కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దరిద్రపు గొట్టుదానివి- జ్యోత్స్నపై పారు ఫైర్- సైకో జ్యో పగకు బలైపోయిన సూరజ్- స్టాల్ తీయించి

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక దీపం 2 టుడే మే 20 ఎపిసోడ్ లో పుట్టింట్లో కాంచన, దీప సెటిల్ అవుతారు. పారిజాతంపై కార్తీక్ కు డౌట్ వస్తుంది. మరోవైపు సూరజ్ పై జ్యోత్స్న రివేంజ్ తీర్చుకుంటుంది. రోడ్డుపై ఉన్న అతని ఫుడ్ స్టాల్ ను తీయించేస్తుంది. కార్తీక్ చెప్పినా జ్యో వినదు. 

Published on: May 20, 2026, 07:17:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్నకు కార్తీక్ దిమ్మతిరిగే షాకిస్తాడు. కార్తీక్ ప్లాన్ తో కాంచన, దీప కూడా శివ నారాయణ ఇంటికి వచ్చేస్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే మే 20 ఎపిసోడ్ లో చూసేయండి.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

కాంచన కౌంటర్

పిన్నిని బయట ఉన్న బ్యాగ్ తీసుకుని రమ్మని కాంచన అనగానే.. తమ కోసం ఏమైనా తెచ్చిందేమోనని పారిజాతం పరుగెత్తుకుంటూ వెళ్తుంది. బ్యాగ్ తెచ్చాక అందులో బట్టలు ఉన్నాయని కాంచన చెప్తుంది. నా కొడుకు క్యాంప్ కు వెళ్లాడు. వేసవి సెలవులు కాబట్టి శౌర్యను తీసుకుని మా అక్క ఊరు వెళ్లింది. కొడుకు, మనవరాలు లేని ఇంట్లో కోడలితో నేనేం ఉంటా. అందుకే నా కొడుకు వచ్చేవరకూ పుట్టింట్లో ఉందామని నవ్వుతూ కాంచన చెప్తుంది.

చీటింగ్

ఇది చీటింగ్ అని జ్యోత్స్న అంటుంది. కానీ వీళ్లు ఇంట్లో ఉండటానికి శివ నారాయణ, దశరథ, సుమిత్ర ఒప్పుకొంటారు. ఇంట్లో డ్రైవర్ గా చేస్తున్న కార్తీక్ కు సంబంధం లేదన్నట్లుగా కాంచన మాట్లాడుతుంది. మీ ఫ్యామిలీని కూడా ఇక్కడికి తీసుకురావాల్సిందని కార్తీక్ తో కాంచన అంటుంది. రూల్ అంటే రూల్ అని కార్తీక్ చెప్తాడు. కార్తీక్ ఇచ్చిన సలహాతో నా సమస్య తొలగిపోయిందని శివ నారాయణ సంతోషపడతాడు.

దరిద్రపు గొట్టుదానివి

గదిలోకి వెళ్లి పారు, జ్యోత్స్న మాట్లాడుకుంటారు. ప్లాన్ ఇలా రివర్స్ అయిందేంటి గ్రానీ అని జ్యో అడుగుతుంది. నువ్వు దరిద్రపు గొట్టుదానివే. నేను కూడా అని పారు అంటుంది. మేం వేసిన ఫుల్ టాస్ ను వాళ్లు సిక్స్ కొట్టారని జ్యో చెప్తుంది. తప్పు చేసింది నువ్వే, ఇంటికి వెళ్లి మరీ అత్తను రెచ్చగొట్టావని పారు అంటుంది. దీపను ఆఫీస్ నుంచి తరిమేయ్. ఉత్తమ భార్య దీప, ఉత్తమ భర్త కార్తీక్. వాళ్లు కలిస్తే ఉత్తమ విలన్ అయిన నువ్వు డమ్మీనే అని పారు చెప్తుంది. కార్తీక్, దీపను ఆటాడుకుందామని పారు, జ్యో అనుకుంటారు.

