కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: తాతను మార్చిన కార్తీక్- జ్యో గుట్టురట్టు- డైరెక్ట్‌గా ఇంటికే వ‌చ్చిన సూర‌జ్‌- వీడియోతో షాక్

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక దీపం 2 టుడే మే 28 ఎపిసోడ్ లో కార్తీక్ మాటలకు శివ నారాయణ కరిగిపోతాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోకుండా మనవడిని ఆపుతాడు. దీంతో జ్యోకు షాక్ తగులుతుంది. మరోవైపు స్వప్నకు కాశీ సేవలు చేస్తాడు. ఇక సూరజ్ ఎంట్రీతో జ్యోకు మైండ్ బ్లాక్ అవుతుంది.

Published on: May 28, 2026, 07:22:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక దీపం 2 టుడే మే 28 ఎపిసోడ్ లో.. దక్షిణామూర్తిని కాపాడిన విషయంలో శివ నారాయణతో కార్తీక్ ఎమోషనల్ గా మాట్లాడతాడు. ఈ రోజు ఒక ప్రాణాన్ని కాపాడి తప్పు చేశావ్రా అని చెప్పు తాత, నా వ్యక్తిత్వాన్ని నీ ముందే ఉరి తీసి ఇక్కడి నుంచి వెళ్లిపోతాను. నువ్వు మౌనంగా ఉన్నావంటే తప్పు చేశానని నమ్ముతున్నావని కార్తీక్ అంటాడు.

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

కరిగిపోయిన శివ నారాయణ

తప్పు చేసిన వ్యక్తికి నీ ముందు నిలబడే అర్హత లేదు. వెళ్లిపోతున్నానని కార్తీక్ రెండు అడుగులు వేస్తాడు. వెంటనే కార్తీక్ చేయిని శివ నారాయణ పట్టుకుని ఆపుతాడు. దీంతో జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. ఇప్పుడు నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతే ఇన్నాళ్ల శివ నారాయణ ఆదర్శానికి పాడె కట్టినట్లే. నా ఆవేశం, కోపం నాలోని మంచితనాన్ని చంపేశాయని శివ నారాయణ ఎమోషనల్ అవుతాడు.

దీపకు జాగ్రత్తలు

నువ్వు మనవడిగా నా ధర్మాన్ని కాపాడావు. నువ్వు ఈ తాతను కూడా సరిదిద్దావ్. కాంచన.. నీ పెంపకాన్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందని శివ నారాయణ కన్నీళ్లు పెట్టుకుంటూ లోపలికి వెళ్లిపోతాడు. శ్రీధర్ వచ్చి దీపకు జాగ్రత్తలు చెప్తాడు. మన చుట్టూ కీడు కోరుకునే వాళ్లే ఎక్కువ ఉన్నారు. ఎన్ని చెప్పినా వాళ్లకు బుద్ధి రావడం లేదని ఇండైరెక్ట్ గా జ్యోత్స్న గురించి శ్రీధర్ అంటాడు.

భార్యకు కాశీ సేవలు

సీన్ శ్రీధర్ ఇంటికి మారుతుంది. కాశీ బయట నుంచి వస్తాడు. స్వప్నకు జ్వరం వచ్చిందని కాశీకి కావేరి చెప్తుంది. వేడి నీళ్లు తీసుకుని స్వప్న దగ్గరకు కాశీ వెళ్తాడు. స్వప్నను నిద్ర లేపి కాళ్లకు కాపడం పెడతాడు. స్వప్న వద్దన్నా వినడు. అమ్మాయిలకు తల్లితో బంధం కంటే భర్తతో బంధమే ఎక్కువ. పెళ్లయిన తర్వాత జీవితాంతం భర్తతోనే ఉండాలని కాళ్లకు కాపడం పెడతాడు కాశీ.

