కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: ట్విస్ట్-దీప, జ్యోకు సమాన ఓట్లు-సీఈఓగా ఇద్దరూ-కార్తీక్, దీపను విడగొట్టేలా జ్యో కండీషన్
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక దీపం 2 టుడే మే 18 ఎపిసోడ్ లో సీఈఓ పోస్టు కోసం పెట్టిన ఓటింగ్ లో దీపకు, జ్యోత్స్నకు సమాన ఓట్లు వస్తాయి. కంపెనీకి ఇద్దరూ సీఈఓగా ఉండాలని, సమర్థత నిరూపించుకునేందుకు ఓ టెస్టు పెడతారు. జ్యోత్స్న తన కండీషన్ తో కార్తీక్, దీపను విడగొట్టాలనుకుంటుంది.
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక దీపం 2 సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. సీఈఓ పదవి తనదే అని మురిసిపోయిన జ్యోత్స్నకు కార్తీక్, దశరథ షాక్ ఇస్తారు. ఆ పోస్టు కోసం జ్యోత్స్న, దీప మధ్య ఓటింగ్ నిర్వహించారు. ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే మే 18 ఎపిసోడ్ లో చూసేయండి.

దీప పేరు
వణుకుతున్న చేతులతో చీటీ తీసిన జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ చీటీపై దీప అనే పేరు ఉంటుంది. దీపకు ఇంకొక్క ఓటు వచ్చినా గెలుపు ఎవరిదో అందరికీ అర్థమైపోతుంది, తీయండి మేడం అని కార్తీక్ అంటాడు. ఇది దీప అని వచ్చిందంటే నా పదవి, పరువు రెండూ ఒకేసారి పోతాయని జ్యో అనుకుంటుంది. ఆ చీటీని చూసి జ్యోత్స్న కళ్లు పెద్దవి చేస్తుంది.
సమాన ఓట్లు
కానీ ఆ చీటిలో జ్యోత్స్న అని పేరు ఉండటంతో కార్తీక్, దీప కంగుతింటారు. జ్యో రిలీఫ్ గా ఫీల్ అవుతుంది. ఓట్లు ఇద్దరికీ సమానంగా వచ్చాయి, ఇప్పుడెలా? అని శివ నారాయణ అడుగుతాడు. అయితే కంపెనీకి ఇద్దరు సీఈఓగా ఉంటారని కార్తీక్ అంటాడు. కుదరదని జ్యోత్స్న అంటే, కుదురుతుందని శివ నారాయణ చెప్తాడు. ఇద్దరికీ సమాన ఓట్లు వచ్చాయంటే ఇందరికీ సమర్థత ఉందని అర్థం. కానీ కంపెనీని నడిపించే సమర్థత ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్లే సీఈఓ అవుతారని శివ నారాయణ చెప్తాడు.
సీఈఓ టెస్టు
ఇద్దరికీ పరీక్ష పెడతా. హైదరాబాద్ లో మనకున్న బ్రాంచ్ ల్లో నష్టాల్లో ఉన్నవి రెండున్నాయి. అందులో ఒకటి దీపకు, మరొకటి జ్యోత్స్నకు ఇస్తాం. వీళ్లకు రెండు వారాల టైమ్ ఇస్తాం. రెస్టారెంట్ ను లాభాల్లోకి తీసుకొచ్చేవాళ్లే విజేత. మళ్లీ రెండు వారాల తర్వాత బోర్డు మీటింగ్ జరుగుతుంది. అంతవరకూ వీళ్లిద్దరూ టెంపరరీ సీఈఓలుగా ఉంటారు. డైలీ ఆఫీస్ కు వస్తారని శివ నారాయణ టెస్టు పెడతాడు.
జ్యో కండీషన్లు
ఈ పరీక్షకు జ్యోత్స్న, దీప ఒప్పుకొంటారు. ఈ పోటీ నాకు, దీపకు మాత్రమే. బావ నువ్వు ఇంతకుముందు కంపెనీ సీఈఓ కాబట్టి నీ సలహాలతో దీప ఈజీగా గెలుస్తుంది. అందుకే ఈ రెండు వారాలు నువ్వు ఎలాంటి సలహాలు ఇవ్వకూడదని జ్యోత్స్న అడుగుతుంది. ఇవ్వనని కార్తీక్ చెప్తాడు. నువ్వు, దీప విడిపోవాలని పాయింట్ నంబర్ టూను చెప్తుంది జ్యోత్స్న.
