కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్:పదవి కోసం మొగుణ్ని ప్రియురాలికి తాకట్టు పెట్టావ్-దీపపై కాంచన ఫైర్-జ్యో మైండ్ బ్లాక్ ట్విస్ట్
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక దీపం 2 సీరియల్ టుడే మే 19 ఎపిసోడ్ లో కార్తీక్ ను కాంచన ఇంటి నుంచి జ్యోత్స్న తీసుకొస్తుంది. ఈ విషయాన్ని తలుచుకుని కాంచన బాధపడుతుంది. దశరథ ఫోన్ చేస్తే కాంచన సీరియస్ గా మాట్లాడుతుంది. అందుకే జ్యోత్స్న మైండ్ బ్లాక్ అయ్యే ప్లాన్ వేస్తాడు కార్తీక్.
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక దీపం 2 సీరియల్ లో దీప, జ్యోత్స్న ఇద్దరినీ సీఈఓగా నియమించడంతో కథ మలుపు తిరుగుతుంది. వీళ్లలో ఒకరినే సీఈఓగా కంటిన్యూ చేసేలా శివ నారాయణ టెస్టు పెడతాడు. మరోవైపు దీప, కార్తీక్ ను విడగొట్టాలని జ్యో షాకింగ్ కండీషన్ పెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే మే 19 ఎపిసోడ్ లో చూసేయండి.

కార్తీక్ ఫైర్
దశరథకు కాల్ చేస్తానంటే కాంచన చేతుల్లో నుంచి కార్తీక్ ఫోన్ లాక్కుంటాడు. షరతులకు ఒప్పుకోవాల్సి వచ్చింది. కంపెనీ ఈవిడ చేతుల్లో పెడితే ఉద్యోగులు అడుక్కు తినాల్సిందే. గతంలో జరగింది మర్చిపోయావా? నంబర్ వన్ గా ఉన్న కంపెనీని నాశనం చేశావంటూ జ్యోత్స్నపై కార్తీక్ ఫైర్ అవుతాడు.
కార్తీక్ చేయి పట్టుకుని
మాటలతో డామినేట్ చేయడం తప్పా నువ్వు ఏం చేయలేవు బావ అని జ్యోత్స్న పొగరుగా అంటుంది. కొన్ని ఆశించినప్పుడు కొన్ని భరించాలి అమ్మ అని కాంచనకు కార్తీక్ నచ్చచెప్తాడు. ఈ రెండు వారాలను ఆషాడం అనుకుంటానని కార్తీక్ చెప్తాడు. దీపను బ్యాగ్ సర్దమంటాడు. ఆ బ్యాగ్ ను జ్యోత్స్ననే మోస్తుంది. దీపకు కార్తీక్ జాగ్రత్తలు చెప్తాడు. ఊరెళ్లానని శౌర్యకు చెప్పమంటాడు. అందరికీ బై చెప్పి కార్తీక్ చేతిని పట్టుకుని జ్యో తీసుకెళ్తుంది.
సుమిత్ర కోపం
శివ నారాయణ ఇంటికి కార్తీక్, జ్యోత్స్న చేరుకుంటారు. పారు కావాలనే జ్యోత్స్నపై కోప్పడినట్లు నటిస్తుంది. ఇంట్లోకి వెళ్లగానే జ్యోపై సుమిత్ర సీరియస్ అవుతుంది. జరిగిన దాంట్లో నా తప్పు ఉందనిపిస్తే దీపను పోటీలో నుంచి తప్పుకోమనండి. నేను సారీ చెప్తానని జ్యో తెలివిగా మాట్లాడుతుంది. నన్ను సీఈఓను చేస్తానన్నారు. సడెన్ గా దీపను తీసుకొచ్చి ఓటింగ్ పెట్టారు. ఓట్లు సమానంగా వచ్చాయి. అంతా ఫెయిర్ గానే జరిగింది కదా అని జ్యో చెప్పుకొస్తుంది.
పారు మొసలి కన్నీరు
దీపను బావ ఈజీగా గెలిపిస్తాడు. అందుకే తీసుకొచ్చాను. దీప కూడా ఒప్పుకొందని. అత్తకు చెప్పి మరీ బావను తీసుకొచ్చానని జ్యో క్లారిటీ ఇస్తుంది. పాపం దీప అక్కడ ఎంతలా బాధపడుతుందోనని పారిజాతం మొసలి కన్నీరు కారుస్తుంది. కార్తీక్ గెస్ట్ రూమ్ లోకి వెళ్తాడు. వెనకాలే దశరథ, శివ నారాయణ వెళ్తారు. మరోవైపు శ్రీధర్ కు గుండె నొప్పి, కార్తీక్ ను జ్యోత్స్న తీసుకెళ్లడం గురించి ఆలోచిస్తూ కాంచన బాధపడుతుంది.