మా అమ్మ ప్రేమే నీ రూపంలో నా దగ్గరకు వచ్చింది. నీతో బతకడానికి ఈ జన్మ సరిపోతుందేమో దిల్లు. కానీ నిన్ను ప్రేమించడానికి ఈ జన్మ సరిపోదని కాశీ ప్రేమగా చెప్తాడు. కాశీ మాటలకు స్వప్న కన్నీళ్లు పెట్టుకుంటుంది.

సూరజ్ ఎంట్రీ

మరోవైపు తమ ప్లాన్ బెడిసి కొట్టినందుకు జ్యోత్స్న, పారు చిరాకు పడతారు. వాడు మాయలోడు మాటలతో మీ తాతను మార్చేశాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ గొడవకు నువ్వే కారణం కదా అని జ్యోకు పారు చెప్తుంది. నా వైపు వేలెత్తి చూపేందుకు ఒక్క కారణం కూడా దొరకదని జ్యో అంటుంది. ఏ సమస్య ఇంట్లో అడుగుపెడుతుందోనని భయంగా ఉందని పారు చెప్తుంది. అప్పుడే సూరజ్ ఇంట్లోకి వస్తాడు.

జ్యో మైండ్ బ్లాక్

సూరజ్ ను చూసి ఈ సర్ ప్రైజ్ ఏంటీ? అని కార్తీక్ అడుగుతాడు. ఫుడ్ స్టాల్ నష్ట పరిహారం కోసం ఈ ఇంటికి వచ్చానని సూరజ్ చెప్తాడు. తాతను కార్తీక్ పిలుస్తాడు. శివ నారాయణతో సహా అందరూ వస్తారు. అప్పుడే జ్యోత్స్నను వెటకారంగా పిలుస్తాడు కార్తీక్. సూరజ్ ను చూసిన జ్యోకు మైండ్ బ్లాక్ అవుతుంది. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చా. మీ మనవరాలు జ్యోత్స్న వల్ల నాకు నష్టం జరిగింది. నష్ట పరిహారం కోసం వచ్చానని జరిగిన విషయాన్ని సూరజ్ అందరికీ చెప్తాడు.

నిజం చెప్పిన సూరజ్

ఎవర్రా నాశనం చేసింది? ఇలాంటి వాళ్లను ఇంటికి కూడా రానివ్వొద్దు తాత. వీడెంతా, వీడి బతుకెంతా? ఎస్సైకు కాల్ చేయండి. నాలుగు లాఠీ దెబ్బలు పడితే కానీ వీడికి బుద్ధి రాదని జ్యోత్స్న తెగ ఫైర్ అవుతుంది. నా పేరు సూరజ్. మార్కెట్లో సూరజ్ హెల్తీ ఫుడ్స్ పేరుతో స్టాల్ రన్ చేస్తున్నా. నా స్టాల్ పై మున్సిపాలిటీ ఆఫీసర్స్ రైడ్ చేశారు. నా దగ్గర అన్ని పర్మిషన్స్ ఉన్నా కంప్లీట్ గా డ్యామేజీ చేశారని జరిగిందంతా సూరజ్ చెప్తాడు.

వీడియోలతో సహా

ఇదంతా జ్యోత్స్న చేయించింది. నా దగ్గర సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యం కార్తీక్. జ్యోత్స్ననే ఇదంతా చేయించిందని ఆమెనే నాతో చెప్పింది. జరిగిందంతా కార్తీక్ చూశాడని సూరజ్ చెప్తాడు. సూరజ్ చెప్పేది నిజమేనా? అని శివ నారాయణ అడిగితే, అవునని కార్తీక్ చెప్తాడు. అంతే కాకుండా వీడియో కూడా చూపిస్తాడు సూరజ్.

పబ్లిక్ లో నా పరువు పోయింది. నా బిజినెస్ ఆగిపోయింది. కోపంతో నా కడుపు మీద కొట్టారు. సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారని సూరజ్ చెప్తాడు. ఆ వీడియోల కింద కామెంట్లను కార్తీక్ చదువుతాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More