కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: బాంబ్ పేల్చిన జ్యోత్స్న-ఉగ్రరూపంతో ఊగిపోయిన శివ నారాయణ-కార్తీక్ కు చెంప దెబ్బ- దిగజారిన తాత
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక దీపం 2 టుడే మే 27 ఎపిసోడ్ లో అదిరిపోయే ట్విస్ట్ నెలకొంటుంది. శివ నారాయణ బ్లడ్ ఇచ్చింది దక్షిణామూర్తికే అని జ్యో బాంబ్ పేలుస్తుంది. ఉగ్రరూపంతో ఊగిపోయిన శివ నారాయణ తన మనవడు కార్తీక్ ను కొడతాడు. ఇంట్లో నుంచి వెలేశానని అంటాడు. ధర్మాన్ని పాటించానని కార్తీక్ చెప్తాడు.
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక దీపం 2 సీరియల్ లో తన బద్ధ శత్రువైన దక్షిణామూర్తికి శివ నారాయణ తనకు తెలియకుండానే బ్లడ్ ఇస్తాడు. ఈ విషయం జ్యోత్స్న చెవిలో పడుతుంది. భలే ఛాన్స్ దొరికిందని జ్యో అనుకుంటుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే మే 27 ఎపిసోడ్ లో చూసేయండి.

జ్యోత్స్న ఓవరాక్షన్
కార్తీక, దీప హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తారు. నాకేదో భయంగా ఉందని దీప అంటుంది. దక్షిణామూర్తి తాతకు మా తాత బ్లడ్ ఇచ్చినట్లు నీకు, నాకు, మా నాన్నకు, దక్షిణామూర్తికి తప్పా ఇంకా ఎవరికి తెలియదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని కార్తీక్ చెప్తాడు. కానీ లోపలికి వెళ్లేసరికి హాల్లో అందరినీ కూర్చోబెడుతుంది జ్యోత్స్న. మిమ్మల్ని చప్పట్లతో ఆహ్వానిస్తున్నానని జ్యో ఓవరాక్షన్ చేస్తుంది.
చప్పట్లతో అభినందనలు
ఈ రోజు వీళ్లు ఓ ప్రాణాన్ని కాపాడారు. అందరూ మెచ్చుకోవాల్సిందేనని జ్యో అనగానే అందరూ చప్పట్లు కొడతారు. దారిన పోయే వాళ్లకు ప్రమాదం అయితే హాస్పిటల్లో జాయిన్ చేసి, రక్తదానం చేయించి మరీ కాపాడారని జ్యో అంటుంది. తాతకే థ్యాంక్స్ చెప్పాలి. తాత బ్లడ్ ఇవ్వకపోయి ఉంటే యాక్సిడెంట్ అయిన మనిషి బతికేవాడు కాదని కార్తీక్ చెప్తాడు.
జ్యో కంత్రీ ప్లాన్
రక్తదానం చేయడం మంచిదని శివ నారాయణ అంటాడు. మరి ఎవరికి రక్త దానం చేశావో చూడాల్సిందని జ్యోత్స్న అనగానే కార్తీక్, దీప షాక్ అవుతారు. మమ్మీ నువ్వు తాతకు ఎప్పటికీ రుణపడి ఉండాలి. కన్నతండ్రి ప్రాణాలు కాపాడిన మనిషి రుణం ఎప్పటికీ తీర్చుకోలేం కదా అని జ్యో బాంబ్ పేలుస్తుంది. మనం దక్షిణామూర్తి తాత ఇంటికి వెళ్దాం పదా అని జ్యో అనగానే, శివ నారాయణ ఆవేశంతో ఊగిపోతాడు. సుమిత్ర కూడా ఫైర్ అవుతుంది.
నిజం చెప్పి
దక్షిణామూర్తి గురించి మాట్లాడి కావాలనే జ్యోత్స్న రెచ్చగొడుతోంది. శత్రువుకు సాయం చేయాల్సిన పరిస్థితి వస్తే ఎలా? అని జ్యో అడుగుతుంది. ఆ పరిస్థితి వస్తే ఈ శివ నారాయణ చస్తే మేలు అని అనుకుంటానని శివ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. నీకు తెలియకుడా ఎవరైనా అలా చేయిస్తే అని జ్యో అడిగితే, చెప్పుతో కొడతానని శివ నారాయణ అంటాడు. అయితే కొట్టు నీ మనవడిని అని జ్యోత్స్న డ్రామాను పీక్స్ కు తీసుకెళ్తుంది.
