Karthika Deepam 2 Today Episode: జ్యోత్స్న మైండ్ గేమ్.. మళ్లీ కంపెనీకి సీఈఓగా జ్యో.. కార్తీక్, దీపకు దిమ్మతిరిగే షాక్
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే మే 14 ఎపిసోడ్ లో జ్యోత్స్న తన మైండ్ గేమ్ తో అనుకున్నది సాధిస్తుంది. సీఈఓ పోస్టును తిరిగి దక్కించుకుని కార్తీక్ కు ఊహించని షాక్ ఇస్తుంది.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో దీపే అసలైన వారసురాలని పారిజాతానికి తెలుస్తుంది. పారు, జ్యోత్స్న కలిసి దీపపై పగ సాధించాలని అనుకుంటారు. అన్నీతెలిసినా ఏం తెలియనట్లు కార్తీక్, దీప దగ్గర పారు నటిస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే మే 14 ఎపిసోడ్ లో చూసేయండి.

కాంచన సీరియస్
దక్షిణామూర్తి గురించి కార్తీక్ అడిగితే కాంచన ఫుల్ ఫైర్ అవుతుంది. ఆ మనిషి గురించి తెలుసుకోవద్దని చెప్తుంది. అలాగే కంపెనీ వ్యవహారాలకు దూరంగా ఉండమని కార్తీక్, దీపకు కాంచన చెప్తుంది. తాత పేరు ఎత్తగానే అందరూ సీరియస్ అవుతున్నారు ఎందుకు బావ అని కార్తీక్ ను దీప అడుగుతుంది. తాత ఉన్నాడని తెలిశాక వివరాలు తెలుసుకోకుండా ఎలా అని అడుగుతుంది. దాని గురించి వదిలేద్దామని కార్తీక్ చెప్తాడు.
జ్యోత్స్న మైండ్ గేమ్
మరోవైపు దక్షిణామూర్తి గురించి సుమిత్ర ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న మైండ్ గేమ్ స్టార్ట్ చేస్తుంది. తల్లిని కూల్ చేయడానికి టిఫిన్ ప్లేట్ తో జ్యో వస్తుంది. చెప్పకుండానే కూతురి మనసు తల్లికి ఎలా తెలుస్తుందో, తల్లి అవసరాలు కూతురికి తెలుస్తాయి మమ్మీ. నిన్న ఏం జరిగిందని అడగను మమ్మీ. తిను అని సుమిత్రకు టిఫిన్ తినిపిస్తుంది జ్యోత్స్న.
డ్రామా స్టార్ట్
కంపెనీకి సీఈఓ రిక్వైర్మెంట్ ఉంది. బయటివాళ్లు ఉండకూడదని బోర్డు మెంబర్స్ అంటున్నారు. ఫ్యామిలీ నుంచి ఎవరు అవుతారో నాకు తెలియడం లేదని జ్యో అంటుంది. అది నీకెందుకు తెలియాలని అప్పుడే వచ్చిన శివ నారాయణ అంటాడు. నా మనసులో మాట చెప్పుకొనే హక్కు కూడా లేదా తాత అని జ్యో డ్రామా స్టార్ట్ చేస్తుంది.
టెంపరరీ సీఈఓగా
వన్ మంత్ లో నాకు పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నారు. అలాగే సీఈఓ గురించి కూడా. ఆ ఇద్దరు ఒక్కరే ఎందుకు కాకూడదని జ్యోత్స్న అంటుంది. మరి ఇప్పుడు ఎవరినిచ్చి పెళ్లి చేస్తారని పారు అంటుంది. టెంపరరీగా నేను సీఈఓగా ఉండకూడదా మమ్మీ అని జ్యో తెలివిగా మాట్లాడుతుంది. మా ఆలోచన కూడా అదే. ఈ ఇంటి అల్లుడే కంపెనీ సీఈఓగా ఉండాలని సుమిత్ర చెప్తుంది.
సుమిత్ర కోరిక
దశరథ ఊర్లో లేడు కదా అని శివ నారాయణ అంటే, ఆయనతో నేను మాట్లాడతానని సుమిత్ర చెప్తుంది. అప్పుడే జ్యోత్స్న డ్రామాను మరో లెవల్ కు తీసుకెళ్తుంది. సీఈఓగా ఉండటానికి లేదా కమిటీలో ఉండే అర్హత నాకు లేదని జ్యో అంటుంది. ఎందుకు ఉండదు? నీ ఆలోచన మంచిది అయినప్పుడు మేం సహాయం చేయకుండా ఉంటామా? మామయ్య ఇది మీ కోడలి కోరిక. అది అనుకున్నది జరగాలని సుమిత్ర చెప్పడంతో శివ నారాయణ ఆలోచనలో పడతాడు.
