కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: 10 లక్షలు వద్దన్న సూరజ్- జ్యోకు దిమ్మతిరిగే కండీషన్- కార్తీక్ ఐడియా- పెద్ద మేడానికి చుక్కలే

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక దీపం 2 టుడే మే 29 ఎపిసోడ్ లో న్యాయం కావాలని సూరజ్ అడుగుతాడు. జ్యోత్స్నదే తప్పని అంతా తేలుస్తారు. దీంతో సూరజ్ కు రూ.10 లక్షలు ఇవ్వాలని శివ నారాయణ అనుకుంటాడు. కానీ డబ్బులు వద్దన్న సూరజ్ పెద్ద షాకిస్తాడు. జ్యో తిక్క కుదిరేలా చేయాలనుకుంటాడు.

Published on: May 29, 2026, 06:47:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక దీపం 2 సీరియల్ లో నష్ట పరిహారం కావాలంటూ సూరజ్ డైరెక్ట్ గా ఇంటికే రావడంతో జ్యోకు దిమ్మతిరిగే షాక్ తగులుతుంది. వీడియో ప్రూఫ్స్ తో సూరజ్ గట్టి దెబ్బే కొడతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే మే 29 ఎపిసోడ్ లో చూసేయండి.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

న్యాయం కావాలన్న సూరజ్

సోషల్ మీడియాలో సూరజ్ స్టాల్ ధ్వంసం వీడియో కింద కామెంట్లను కార్తీక్ చదువుతాడు. ఇందులో కొన్ని జ్యోత్స్నను తిట్టేవి ఉంటే, మరికొన్ని ఏమో సూరజ్ కల్తీ ఫుడ్ అమ్ముతున్నాడేమోనని ఉంటాయి. నా బిజినెస్ పై, నాపై జనాల్లో నమ్మకం పోయింది. నాకు న్యాయం కావాలి. సాయంత్రం వరకు టైమ్ ఇస్తాను. నాకు నష్టపరిహారం ఇప్పించండని చెప్పి సూరజ్ వెళ్లిపోతాడు.

పారు సలహా

సూరజ్ లాంటి వీధి గూండాలను ఎంకరేజ్ చేస్తే, రోజుకు ఒకరు ఇంటికి వచ్చి గొడవ చేస్తారు. వాడొక వేస్ట్ ఫెలో తాత. వాడి గురించి ఆలోచించడం కూడా వేస్ట్ అని జ్యోత్స్న గదిలోకి వెళ్లిపోతుంది. వెనకాలే పారిజాతం వెళ్తుంది. సూరజ్ మాటల గురించి జ్యో, పారు ఆలోచిస్తుంది. నువ్వు వెంటనే తట్టాబుట్టా సర్దుకుని ప్రపంచ యాత్రకు వెళ్లమని జ్యోకు సలహా ఇస్తుంది పారు.

జ్యోపై ఫైర్

వాడితో నువ్వు గొడవ పడటం అనవసరం. ఎప్పుడూ ఏదో ఒక పెంట. గొడవలు పెట్టుకోవడమే నీ పని. సైకోలా తయారయ్యావ్ అని జ్యోపై ఫైర్ అవుతుంది పారు. సూరజ్ పెద్ద ఈగోయిస్ట్. వాడిది ప్లాట్ ఫామ్ బతుకైనా మాటలు మాత్రం మీర్జాపూర్ జమీందార్ లా ఉంటాయి. అలాంటి నేల టికెట్ వాళ్లకు డబ్బులు ఉన్నవాళ్లంటే ఈర్ష్య. అందుకే గొడవ పెట్టుకున్నాడని జ్యో చెప్తుంది.

సీఈఓ చేయడానికి

అప్పుడే జ్యోను శివ నారాయణ పిలుస్తాడు. అసలు నీకు, ఆ ఫుట్ పాత్ వెండర్ కు గొడవ ఏంటీ? అని జ్యోను దశరథ అడుగుతాడు. తప్పు నీదే అని బావ సాక్ష్యం కూడా చెప్పాడని సుమిత్ర అంటుంది. పిల్లికి ఎలుక సాక్ష్యంలా ఉంది. మీ ఆవిడను సీఈఓను చేయడానికి నాపై నిందలు వేయాల్సిన అవసరం లేదు బావ అని జ్యో అంటుంది. గెలవడానికి అడ్డదారులు తొక్కాల్సిన అవసరం లేదని దీప గట్టిగా చెప్తుంది.

