కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: ట్విస్ట్ మీద ట్విస్ట్- జ్యోత్స్న చీటింగ్-మాటిచ్చిన కార్తీక్, దీప-తాళి కడతావా-శ్రీధర్ ప్రశ్న

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక దీపం 2 టుడే మే 15 ఎపిసోడ్ లో జ్యోత్స్న చీట్ చేసిందని దశరథ చెప్తాడు. నెల రోజుల్లో పెళ్లి చేయకపోతే ఏది అడిగినా ఇస్తామని జ్యోకు దీప, కార్తీక్ మాటిస్తారు. మరోవైపు దీపకు, ఆ ఇంటికి సంబంధం ఉందని శ్రీధర్ కు కార్తీక్ చెప్తాడు.

Published on: May 15, 2026, 06:57:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న మైండ్ గేమ్ తో తాను అనుకున్నది సాధిస్తుంది. మళ్లీ జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ కు ఆమెనే సీఈఓగా ప్రకటిస్తారు. దీంతో దీప, కార్తీక్ కు బిగ్ షాక్ తగులుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే మే 15 ఎపిసోడ్ లో చూసేయండి.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

సుమిత్ర ఆనందం కోసం

మనం ఏమనుకున్నామో జ్యోత్స్న అదే చెప్పింది. నాకు అదే అర్థం కావడం లేదు. కొత్త సీఈఓను పెడితే బోర్డు మెంబర్స్ ఒప్పుకోరు. జ్యోత్స్నను సీఈఓను చేయడం వెనుక మరో కారణం కూడా ఉంది. సుమిత్రను ఆనందంగా ఉంచాలని డాక్టర్లు చెప్పారు. కూతురు సీఈఓగా ఉంటే సుమిత్ర ఆనందంగా ఉంటుందని అర్థమైంది. సుమిత్ర కోరుకుంది కూడా. అందుకే నా కోడలు కోసం జ్యోత్స్నను సీఈఓను చేశానని శివ నారాయణ వివరిస్తాడు.

జ్యోత్స్న పెళ్లి

అప్పుడే దశరథ్ వస్తాడు. జ్యోత్స్న చాలా తెలివిగా అందరిని చీట్ చేసింది. నెల్లూరు బ్రాంచ్ లో అసలు ఏ ప్రాబ్లెం లేదని కార్తీక్ తో దశరథ్ అంటాడు. నువ్వు వెళ్లిన తర్వాత అత్తను ఎమోషనల్ గా లాక్ చేసింది. అత్త కోసం తాత మనసు మార్చుకున్నాడు. నేను ఎక్కడ అడ్డుపడతానోనని ఆ సమయంలో నన్ను లేకుండా చేసిందని కార్తీక్ చెప్తాడు. కొత్త సీఈఓను తీసుకురావడమే ఈ సమస్యకు పరిష్కారం. జ్యోత్స్న పెళ్లి అన్నింటికీ సొల్యూషన్ అని కార్తీక్ అంటాడు.

ఛైర్మన్ పోస్టు

మరోవైపు జ్యోత్స్న, పారిజాతం సెలబ్రేట్ చేసుకుంటారు. నాకు కావాల్సింది సీఈఓ పోస్టు కాదు, ఛైర్మన్ పోస్టు అని జ్యో అంటుంది. తాత పోస్టుకే ఎసరు పెట్టావని పారు చెప్తుంది. దీప అవకాశం కోసం ఎదురు చూస్తుంది. నిజం చెప్పినా చెప్పేస్తుంది. నేను సీఈఓగా ఉండటం కోసమే పెళ్లి చేసుకుంటాననే అబద్ధం చెప్పా. ఇదంతా జ్యోత్స్న గేమ్ గ్రానీ. ఈ ఆస్తి నాదే, బావ నా వాడే. బావను ఎలా భర్తను చేసుకోవాలి అనే దాని గురించే ఆలోచిస్తా. అది జరగాలంటే దీప ఉండకూడదు అని జ్యోత్స్న కన్నింగ్ గా చెప్తుంది.

రెచ్చగొట్టిన జ్యో

సీన్ దీప, కార్తీక్, జ్యోత్స్న దగ్గరకు షిఫ్ట్ అవుతుంది. కార్తీక్, దీప ఇంటికి వెళ్లాలనుకుంటారు. ఇంటికి వెళ్లాలని తొందరగా ఉందా అని జ్యో అడుగుతుంది. మాకంటే ఇల్లు, పిల్లలు, సంపారం ఉంది కదా, ఈ తొందర నీకు అర్థం కాదులే అని దీప కౌంటర్ ఇస్తుంది. మీలాంటి ఆదర్శ దంపతులను అర్థం చేసుకోవడం అంత తేలికేం కాదు. మిమ్మల్ని నేనే డ్రాప్ చేస్తా. సవాళ్లు చేయడం తప్ప మీరు ఏం చేయలేరు కదా అని జ్యో అంటుంది.