అత్త కాళ్లకు దండం

మరోవైపు దక్షిణామూర్తి గురించి దశరథను కాంచన అడుగుతుంది. ఆ మనిషి గురించి మరోసారి మనం తలుచుకోకూడదు. కొన్ని వదిలేస్తేనే జీవితం ప్రశాంతంగా ఉంటుందని దశరథ అంటాడు. ఆఫీస్ కు వెళ్లేందుకు దీప, జ్యో రెడీ అవుతారు. దేవుడికి దండం పెట్టుకోమని దశరథ చెప్తే అత్త కాంచన కాళ్లకు దీప మొక్కుతుంది. ఈ పోటీలో నువ్వు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కాంచన అంటుంది.

సుమిత్ర ఆశీర్వాదం

ఆ వెంటనే సుమిత్ర కాళ్లకు మొక్కుతుంది దీప. దీప తెలివైంది మమ్మీ. నీ కూతురిని ఓడించాలని నీ దగ్గరే ఆశీర్వాదం తీసుకుంటుందని జ్యో అంటుంది. ఇది గెలుపు కోసం కాదు. మనోధైర్యం కోసమని దీప అంటుంది. మరోవైపు పారుపై కార్తీక్ కు డౌట్ వస్తుంది. జ్యో కూడా సుమిత్ర దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది.

సూరజ్ పై రివేంజ్

జ్యో, కార్తీక్ ఒకే కార్లో ఆఫీస్ కు బయల్దేరుతారు. మధ్యలో రోడ్డు పక్కన ఉన్న సూరజ్ ను చూసి జ్యో సడెన్ గా కారు బ్రేక్ వేస్తుంది. సూరజ్ మీద రివేంజ్ తీర్చుకునే టైమ్ వచ్చిందని జ్యో కారు దిగి ఎవరికో కాల్ చేస్తుంది.

వెంటనే ఆఫీసర్లు వచ్చి ఎవరిని అడిగి ఫుట్ పాత్ పై స్టాల్ పెట్టావని సూరజ్ ను ప్రశ్నిస్తారు. తన దగ్గర స్ట్రీట్ వెండర్ కార్డు ఉంది. స్టాల్ ఒకే దగ్గర ఉండదు కదా. పర్మిషన్ ఎలా ఉంటుందని సూరజ్ అడుగుతాడు. ట్రాఫిక్ కు ఇబ్బందిగా ఉందని కంప్లైంట్ వచ్చిందని సూరజ్ స్టాల్ పై ఉన్న ఐటెమ్స్ అన్ని కింద పడేస్తారు.

కార్తీక్ చెప్పినా

అప్పుడే జ్యోత్స్నను తిట్టిన కార్తీక్ స్టాల్ దగ్గరకు వెళ్తాడు. ఇదంతా నీ పనా? మర్యాదగా ఆపుతావా లేదా? అని జ్యోపై సూరజ్ సీరియస్ అవుతాడు. నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే ఆపు అని జ్యో అంటుంది. గిఫ్ట్ షాప్ నుంచి మొదలు జరిగిన విషయాలు అన్నింటిని కార్తీక్ కు సూరజ్ చెప్తాడు. సూరజ్ చాలా మంచోడని కార్తీక్ చెప్పినా జ్యోత్స్న వినదు.

జ్యోత్స్న పొగరు

నేనేం భయపడనని సూరజ్ అంటాడు. ఈ సిటీలో స్టాల్ ఎక్కడా పెట్టలేవు. చిటికేస్తే కూలిపోయే జీవితం వీడిది. ఇలాంటి వాళ్ల ముందు తగ్గి ఉండాల్సిన అవసరం లేదని జ్యో పొగరుగా చెప్తుంది. సూరజ్ చేతిలో రూ.100 నోటు పెట్టి, ఇప్పుడు ఇది నీకు చాలా అవసరమని వెటకారంగా అంటుంది. జ్యోత్స్న, కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. దీంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More