Karthika Deepam 2 Today Episode: శ్రీధర్‌కు డాటర్ స్ట్రోక్- కోర్టుగా ఇల్లు, జడ్జ్‌గా కార్తీక్- కలిసిపోయిన కాశీ, స్వప్న!
Karthika Deepam 2 Serial May 9th Episode: కార్తీక దీపం 2 సీరియల్ మే 9వ ఎపిసోడ్‌లో కాశీ, స్పప్న ఇద్దరు గొడవ పడతారు. నా తండ్రి చనిపోయినా నిన్ను యాక్సెప్ట్ చేయనురా అని కాశీతో అంటుంది స్వప్న. అది విన్న శ్రీధర్ కార్తీక్‌ను పిలుస్తాడు. ఇల్లును కోర్టుగా మార్చి కార్తీక్‌ను జడ్జ్‌గా చేసి న్యాయం చెప్పమంటాడు.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో సూరజ్‌ను కార్తీక్, దీప కలుస్తారు. కార్తీక్ గురించి ముందే తెలుసు అని సూరజ్ చెబుతాడు. హాస్పిటల్‌లో సరిగా పోల్చుకోలేదని, ఇంటికెళ్లాక గుర్తు వచ్చిందని సూరజ్ అంటాడు. సీఈఓ అయిండి డ్రైవర్ అంటారేంటీ అని సూరజ్ అడిగితే.. అదో పెద్ద కథ అని కార్తీక్ అంటాడు.

నచ్చే పని చేయాలనుకుంటున్నా
సూరజ్ పెట్టిన జ్యూస్ షాప్ చూసి అన్ని ఆరోగ్యానికి సంబంధించినవే అని కార్తీక్ అంటాడు. కార్తీక్, దీపకు జ్యూస్ ఇస్తాడు సూరజ్. చాలా బాగుందని మెచ్చుకుంటారు. ఆరోజు ఏదో అవకాశం మిస్ అయిందన్నావ్, సాఫ్ట్‌వేర్ అనుకున్నా, ఏం చదువుకున్నావ్ బ్రదర్ అని కార్తీక్ అడుగుతాడు. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నా అని సూరజ్ అంటే.. మరి ఇదేంటని కార్తీక్ అడుగుతాడు.
నేను మనుసుకు నచ్చే పని చేయాలనుకుంటా. ఒకటి అనుకున్నా అది జరగలేదు. అందుకే ఇది స్టార్ట్ చేశాను. ఇది నచ్చకపోతే మరోకటి చేస్తాను అని సూరజ్ చెబుతాడు. ఏదైనా ఆఫర్ వస్తే వెళ్తావా అని కార్తీక్ అడుగుతాడు. ఒకరి కింద నేను పనిచేయను బ్రదర్. ఇది నా ఇగో కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ అని సూరజ్ అంటే.. నచ్చావ్ బ్రదర్. నా పాలసీ కూడా ఇదే. కానీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కోసం కొన్ని సిద్ధాంతాలు త్యాగం చేయాల్సి వచ్చిందని కార్తీక్ అంటాడు.
మీరు నాకంటే గ్రేట్ బ్రదర్ అని సూరజ్ అంటే.. ఇక్కడ అందరు గ్రేటే. మీకు పెళ్లి అయిందా అని కార్తీక్ అడుగుతాడు. నన్ను అర్థం చేసుకునే అమ్మాయి దొరికితే చేసుకుంటానని సూరజ్ చెబుతాడు. కార్తీక్, దీప వెళ్తారు. పైకి చెప్పట్లేదు కానీ అతనికి అవకాశం మా నాన్నను కాపాడటం వల్లే పోయింది. అవకాశం వచ్చినప్పుడు అతని రుణం తీర్చుకోవాలని కార్తీక్ అంటాడు. మరోవైపు కలిసిపోవడం గురించి ఏం చేశావని స్వప్నను అడుగుతాడు కాశీ.
చీప్ ట్రిక్స్ మానుకో
ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకో అని స్వప్న కోప్పడుతుంది. కావేరి వచ్చి మన ఫ్యామిలీ కోసమేగా అడిగేదని కావేరి అంటుంది. నా ఫ్యామిలీ గురించి అని నొక్కి చెబుతుంది స్వప్న. నాన్నకు మనశ్శాంతి కలిగించే విషయం ఏదైనా ఉందంటే అది కాశీ కనిపించకుండా పోవడమే అని స్వప్న అంటుంది. మన గురించి కాకుండా మావయ్య గురించి ఆలోచించు అని కాశీ అంటాడు.
నా తండ్రి గురించి ఆలోచించడానికి నువ్వు ఎవరు. నా తండ్రికి ఏమైతే నీకేంట్రా. పోరా బయటకి.. వీడోక అవకాశవాది అమ్మా. చావును అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడుతున్నాడు. ఇప్పుడు నిన్ను యాక్సెప్ట్ చేయకపోతే నా తండ్రి చనిపోతాడని బెదిరిస్తున్నావా అని స్వప్న కోపంగా అంటుంది. నీ తండ్రిని నువ్వే చంపేసేలా ఉన్నావని కాశీ అంటాడు. నా తండ్రి చచ్చిపోయినా నిన్ను యాక్సెప్ట్ చేయను అని స్వప్న అంటుంది.
దాంతో స్వప్నను తల్లి కావేరి ఒక్కటి కొడుతుంది. నిలువెల్ల పొగరుతో కళ్లు మూసుకుని మాట్లాడుతున్నావ్. ఈ మాట మీ నాన్న వింటే ఏమవుతుందో తెలుసా అని కావేరి అంటుంది. ఇంతలో ఏమవుతుంది కావేరి. విన్నాను. ఏం కాలేదు. ఇక మీ గొడవను సాగదీయాలని లేదు. మీ సమస్యను పరిష్కరిస్తాను లోపలికి రండి అని శ్రీధర్ అంటాడు. రేపటి నుంచి నీ మొహం చూసే అవకాశం ఉండదని స్వప్న అంటుంది.
