Dragon Glimpse: అప్పుడే డెవిల్ పుట్టాడు.. అదిరిపోయిన ఎన్టీఆర్ బర్త్ డే గిప్ట్.. డ్రాగన్ ఫస్ట్ గ్లింప్స్ తో గూస్ బంప్స్
Dragon Glimpse: యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబినేషన్ చిత్రానికి 'డ్రాగన్' అనే టైటిల్ ఖరారు చేస్తూ చిత్రబృందం అదిరిపోయే గ్లింప్స్ విడుదల చేసింది. అఫీషియల్ గ్లింప్స్ హైలైట్స్, కథా నేపథ్యం, రిలీజ్ డేట్ వివరాలు మీకోసం.
Dragon Glimpse: జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే రోజు ఫ్యాన్స్ కు ఇచ్చిన గిఫ్ట్ అదిరింది. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ సినిమాకు ