతో ఏదైనా పని ఉందా. వెళ్లొచ్చా అని జ్యోతో వెటకారంగా అంటాడు కార్తీక్. దాన్ని అడిగేదేంటీ వెళ్లు అని పారిజాతం అంటుంది. దాంతో కార్తీక్, దీప వెళ్లిపోతారు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


