Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ నెట్ వర్త్.. కోట్ల సామ్రాజ్యం.. ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవాల్సిందే.. వంద కోట్ల రెమ్యునరేషన్!
Jr NTR: ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ రేంజ్‌కు ఎదిగిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే ఈ రోజు. డ్రాగన్ గ్లింప్స్ తో సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పేరు తెగ ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా అతని నెట్ వర్త్, ఆస్తులపై ఓ లుక్కేయండి.
Jr NTR: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ వద్దే కాదు, సంపాదనలోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇవాళ తారక్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా ఆయన ఆస్తుల వివరాలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్, ప్రస్తుతం పాన్-ఇండియా మార్కెట్‌లో అత్యధిక డిమాండ్ ఉన్న కథానాయకుడిగా నిలిచాడు.

జూనియర్ ఎన్టీఆర్ నెట్ వర్త్
తాజా నివేదికల ప్రకారం.. ఎన్టీఆర్ మొత్తం ఆస్తుల విలువ (నెట్ వర్త్) సుమారు 500 కోట్ల రూపాయలుగా అంచనా. సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్లే ఈ భారీ సామ్రాజ్యానికి ప్రధాన కారణం. దివంగత నందమూరి తారక రామారావు మనవడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన తారక్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.
కళ్లు చెదిరే పారితోషికం
సినిమా సినిమాకూ ఎన్టీఆర్ తన మార్కెట్ పరిధిని పెంచుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం ప్రాజెక్ట్ స్థాయిని బట్టి ఆయన ఒక్కో చిత్రానికి 45 కోట్ల నుంచి 80 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. 'దేవర' చిత్రం కోసం ఆయన 60 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకోగా, బాలీవుడ్ డెబ్యూ మూవీ 'వార్ 2' కోసం దాదాపు 70 కోట్ల రూపాయలు అందుకున్నట్లు వార్తలు వచ్చాయి.
120 కోట్లు
కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'డ్రాగన్'. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యధికంగా 120 కోట్ల రూపాయల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాలీవుడ్ టాక్. దీంతో సౌత్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న అగ్ర హీరోల జాబితాలో తారక్ చేరిపోయాడు.
యాడ్స్ ప్రపంచంలోనూ
కేవలం వెండితెరపైనే కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్లలోనూ ఎన్టీఆర్ భారీగా ఆర్జిస్తున్నాడు. ప్రతిష్టాత్మక బ్రాండ్ల ప్రకటనల్లో నటించడానికి ఆయన రూ.8 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాడు. ఆర్‌ఆర్ఆర్ సంచలన విజయం తర్వాత దేశవ్యాప్తంగా తారక్ క్రేజ్ విపరీతంగా పెరగడంతో, జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లు ఆయనతో ఒప్పందాలు చేసుకోవడానికి క్యూ కడుతున్నాయి.
లగ్జరీ ఇళ్లు
హైదరాబాద్‌లోని అత్యంత విలాసవంతమైన ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో ఎన్టీఆర్‌కు ఒక అందమైన ఇల్లు ఉంది. దీని మార్కెట్ విలువ సుమారు రూ.25 కోట్లు ఉంటుంది. దీనితో పాటు బెంగళూరు, ముంబై నగరాల్లోనూ ఆయనకు విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ కార్లు కూడా
తారక్ గ్యారేజీలో ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. భారతదేశంలోనే మొదటి లంబోర్గిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్ కారును కొనుగోలు చేసిన ఘనత ఆయనదే. దీని ధర సుమారు రూ.5 కోట్లు. వీటితో పాటు బీఎమ్‌డబ్ల్యూ, ల్యాండ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్, పోర్షే వంటి హై-ఎండ్ బ్రాండ్ల కార్లు ఆయన వద్ద ఉన్నాయి. అలాగే సుమారు 80 కోట్ల రూపాయల విలువైన ఒక ప్రైవేట్ జెట్ కూడా ఎన్టీఆర్ సొంతం.
సమయపాలనకు ప్రాధాన్యమిచ్చే తారక్‌కు ఖరీదైన వాచీలంటే అమితమైన ఇష్టం. ఆయన కలెక్షన్‌లో 2.5 కోట్ల రూపాయల విలువైన 'పాటెక్ ఫిలిప్ నాటిలస్' వాచీతో పాటు, దాదాపు 4 కోట్ల రూపాయల విలువ చేసే అత్యంత అరుదైన 'రిచర్డ్ మిల్లే' టైమ్‌పీస్ కూడా ఉన్నాయి.
డ్రాగన్ గ్లింప్స్
ఎన్టీఆర్ బ్రాండ్ వాల్యూని మరింత పెంచేలా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'డ్రాగన్' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తారక్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ ఫస్ట్ గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన అత్యంత క్రూరమైన హంతకుడు 'లూగర్' అలియాస్ 'డ్రాగన్' పాత్రలో ఎన్టీఆర్ ఊరమాస్ లుక్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది.
ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కల్యాణ్ రామ్, నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, కోసరాజు హరికృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
- ఎన్టీఆర్ మొత్తం ఆస్తుల విలువ ఎంత?
ప్రస్తుత అంచనాల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ మొత్తం ఆస్తుల విలువ (Net Worth) సుమారు 500 కోట్ల రూపాయలు.
2. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న 'డ్రాగన్' సినిమా ఎప్పుడు విడుదలవుతుంది?
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న 'డ్రాగన్' చిత్రం 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది.
3. ఎన్టీఆర్ ఒక్కో బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు ఎంత తీసుకుంటారు?
ఎన్టీఆర్ ఒక బ్రాండ్ యాడ్‌లో నటించడానికి సుమారు 8 కోట్ల నుంచి 12 కోట్ల రూపాయల వరకు పారితోషికం వసూలు చేస్తాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