కార్తీక్ కు చెంపదెబ్బ
తాత హాస్పిటల్లో బ్లడ్ ఇచ్చింది దక్షిణామూర్తికే అనే అసలు విషయాన్ని జ్యో చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. ఉగ్రరూపంతో ఊగిపోతూ కార్తీక్ దగ్గరకు వెళ్తాడు శివ నారాయణ. జ్యోత్స్న చెప్పింది నిజమేనా అని అడుగుతాడు. నిజమే తాత అని కార్తీక్ చెప్తాడు. వెంటనే కార్తీక్ ను లాగిపెట్టి కొడతాడు శివ నారాయణ. వాడు నా శత్రువు అని తెలుసు. అలాంటి వాడి ప్రాణాలు నేనే కాపాడేలా చేశావు. జీవితంలో క్షమించలేని తప్పు చేశావని శివ నారాయణ మండిపడతాడు.
తప్పుల మీద తప్పులు చేశావ్. నా కంటే వాడే నీకు ఎక్కువైనప్పుడు పోరా అని కార్తీక్ ను గెంటేస్తాడు శివ నారాయణ. ఈ రోజుతోనే నేను చచ్చిపోయానని అనుకో అని శివ నారాయణ తెగ ఫీల్ అయిపోతాడు. కాంచనకు నిజం తెలుసని జ్యోత్స్న ఇరికిస్తుంది. శ్రీధర్ ను కూడా లాగుతుంది పారిజాతం. ఇక ఆపుతావా అని జ్యోపై కార్తీక్ ఫైర్ అవుతాడు.
నువ్వు చెప్పిన ధర్మమే
పదేళ్ల వయసులో నువ్వు చెప్పిన ధర్మాన్నే నేను పాటిస్తున్నా. ప్రాణం ఎవరిదైనా సరే కాపాడాలని చెప్పావ్. అత్త ప్రాణాలను కాపాడిన దీపను ఇంటికి తీసుకొచ్చారు. నేను జీవితం ఇచ్చా. ఏం పారు ఆ రోజు నీ మనవడిని దీప కాపాడింది కదా. ఇలాంటి ధర్మమే కదా తాత నువ్వు నేర్పించిందని కార్తీక్ ఎమోషనల్ అవుతాడు.
మనిషి విలువ తెలుసు
ఒక టైమ్ లో నీ కూతురిని వెలేశావ్. ఆమె ఆరోగ్యం బాలేదని తెలిసి నువ్వు భోజనం కూడా చేయలేదు. నీలోని మానవత్వాన్ని నువ్వు చంపుకోలేదు తాత. నీ శత్రువు కిరాతకుడు అయి ఉండొచ్చు. కానీ నువ్వు కాదు. నీకు మనిషి విలువ తెలుసు. ఒక నూరేళ్ల జీవితం రాలిపోతుంటే వదిలేసి వెళ్లిపోగలవా? కొన ఊపిరితో ఉన్నవాడు శత్రువైనా సరే ప్రాణం పోయాలన్న నువ్వు నేర్పిన ధర్మాన్నే అనుసరిస్తున్నానని శివ నారాయణతో కార్తీక్ అంటాడు.
సుమిత్రను కూడా
ఒకసారి నీలోని మానవత్వాన్ని గుర్తు చేసుకో తాత. నువ్వు ఎన్ని మెట్లు దిగజారి నన్ను కొట్టావో ఆలోచించు. నా స్థానంలో నువ్వు ఉంటే కాపాడతావా? లేదా చస్తే చావని అని వదిలేస్తావా? అని తాతను సూటిగా అడుగుతాడు కార్తీక్. నీ కళ్ల ముందు ప్రాణం పోతుంటే వాళ్లలో మనిషిని చూస్తావా? శత్రువును చూస్తావా? నీకు జన్మనిచ్చిన తండ్రి చావు బతుకుల్లో ఉన్నాడని సుమిత్రను కూడా కార్తీక్ అడుగుతాడు.
ప్రాణం తీసేవాడికంటే ప్రాణం పోసేవాడే గొప్పోడు. నువ్వు దక్షిణామూర్తి కంటే గొప్పోడివి తాత అని కార్తీక్ అంటాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


