కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: తాత తీర్పును మార్చుకోమన్న జ్యోత్స్న- సీఈఓగా పనికిరావన్న శివ నారాయణ- కాశీ ఫుడ్ బిజినెస్!

Karthika Deepam 2 Serial May 30th Episode: కార్తీక దీపం 2 సీరియల్ మే 30వ ఎపిసోడ్‌లో సూరజ్ పరువు దక్కేందుకు జ్యోత్స్న సారీ చెప్పే ఫ్లెక్సీ, జ్యూస్‌లు సర్వ్ చేయాలని శివ నారాయణ తీర్పు ఇస్తాడు. సూరజ్ లేకుండా చేస్తానని పారుతో జ్యోత్స్న అంటుంది. రాత్రి తీర్పు వెనక్కి తీసుకోవాలని తాతను అంటుంది జ్యోత్స్న.

Published on: May 30, 2026, 07:31:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో రూ. 10 లక్షల పరిహారానికి బదులు జ్యోత్స్న సారీ చెప్పినట్లు షాప్ ముందు ఫ్లెక్సీ పెట్టేందుకు సూరజ్ ఒప్పుకుంటాడు. ఇంకా నయం నష్ట పరిహారంగా జ్యోత్స్నను జ్యూస్‌లు సర్వ్ చేయాలని అనలేదని పారిజాతం అంటుంది.

కార్తీక దీపం 2 సీరియల్ మే 30 ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ మే 30 ఎపిసోడ్

జ్యోత్స్నతో సారీ బోర్డ్

ఇది కూడా చాలా న్యాయంగా ఉంది. సరైన సమయంలో కరెక్ట్‌గా న్యాయం చేశారు. ఏ షాప్ దగ్గర నా గౌరవం పోయిందో ఆ షాప్ దగ్గర నా గౌరవం రావాలంటే ఫ్లెక్సీ పెట్టాలి. ఎవరి వల్ల క్వాలిటీ పోయిందో వారి వల్లే సర్వ్ చేస్తే నా పేరు నాకు తిరిగి వస్తుందని సూరజ్ అంటాడు. దీనికి ఒప్పుకోను అని జ్యోత్స్న అంటే.. ఇందులో ఏముంది. దీని వల్ల నీకు కూడా మంచి పేరు వస్తుంది. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వస్తుందని కార్తీక్ అంటాడు.

నేను అడగాలనుకుంది ఇదే సర్. ఇక మీరే న్యాయం చేయండని సూరజ్ అంటాడు. దాంతో దశరథ్‌ను ఏమంటావని శివ నారాయణ అడిగితే.. అది చేసిన తప్పు దానికి తెలియాలంటే ఇదే కరెక్ట్ అని సుమిత్ర అంటుంది. దశరథ్ కూడా ఒప్పుకుంటాడు. దాంతో సూరజ్ చెప్పినట్లే న్యాయం జరుగుతుంది. సూరజ్ చెప్పింది జరిగేలా కార్తీక్ చూసుకుంటాడు అని శివ నారాయణ నిర్ణయం చెప్పి వెళ్లిపోతాడు.

అంతా వెళ్లిపోతారు. రేపటి కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అన్ని తానే అని కార్తీక్ అంటాడు. ఫొటోగ్రాఫర్, డిజైనర్, సూపర్‌వైజర్ అని కార్తీక్ అంటాడు. లేట్ చేయకుండా ఫొటోషూట్‌కి వెళ్దాం పదండి అని కార్తీక్ వెళ్తాడు. జ్యోత్స్నను బలవంతంగా తీసుకెళ్తుంది పారిజాతం. తర్వాత ఖాళీ బోర్డ్ ఇచ్చి జ్యోత్స్నను పట్టుకోమని చెబుతాడు కార్తీక దానిమీద ఏదైనా రాసి పెట్టుకుంటారేమో అని పారిజాతం అంటుంది.