డాటర్ స్ట్రోక్
కట్ చేస్తే.. కార్తీక్ శ్రీధర్ ఇంటికి వస్తాడు. ఎందుకు రమ్మన్నావ్ మాస్టర్ అని కార్తీక్ అడుగుతాడు. ఈసారి హార్ట్ స్ట్రోక్ రాలేదురా. డాటర్ స్ట్రోక్ వచ్చింది. దాంతోపాటు అల్లుడు స్ట్రోక్, భార్య స్ట్రోక్ సమ్మర్ ఆఫర్‌లో వచ్చేలా ఉన్నాయని శ్రీధర్ అంటాడు. ఇప్పుడు నేను ఆవేశపడపోతున్నాను. అరిచి పడిపోతే నువ్వే తీసుకెళ్లిపోవాలి. ఈ ముగ్గురు నన్ను తీసుకెళ్లడానికి పోటీ పడటంలో మిగిలిపోతారని శ్రీధర్ అంటాడు.
స్వప్న అన్న మాటలు చెబుతాడు శ్రీధర్. ఈరోజు ఈ మొగుడు పెళ్లాల సమస్యకు ఈ ఇల్లే కోర్టు, నువ్వే జడ్డ్. నేనే న్యాయవాది, బాధితున్ని, ప్రేక్షకున్ని అన్నీ నేనే. ఓ తండ్రి వాదించబోతున్న కూతురు విడాకుల కేసు. ఓ అన్న చెల్లికి ఇవ్వబోతున్న విడాకుల జడ్జ్‌మెంట్ కేసు. కావేరి న్యాయదేవత అని శ్రీధర్ అంటాడు. ఈ కేసులో తక్షణమే తీర్పు కావాలని శ్రీధర్ అంటాడు.
నా కోసం నా కూతురు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నా ఫొటోకు దండ పడిన సరే. నా కూతురు లాగే నా గుండె కూడా నా మాట వినడం లేదు. రేపు నేను పోయాక మీరందరు రిప్ అని స్టేటస్‌లు పెట్టుకోండి. దానికి మీరంతా సిద్ధమే అనుకోండి. నేను కూడా సిద్ధమే. తీర్పు చెప్పండి, న్యాయం చెప్పండి యువరానర్ అని శ్రీధర్ వాదిస్తాడు. పిన్ని నాన్న బట్టలు సర్దు. మా ఇంటికి అని కార్తీక్ అంటాడు.
ఏకాంతం కోరుకుంటున్నావ్ కదా
నువ్వు కూడా బట్టలు సర్దుకో పిన్ని. మాతోపాటు వచ్చేయ్ అని కార్తీక్ అంటాడు. మరి నేను అని స్వప్న అంటే.. నువ్వు ఏకాంతం కోరుకుంటున్నావ్ కదా అని కార్తీక్ అంటాడు. కాశీ తప్పు చేశాడు అన్నయ్య అని స్వప్న అంటే.. ఎన్నాళ్లు ఇదే చెప్తావ్. మా అమ్మను చూసి నేర్చుకుంటున్నావేమో. అదే నిజమైతే దూరం పెట్టడమే కాదు భర్త కోసం విలవిల్లాడటం కూడా చూడు అని కార్తీక్ అంటాడు.
నా కష్టాలు ఓదార్చి కన్నీళ్లు తుడవటానికి నాకు మీ వదిన ఉంది. నీకు ఎవరున్నారు. మీకు 5 నిమిషాలు టైమ్ ఇస్తున్నా. ఏమైనా మాట్లాడుకోండి. కలిసి ఉంటామంటే నాన్నను ఇక్కడే వదిలేసి వెళ్తా. లేదు అంటే తీసుకెళ్లిపోతా అని కార్తీక్ అంటాడు. దాంతో స్వప్నను కాశీ పిలుస్తాడు. కాశీ, స్వప్న మాట్లాడుకుంటారు. ఇద్దరు వస్తారు. కార్తీక్ నిర్ణయం చెప్పమంటాడు. మేము కలిసి ఉంటామని స్వప్న చెబుతుంది.
నేను, కాశీ భార్యాభర్తల్లా కలిసి ఉంటామని స్వప్న చెబుతుంది. దాంతో శ్రీధర్ తెగ సంబరపడిపోతాడు. లాయర్ గారు మీరే గెలిచారు అని కార్తీక్ అంటాడు. కాశీ చేతిలో స్వప్న చేయి వేసి ఎప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుని ఉండండని కార్తీక్ చెబుతాడు. అలా కాశీ, స్వప్న ఇద్దరిని తన ప్లాన్‌తో కలిసేలా చేస్తాడు కార్తీక్. అంతలో దాసు వచ్చి చప్పట్లు కొడతాడు. శ్రీధర్ డబుల్ హ్యాపీ అని అంటాడు. ఇక వీళ్ల కథ సుఖాంతం అయినట్లే అని కార్తీక్ వెళ్లిపోతాడు.
కలిసిపోయిన కాశీ, స్వప్న
కాశీ, స్వప్న కలిసిపోయినట్లు కాంచనకు చెబితే సంతోషిస్తుంది. కార్తీక్ కూడా మనశ్శాంతిగా, నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నట్లు కాంచన చెబుతుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నానో తెలిసి చాలా సంతోషిస్తావమ్మా. ఆరోజు నీ కళ్లలో కన్నీళ్లు ఉంటాయని కార్తీక్ చెబుతాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