జ్యోదే తప్పంతా

అసలు సూరజ్, జ్యోత్స్న మధ్య ఏం జరిగిందో కార్తీక్ కళ్లకు కట్టినట్లు చూపిస్తాడు. షాప్ లో బొమ్మ దగ్గర మొదలైన గొడవ నుంచి కార్లో తీసుకెళ్లడం వరకు అన్నీ చెప్తాడు కార్తీక్. ఇందులో తన తప్పు లేదని జ్యో వాదిస్తుంది. నీదే తప్పని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకు నీకు అంత ఈగో అని జ్యోపై సుమిత్ర మండిపడుతుంది. సూరజ్ ను పిలిపించమని కార్తీక్ కు చెప్తాడు శివ నారాయణ.

కాళ్ల మీద పడేలా

మరోవైపు జ్యోత్స్నతో దీప మాట్లాడుతుంది. నువ్వు చేసే పనులకు నేను, మా బావ బాధపడుతున్నాం. అయినా పర్వాలేదు. కానీ నా కుటుంబం బాధపడుతుంది. ఇది సరిపెట్టుకునే విషయం కాదు. నువ్వు వెళ్లి సూరజ్ కాళ్లు పట్టుకో అనగానే జ్యో షాక్ అవుతుంది. నువ్వు ఎందులో గొప్ప? జనాలను ఏడిపించడంలోనా, పెంచిన కుటుంబాన్ని బాధ పెట్టడంలోనా? అని దీప సూటిగా అడుగుతుంది.

నువ్వు సూరజ్ కు సారీ చెప్పు. లేదంటే నీ జుట్టు పట్టుకొని కాళ్ల మీద పడేలా చేస్తాడని దీప చెప్తుంది. నా జుట్టు పట్టుకునే మగాడు ఇంకా పుట్టలేదని జ్యో పొగరుగా చెప్తుంది.

షాకిచ్చిన సూరజ్

సూరజ్ వస్తాడు. నష్ట పరిహారం కింద రూ.5 లక్షలు ఇస్తాడు శివ నారాయణ. ఇది సరిపోదని సూరజ్ అంటాడు. న్యాయం చేయలేదన్న చెడ్డపేరు మనకెందుకు, ఆయన అడిగినంత ఇచ్చేయమని సుమిత్ర కూడా చెప్తుంది. ఇంకో రూ.5 లక్షలు ఇస్తామంటారు. కానీ సరిపోదంటాడు సూరజ్. నాకు డబ్బులు అవసరం లేదు సార్. నష్టపోయిన మర్యాదే విలువైంది. నష్ట పరిహారంగా మర్యాదను ఇప్పించండని సూరజ్ అడుగుతాడు.

ఫ్లెక్సీ పెట్టించాలని

నేను గౌరవం, నమ్మకాన్ని కోల్పోయా. నా గౌరవాన్ని, నమ్మకాన్ని, మర్యాదను తిరిగిస్తే చాలు. నేను కోరుకునేది అదేనని సూరజ్ అంటాడు. నాతో సారీ చెప్పించుకోవాలని అనుకుంటున్నాడని జ్యో పొగరుగా చెప్తుంది. సారీ సరిపోదు మేడం అని సూరజ్ షాకిస్తాడు. మరి ఏం చేయమంటావ్? సూరజ్ విషయంలో తప్పు చేశానని జ్యోత్స్న ఫ్లెక్సీ నీ షాప్ ముందు పెట్టమనేలా ఉన్నావ్ అని కార్తీక్ అంటాడు. కార్తీక్ చెప్పింది న్యాయంగా ఉంది. అదే చేయించండని సూరజ్ అడుగుతాడు.

సూరజ్ పై పారు ఫైర్ అవుతుంది. ఫ్లెక్సీ ఎలా పెట్టిస్తామని అంటుంది. ఇంకా నాయం జ్యూస్ లు సర్వ్ చేయమని అడగలేదని అంటుంది. అప్పుడే మీరు చెప్పింది కూడా న్యాయంగా ఉందని సూరన్ అనేసరికి పారు నాలుక కరుచుకుంటుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More