కవర్ చేసిన పారిజాతం

జ్యోత్స్నను ఫొటోకు స్టిల్ ఇవ్వమంటాడు కార్తీక్. రెండు రకాలుగా స్టిల్స్ తీస్తాడు కార్తీక్. ఆ ఫొటోలను తనకు పంపించమని, రేపు స్టాల్ దగ్గరికి మేడమ్‌ని తీసుకుని రమ్మని సూరజ్ వెళ్లిపోతాడు. జ్యోత్స్న కోపంగా వెళ్లిపోతుంది. పారు నీ కోపరేషన్ పూర్తిగా అటువైపే ఉన్నట్లుందని కార్తీక్ అంటే.. మనమీద డౌట్ రాకుండా ఉండేందుకు అని కవర్ చేస్తుంది పారిజాతం.

సరే ఇందాక ఏదో అన్నావ్. అర్థం లేని పనులు ఎవరు చేసేదో అర్థమైందో అని కార్తీక్ అంటాడు. అర్థమైంది. మనవడివని సరదాగా అన్నారా అని కార్తీక్ బుగ్గ గిల్లి వెళ్లిపోతుంది పారిజాతం. పారిజాతం గారు పార్టీ మార్చినట్లున్నారని దీప అంటే.. నాకు అదే డౌట్ అని కార్తీక్ అంటాడు. శివ నారాయణ వచ్చి సూరజ్ గురించి అడిగితే వెళ్లిపోయాడని చెబుతాడు కార్తీక్.

బాగా మొండోడిలా ఉన్నాడు. ఆత్మ గౌరవం కోసం డబ్బులు కూడా వద్దన్నాడంటే అలాంటి వాడు మన వ్యాపారంలో ఉంటే బాగుండేదేమోరా అని శివ నారాయణ అంటాడు. చూద్దాం ఎవరి ప్రయాణం ఎటు తిరుగుతుందో అని కార్తీక్ అంటాడు. మరోవైపు పారిజాతం అన్నదానికి జ్యోత్స్న తెగ మండిపడుతుంది. నా ఫ్లెక్లీలు పెట్టుకుంటే, నేను జ్యూస్‌లు అమ్మితే వాడి పరువు నిలబడుతుంది అనుకుంటున్నాడు. నేను వెళ్తే కదా అది జరగడానికి అని జ్యోత్స్న అంటుంది.

5 లక్షలకు మించిన బ్యూటీ

వాడి జోలికి పోకే అని పారిజాతం అంటే.. మాట ఇవ్వలేను. ఏం చేస్తే నా ఇగో హర్ట్ అవుతుందో వాడు అదే చేశాడని జ్యో అంటుంది. కాదే 5 లక్షలు ఇస్తే తీసుకోనోడు, నీ ఫొటో కావాలన్నాడు. 5 లక్షలకు మించిన బ్యూటీ నీ ఫేస్‌లో ఏముందే అని పారిజాతం అంటుంది. జ్యో కోప్పడుతుంది. మళ్లీ గొడవ చేయాలంటే సూరజ్ ఉండాలిగా. రేపు ఈపాటికి వాడు ఉండడు. వాడి స్టాల్ ఉండదు. అడ్రస్ కూడా దొరకదు. మనలాంటి డబ్బున్నవాళ్లతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలియాలిగా అని జ్యోత్స్న అంటుంది.

మరోవైపు స్వప్నతో మీ నాన్న సీఈఓగా లేరు. అల్లుడు గారు డ్రైవర్‌గా చేయాల్సిన పని లేదు. కానీ, ఏదో ఒక పని చూసుకోవాలిగా అని కావేరి అంటుంది. ఆ మాటలు కాశీ వింటాడు. అవమానంగా ఫీల్ అయి కోపంగా వెళ్లిపోతాడు కాశీ. తల్లిపై కోప్పడి స్వప్న వెళ్తుంది. కాశీని అడుగుతుంది. మా అమ్మ అయినా ఇలాగే ఆలోచించి ఉంటుంది కదా అని కాశీ అంటే.. స్వప్న తెగ సంతోషిస్తుంది. అపార్థం చేసుకుని నా మీద అలుగుతావేమో అనుకున్నా అని స్వప్న అంటుంది.