అధికారికంగా నిన్ను సీఈఓగా ఇంకా అనౌన్స్ చేయలేరు. ఈ రోజు నువ్వు అనుకున్నది రేపు ఎలా జరుగుతుంది? అని కార్తీక్ అడుగుతాడు. నెల రోజుల్లో పెళ్లి చేస్తామని ప్రామిస్ లాంటి వార్నింగ్ ఇచ్చారు. కానీ ఏమైంది? ఓడిపోవడానికి ఒక్క క్షణం చాలు. భయంగా ఉందా? నా కాన్ఫిడెన్స్ చూస్తుంటే వణుకు వస్తుందా? అని జ్యో రెచ్చిపోయి మాట్లాడుతుంది.

ఏది అడిగినా ఇస్తామని

నెల రోజుల్లో నా పెళ్లి చేయకపోతే ఏం చేస్తారు? అని జ్యో రెచ్చగొడుతుంది. నెల రోజుల్లో నీ పెళ్లి చేయకపోతే నువ్వు ఏది అడిగితే అది ఇస్తామని దీప చెప్తుంది. ఒకటే మాట, ఒకటే బాట అని కార్తీక్ కూడా చెప్తాడు. శ్రీధర్ ను పంపించేసి మరీ కార్తీక్, దీపను తానే డ్రాప్ చేస్తానని జ్యోత్స్న అంటుంది.

గుడ్ న్యూస్

సీన్ కాంచన ఇంటికి మారుతుంది. కాంచనతో శ్రీధర్ మాట్లాడుతుండగా కార్తీక్, దీప వస్తారు. జ్యోత్స్నను టెంపరరీ సీఈఓగా చేశారనే గుడ్ న్యూస్ మీ అమ్మకు చెప్తామని వచ్చానని శ్రీధర్ అంటాడు. కార్తీక్ తో మాట్లాడాలని బయటకు తీసుకెళ్తాడు శ్రీధర్. జ్యోత్స్న సీఈఓ అవుతుంది, ఆ తర్వాత పెళ్లి అవుతుంది. తర్వాత నువ్వు, మీ ఆయన కొత్త వ్యాపారం ప్రారంభించొచ్చు అని దీపతో కాంచన చెప్తుంది.

శ్రీధర్ ప్రశ్నలు

మరోవైపు నిజమే చెప్తానని మాటివ్వమని కార్తీక్ ను శ్రీధర్ అడుగుతాడు. జ్యోత్స్నతో నువ్వు, దీప మాట్లాడటం నేను విన్నా. పెళ్లి జరగకపోతే ఏదైనా ఇస్తామని ఎలా అంటారు? నిన్ను తన మెడలో తాళి కట్టమని అడుగుతుంది, కడతావా? జ్యోత్స్న మెడలో తాళి కడతావా? ఈ అగ్రిమెంట్ లు, ఛాలెంజ్ లు ఎందుకు? దీప ఎవరు అనే ప్రశ్నకు ఇప్పటివరకూ నాకు జవాబు దొరకలేదు. అసలు దీపకు, ఆ కుటుంబానికి ఏంటి సంబంధం? అని శ్రీధర్ అడుగుతాడు.

దీపకు, ఆ ఇంటికి సంబంధం ఉందని కార్తీక్ చెప్పడంతో శ్రీధర్ షాక్ అవుతాడు. ఏదో ఒక రోజు నీకు సమాధానాలు దొరుకుతాయి. ఇవన్నీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకోమ్మని చెప్పి శ్రీధర్ ను పంపించేస్తాడు.

కార్తీక్ ప్లాన్

మార్నింగ్ కంపెనీ ఆఫీస్ లో మీటింగ్ జరుగుతుంది. దశరథ మాట్లాడాలని అనుకుంటే, జ్యో కౌంటర్లు వేస్తుంది. మన ఫ్యామిలీలో నుంచి ఒకరు సీఈఓ అవ్వాలని బోర్డు మెంబర్స్ కోరుకుంటున్నారు. ఆ ఒక్కరూ జ్యోత్స్ననే ఎందుకవాలి? అని దశరథ అడుగుతాడు. కార్తీక్ ను సీఈఓ చేయాలని, జ్యోత్స్ననే సీఈఓ చేయాలని బోర్డు మెంబర్స్ గొడవ పడతారు. సీఈఓగా ఉండేందుకు కార్తీక్ ఒప్పుకోడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More