కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్న తిక్క కుదిర్చిన సూరజ్- జ్యూస్‌లు అమ్మిన మాజీ మిస్ హైదరాబాద్- లైవ్ స్ట్రీమింగ్
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూన్ 1 ఎపిసోడ్ లో సూరజ్ స్టాల్ లో జ్యోత్స్న పని చేస్తుంది. జ్యూస్ లు రెడీ చేసి, సర్వ్ కూడా చేస్తుంది. సూరజ్, కార్తీక్ కలిసి జ్యోతో ఆటాడుకుంటారు. ఆ ఫొటోలను చూసి శివ నారాయణ ఫీల్ అవుతాడు. ఆఖర్లో జ్యోకు సూరజ్ అదిరిపోయే వార్నింగ్ ఇస్తాడు.
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక దీపం 2 టుడే జూన్ 1 ఎపిసోడ్ లో.. సూరజ్ స్టాల్ దగ్గరకు జ్యోత్స్నను తీసుకొస్తాడు కార్తీక్. తోడుగా పారిజాతం కూడా వస్తుంది. వచ్చింది పని చేయడానికి, కారు దిగమని జ్యోను స్టాల్ దగ్గరకు తీసుకెళ్తాడు కార్తీక్.

జ్యోత్స్నకు షాక్
సూరజ్ స్టాల్ దగ్గర అక్కడ ‘నా వల్ల తప్పు జరిగింది’, ‘సూరప్ హెల్తీ ఫుడ్ ఈజ్ ది బెస్ట్’ అనే ప్లకార్డులు జ్యోత్స్న పట్టుకున్నట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. అవి చూసి జ్యో షాక్ అవుతుంది. ఈ ఫ్లెక్సీల గురించి నాకు ఎందుకు చెప్పలేదని అడుగుతుంది జ్యో. వచ్చిన చెడ్డపేరును పోగొట్టాల్సింది నువ్వే కాబట్టి, అందుకే ఈ ఏర్పాట్లు అని కార్తీక్ చెప్తాడు. సోషల్ మీడియాలో కూడా గట్టిగానే పబ్లిసిటీ చేశానని కార్తీక్ మరో షాక్ ఇస్తాడు.
పని మనిషిలా జ్యోత్స్న
షాప్ లో పని చేసే అమ్మాయిలా కనిపించాలి. ఆప్రాన్ కట్టుకుని, క్యాప్ పెట్టుకుని జ్యూస్ లు చేయాలని జ్యోత్స్నకు చెప్తాడు కార్తీక్. ఆప్రాన్ కట్టుకున్న జ్యోను చూసి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యావని కార్తీక్ అంటాడు. ఈవిడను గుర్తుపట్టారా? మాజీ మిస్ హైదరాబాద్. మీ కోసం జ్యూస్ లు చేసేందుకు వచ్చిందని అక్కడున్నవాళ్లందరికీ చెప్తాడు కార్తీక్.
ఫీల్ అయిన శివ నారాయణ
షాప్ లో జ్యోత్స్న జ్యూస్ లు చేసి, సర్వ్ చేస్తుంది. ఆ ఫొటోలను శివ నారాయణకు కార్తీక్ పంపిస్తాడు. ఆ పిక్స్ చూసి శివ నారాయణ ఫీల్ అవుతాడు. ఈ ఇంటి వారసురాలు ఎలాంటి పరిస్థితి తెచ్చుకుందో చూడండి. అహంకారం మనిషిని ఏ స్థాయికి దిగజారుస్తుందో ఇప్పటికైనా తెలుసుకుంటే చాలు. నాకు ఇష్టం లేకపోయినా తనలో మార్పు కోసమే వెళ్లమన్నా. లేదంటే ఈ శివ నారాయణ మనవరాలు ఎవరో అనామకుడి షాప్ లో జ్యూస్ అమ్మడం ఏంటీ? అని శివ నారాయణ బాధపడతాడు.