పెళ్లి చేసుకో బావ
కార్తీక్, జ్యోత్స్న కార్లో వెళ్తారు. తలరాత మార్చే అవకాశం ఉంది బావ, నన్ను పెళ్లి చేసుకో అని జ్యో మళ్లీ స్టార్ట్ చేస్తుంది. కార్తీక్ కు చిర్రెత్తుకొస్తుంది. నా మెడలో తాళి కడితే నువ్వే సీఈఓ అవుతావు బావ. నెల రోజుల్లో మనం పెళ్లి చేసుకుందామని జ్యో చెప్తుంది. ఇప్పుడే తాళి కట్టమంటావా అని కార్తీక్ వెటకారంగా అంటాడు. మంచి కుర్రాడిని చూసి గ్రాండ్ గా పెళ్లి చేస్తానని కార్తీక్ చెప్తాడు.
నా మెడలో నువ్వు తాళి కడుతుంటే, దీప నా జడ ఎత్తి పట్టుకుంటుంటే అని జ్యోత్స్న పగటి కలలు కంటుంది. జ్యో రోగం, బలుపు, పొగరు అన్నీ తగ్గిస్తానని కార్తీక్ స్వీట్ వార్నింగ్ ఇస్తాడు.
కార్తీక్ బయటకు
సీన్ ఆఫీస్ కు మారుతుంది. నేను అనుకున్నది జరగాలంటే బావను బయటకు పంపించాలని కార్లో ఫోన్ తెమ్మని కార్తీక్ కు జ్యో అబద్ధం చెప్తుంది. కార్తీక్ వెళ్లగానే జ్యో ప్లాన్ ప్రకారం బోర్డు మెంబర్స్ సీఈఓ టాపిక్ తీస్తారు. జ్యోత్స్న రెస్టారెంట్స్ కు కొత్త సీఈఓ రావాల్సిన అవసరం ఉంది. వచ్చేవాళ్లను ఇంటర్వ్యూ చేసి, ఓకే అనుకున్న తర్వాతే సీఈఓ చేద్దాం. కానీ ప్రస్తుతం కంపెనీ పరిస్థితి ఏంటి? ఆ బాధ్యతలు ఎవరికో ఒకరికి అప్పగించాలి కదా అని శివ నారాయణ అంటాడు.
జ్యోత్స్న సీఈవో
అంతవరకు సీఈఓ బాధ్యతలు నా మనవరాలు జ్యోత్స్నకు అప్పగిస్తున్నానని శివ నారాయణ అంటాడు. అప్పుడే వచ్చిన కార్తీక్ షాక్ అవుతాడు. ఫార్మాలిటీస్ కంప్లీట్ చేద్దామని శివ నారాయణ అంటాడు. జ్యోత్స్న ఫైనల్ చేసిన మనిషే నెక్ట్స్ సీఈఓ అని శివ నారాయణ మరో షాక్ ఇస్తాడు.
చాలా హ్యాపీగా ఉన్నా బావ. అనుకున్నది సాధించినప్పుడు వచ్చే కిక్కే వేరు అని జ్యో గంతులేస్తుంది. అప్పుడే దీపకు జ్యో కాల్ చేస్తుంది. సుమిత్రకు ఫోన్ ఇవ్వమని చెప్తుంది. స్పీకర్ ఆన్ చేయమంటుంది. జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓగా నాకు బాధ్యతలు అప్పగించారని జ్యో అరుస్తుంది. సుమిత్ర మురిసిపోతుంది.
రెండు కారణాలు
నా మనవరాలిని శాశ్వతమైన వారసురాలిని చేస్తానని పారు అనుకుంటుంది. మరోవైపు శివ నారాయణతో కార్తీక్, శ్రీధర్ మాట్లాడతారు. మనం అనుకున్నది ఇది కాదు కదా తాత అని కార్తీక్ అడుగుతాడు. ఈ నిర్ణయం వెనుక రెండు కారణాలున్నాయని శివ నారాయణ చెప్తాడు. బయట వాళ్లను సీఈఓగా చేస్తే బోర్డు మెంబర్స్ బయటకు వెళ్తామన్నారని శివ నారాయణ అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