నేను జాబ్ చేయను. రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను అని కాశీ అంటే.. చాలా ఖర్చు అవుతుందని స్వప్న అంటుంది. ముందుగా ఆన్‌లైన్‌లో మొదలుపెడతాం. ఇంట్లోనే వంటలు చేసి బాక్సుల్లో ఆర్డర్ పంపిద్దాం. దానికి ఒక యాప్ క్రియేట్ చేసి మంత్లీ, వీక్లీ ప్యాకేజ్ అని నార్మల్ రేట్ పెడితే కచ్చితంగా ఆర్డర్స్ వస్తాయి. మనం మంచి ఆర్గానిక్ ఫుడ్ అందిద్దాం అని కాశీ అంటే.. ఐడియా అదిరిపోయిందని స్వప్న మెచ్చుకుంటుంది.

కాశీ రెస్టారెంట్ బిజినెస్

గ్రౌండ్ వర్క్ చేస్తున్నా. పూర్తయ్యాక మొదలుపెడదామని కాశీ అంటాడు. నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. చాలా హ్యాపీగా ఉందని కాశీ చేతులను ముద్దు పెట్టుకుంటుంది స్వప్న. మరోవైపు జ్యోత్స్నను సరిగ్గా పెంచనందుకు శివ నారాయణకు సారీ చెబుతాడు దశరథ్. కొన్ని వాళ్లు నేర్చుకునే పద్ధతుల్లో కూడా ఉంటుందని శివ నారాయణ అంటాడు. జ్యోత్స్న వచ్చి నీ తీర్పు మార్చుకో అని అడుగుతుంది.

పరువు పోయేలా చేసింది నువ్వను శివ నారాయణ అంటాడు. నువ్వు తప్పు చేస్తే ఒప్పుకోకు. ఎక్కడ ఓడిపోతానో అనే భయంతోనే సగం చచ్చిపోతావ్. మనం చేసినదానికి సమాధానం చేసుకోగలితే ఎక్కడా పరువుపోదు. నీ వల్ల ఓ నిజాయితీపరుడు గౌరవం పోగొట్టుకున్నాడు. అతను అడిగింది చేయాలి. నేను మాటిచ్చాను అని శివ నారాయణ అంటాడు. నీ మాట వెనక్కి తీసుకోండి. సైలెంట్‌గా ఉంటే వాడు పోతాడని గొడవ చేయలేదు అని జ్యోత్స్న అంటుంది.

రేపు వాడి దగ్గరికి 5 లక్షలు పంపించండి. వాడే ఊరుకుంటాడు అని జ్యో అంటాడు. నువ్వు సీఈఓగా పనికి రావని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు అని శివ నారాయణ అంటాడు. నీ కింద చాలా రకాల మనుషులు పని చేస్తారు. మేనేజర్ మీద అరిచినట్లు రెస్టారెంట్‌లో బాయ్స్, వంట మనిషి, కస్టమర్స్ మీద అరిస్తే వాళ్లు రెండోరోజు రారు. సీఈఓకు ఉండాల్సిన మొదటి లక్షణం నా అనుకునే తత్వం. అది నీలో లేదని శివ నారాయణ అంటాడు.

కేవలం నా మనవరాలిగానే ఉంటావో

నా ఆస్తులకు మనవరాలిగా ఉండాలనుకుంటున్నావో, కేవలం నా మనవరాలిగా మిగిలి పోవాలనుకుంటున్నావో నీ ఇష్టం. గుణపాఠాన్ని నేర్చుకుంటేనే జీవితాన్ని సరిదిద్దుకుంటావ్. నా తీర్పు నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం. దాన్ని నువ్వు వద్దంటే తర్వాత నేను తీసుకునే నిర్ణయాలు నీ మనసుకి తీసుకోడానికి కష్టంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు శివ నారాయణ.

ఇది నీకు హెచ్చరిక లాంటిది. తాత మనసు గెలవడానికైనా నువ్వు వెళ్లాల్సిందే. లేకుంటే సీఈఓ పదవి దీపకి. ఆస్తి కార్తీక్ గాడికి రాసేసాడనుకో. నువ్వు ఎవరో బయటపడిందో మన బతుకు చిప్ప కూడే. అయ్యో నా మాట వెళ్లడానికి సిద్ధపడవే అని జ్యోత్స్నను నెడుతుంది పారిజాతం. జ్యోత్స్న తీవ్ర ఆగ్రహంతో చూస్తుంది. పారు భయపడిపోతుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More