కాంచన, దీప ఏమో సూరజ్ ను వెనకేసుకుని వస్తారు. దశరథ, సుమిత్ర ఏమో జ్యోత్స్నకు బుద్ధి రావాలని అంటారు. సూరజ్ ది మంచి మాట తీరు, మంచి పద్ధతి. మంచి కుటుంబంలో పెరిగిన వాడు కావొచ్చు అని కాంచన అంటుంది.
పారుపై డౌట్
సీన్ మళ్లీ సూరజ్ స్టాల్ కు మారుతుంది. చెమటలు కక్కుతూ జ్యోత్స్న పని చేయడాన్ని పారిజాతం చూడలేకపోతుంది. ఓ కూలర్ పెట్టించమని అడుగుతుంది. ఇది సూరజ్ బడ్జెట్. నో ఏసీ, నో రెస్ట్, సర్వీస్ చేయాల్సిందేనని కార్తీక్ స్పష్టం చేస్తాడు. పార్టీ మార్చేసినట్లున్నావని పారుపై అనుమానపడతాడు కార్తీక్. అప్పుడే నవ్వుతూ పని చేయాలని జ్యోత్స్నకు చెప్తాడు కార్తీక్.
లైవ్ స్ట్రీమింగ్
కస్టమర్ ను ఆకట్టుకోవడం ఒక టాలెంట్. రోడ్డు మీద వెళ్లే కస్టమర్లను పిలవాలని జ్యోతో అంటాడు కార్తీక్. అలా చేయనని జ్యో అంటుంది. అయితే ఈవ్ నింగ్ వరకు పని చేయాల్సిందే. ఇక్కడ జరుగుతున్నదాన్ని నా ఛానెల్ లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నానని సూరజ్ షాకిస్తాడు. మీ టాలెంట్ తో ఓ కస్టమర్ ను షాప్ కు రప్పించాలని సూరజ్ కూడా అడుగుతాడు.
జ్యో స్థాయి
సూరజ్ హెల్తీ ఫుడ్స్. ఆర్గానిక్ ఫుడ్స్ తో మేం సిద్ధంగా ఉన్నాం. టేస్ట్ చేయడానికి మీరు సిద్ధమేనా? అని జ్యోత్స్న అడ్వర్టైజ్ చేస్తుంది. అప్పుడే సిద్ధమంటూ ఓ కస్టమర్ వస్తాడు. నీ కొట్టు ముందు నువ్వే ఫొటోలు పెట్టుకున్నావేంటీ అని ఆ కస్టమర్ అడుగుతాడు. ఇలాంటి స్టాల్ పెట్టుకునేదానిలా కనిపిస్తుందా? ఆమె స్థాయి ఇది కాదని పారు ఫైర్ అవుతుంది. మరి ఏ స్థాయి అని అడిగితే.. పని మనిషి స్థాయి అని కార్తీక్ కౌంటర్ వేస్తాడు.
ఆ కస్టమర్ తో జ్యోత్స్న గొడవ పడుతుంది. జ్యో పరువు తీసేలా రంగబాబు అనే ఆ కస్టమర్ మాట్లాడతాడు. కార్తీక్ గొప్పింటి బిడ్డ అని రంగబాబు పొగిడేస్తాడు. స్పెషల్ జ్యూస్ అని అన్ని మిక్సీలో వేసి ఇస్తుంది జ్యోత్స్న. ఆ జ్యూస్ ఇవ్వబోతుంటే సూరజ్ అడ్డుకుని కిందపడేస్తాడు. కస్టమర్ కు మరో జ్యూస్ చేసి ఇస్తాడు.
సూరజ్ వార్నింగ్
ఆప్రాన్ తీసి విసిరేస్తుంది జ్యోత్స్న. ఇప్పటివరకూ ఇక్కడ పని చేయడమే ఎక్కువ అని బిల్డప్ ఇస్తుంది. శివ నారాయణ మనవరాలు అనే ట్యాగ్ లేకపోతే మీ పరిస్థితి పని మనిషే అని సూరజ్ కౌంటర్ వేస్తాడు. కాలం ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉంటుందని అనుకోవద్దు. నిన్న మీది, ఈ రోజు నాది. మళ్లీ నా జోలికి రాకండని జ్యోకు వార్నింగ్ ఇస్తాడు సూరజ్. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