దీపను రెచ్చగొట్టి
ఈ పోటీ జరిగే రెండు వారాలు కార్తీక్, దీప ఒకే ఇంట్లో ఉండకూడదు. బావ మన ఇంట్లో ఉంటాడు. దీప సొంత తెలివితేటలతో గెలవాలి. దీప సొంతంగా గెలవలేదని చెప్పమనండి అప్పుడు బావను ఆమెతోనే ఉండమంటానని జ్యోత్స్న మెలిక పెడుతుంది. నాతో పోటీపడే దమ్ముంటే ఒంటరిగా బరిలో దిగమని చెప్పండి. ఏం దీప ఒప్పుకొంటున్నావా? తప్పుకొంటున్నావా? అని జ్యోత్స్న అడుగుతుంది. నేను ఒప్పుకొంటున్నానని దీప చెప్తుంది.
జ్యోత్స్న ఇది అన్యాయం. వాళ్లిద్దరు భార్యాభర్తలు. పైగా దీప ప్రెగ్నెంట్. భర్త అవసరం ఉంటుందని శ్రీధర్ చెప్తాడు. పర్సనల్ లైఫ్ ను ప్రొఫెషనల్ లైఫ్ తో ముడిపెట్టొద్దని జ్యోత్స్న అంటుంది. కావాలంటే దీప నిర్ణయం వెనక్కి తీసుకోవచ్చని శివ నారాయణ కూడా అంటాడు. ఓడిపోయేవాళ్లే అడుగు వెనక్కి వేస్తారని జ్యోత్స్న రెచ్చగొడుతుంది. నేను నిర్ణయం వెనక్కి తీసుకోనని దీప అంటుంది. అగ్రిమెంట్ రాయించమని జ్యో చెప్తుంది. మీటింగ్ అయిపోతుంది.
నేను పెట్టిన కండీషన్ కు ఒప్పుకొని, దాని తలకొరివి అదే పెట్టుకుంది. ఇప్పుడు దానితో ఎలా ఆడుకుంటానో చూడు అని దీపను ఉద్దేశించి పారుతో జ్యో చెప్తుంది.
కాంచన ఫైర్
సీన్ కాంచన ఇంటికి మారుతుంది. శ్రీధర్ అక్కడికి వెళ్తాడు. జ్యోత్స్నను సీఈఓ చేశారా? చెప్పండని కాంచన అడుగుతుంది. అప్పుడే కార్తీక్, దీపను తీసుకొని జ్యో వస్తుంది. నన్ను కోడలిగానే చూస్తావని జ్యో అనడంతో కాంచన చేతిలో ఉన్న ప్లేట్ నేలకేసి కొట్టి ఫుల్ ఫైర్ అవుతుంది.
సీరియస్ వార్నింగ్
నీ ఇంట్లో నాకు అధికారం లేదు కాబట్టి తలదించుకొని వచ్చా. అదే మాట నా నట్టింట్లో నిలబడి వాగావంటే నాలుకు కోసేస్తానని జ్యోకు కాంచన వార్నింగ్ ఇస్తుంది. నువ్వు బయల్దేరు. నీ పెళ్లిలో కలుద్దామని కాంచన చెప్తుంది. నీ ఆశీర్వాదాలు లేకుండా నా పెళ్లి జరగదులే అత్త అని జ్యో అంటుంది. నేను నీ కొడుకును తీసుకెళ్తున్నానని చెప్పడానికి వచ్చానని కార్తీక్ చేయి పట్టుకుంటుంది జ్యోత్స్న.
నిజం చెప్పి
నా కొడుకు చేయి వదులు. నా కొడుకును ఎక్కడికి తీసుకెళ్తున్నావని కాంచన అడుగుతుంది. రెండు వారాలు బావ మా ఇంట్లోనే ఉంటాడు. ఈ ఇంటికి రాడు. దీప మా ఇంటికి రాడు. ఈ ఇద్దరు ఈ రెండు వారాలు కలవరు అని జ్యో చెప్పేసరికి కాంచన కోప్పడుతుంది. అప్పుడు జరిగిన విషయాన్ని జ్యోత్స్న, శ్రీధర్ చెప్తారు.
కడుపుతో ఉన్నావు కదా నీకు ఎలక్షన్, పోటీ అవసరమా అని దీపను కాంచన అడుగుతుంది. పోటీ గురించి జ్యోత్స్న చెప్తుంది. ఇదంత విని జ్యోను గాడిద అంటూ కాంచన కోప్పడుతుంది. కంపెనీ జ్యోత్స్న చేతుల్లో పెడితే ఉద్యోగులంతా అడుక్కు తినాలని కార్తీక్ అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