ప్రియురాలికి తాకట్టు
కార్తీక్ తో దశరథ, శివ నారాయణ మాట్లాడతారు. నా చెల్లికి సంజాయిషీ ఇచ్చుకోవాలి. లేదంటే ముఖం చూపించుకోలేనని దశరథ ఫీల్ అవుతాడు. కడుపుతో ఉన్న మనిషికి భర్తను దూరం చేయడం పాపం కదా అని శివ నారాయణ కూడా బాధపడతాడు. మరోవైపు మొగుణ్ని పంపించేశావు కదా అని దీపపై కాంచన అరుస్తుంది. పదవి కోసం మొగుణ్ని ప్రియురాలికి తాకట్టు పెట్టిన భార్యను నిన్నే చూశానని నానా మాటలు అంటుంది.
కాంచన ఎమోషనల్
అప్పుడే దీప ఫోన్ మోగుతుంది. దశరథ్ కాల్ చేసి క్షమించమని అడుగుతాడు. చేసిందంతా చేసి ఇప్పుడు క్షమాపణలు అడుగుతున్నాడా? ఏ అన్నయ్యా.. మా జీవితాలకు ఏంటి ఇంత మర్యాద చేశావ్? పనివాళ్లు కదా వీళ్ల జీవితాలతో నీ కూతురు ఎంతలా ఆడుకున్నా పర్వాలేదనుకున్నావ్ కదా. నీ కూతురు అన్యాయంగా ప్రవర్తిస్తుంటే కళ్లు మూసుకుపోయాయా? కడుపుతో ఉన్న నా కోడలి ఉసురు నీ కూతురికి తగులుందని తెలియదా? అని కాంచన ఎమోషనల్ అవుతుంది.
న్యాయం కూతురు పిల్లలకు లేదా? నాన్నకు ఫోన్ ఇవ్వమని కాంచన అడుగుతుంది. దాని కోపాన్ని నేను తట్టుకోలేనని శివ నారాయణ అంటాడు. అమ్మ ఊపిరి వదిలేసి చచ్చిపోయింది, నేను ఊపిరి ఉండగానే చస్తున్నానని మీ నాన్నకు చెప్పు అని కాంచన కఠినంగా మాట్లాడి కాల్ కట్ చేసి ఏడుస్తుంది.
కార్తీక్ ప్లాన్
దీప గురించి చెప్పి కన్విన్స్ చేశారు. నింద నేను, కన్నీళ్లను నా కూతురు మోస్తుంది. రేపు ఉదయం నవ్వుతున్న నా కూతురిని చూడాలి. లేదంటే నేను ఎవరితో మాట్లాడనని కార్తీక్, దశరథకు చెప్పి శివ నారాయణ లోపలికి వెళ్లిపోతాడు. ఎవరు బాధపడకుండా ఉండాలంటే ఏం చేయాలో అదే చేద్దామని దశరథతో అంటాడు కార్తీక్.
జ్యో షాక్
ఉదయం జ్యోత్స్న ఆఫీస్ కు రెడీ అయి రావడం చూసి పారు మురిసిపోతుంది. అప్పుడే కాంచన, జ్యోత్స్న నవ్వుతూ ఎంట్రీ ఇవ్వడం చూసి పారు, జ్యో షాక్ అవుతారు. రెండు వారాలు దూరంగా ఉండాలని కండీషన్ పెట్టాం కదా, దీప ఎందుకు వచ్చిందని జ్యో అడుగుతుంది. నేను తీసుకొచ్చానని కాంచన అంటుంది. నువ్వు ఎందుకు వచ్చావ్ అత్త అని జ్యో అడుగుతుంది.
నా కూతురునే ఎందుకు వచ్చావని అడుగుతావా? అని శివ నారాయణ సీరియస్ అవుతాడు. ఇది నా పుట్టిల్లు. దీప నా కోడలు. నా కొడుకు ఆఫీస్ పని మీద క్యాంప్ నకు వెళ్లాడని కాంచన చెప్పేసరికి పారు, జ్యో కన్ఫ్యూజ్ అవుతారు. కొడుకు, మనవరాలు లేని ఇంట్లో కోడలిని పెట్టుకుని నేనేందుకు ఉంటా? అందుకే నా కొడుకు నా ఇంటికి వచ్చేంతవరకు పుట్టింట్లో ఉందామని వచ్చానని కాంచన చెప్పడంతో జ్యో మైండ్ బ్లాక్ అవుతుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


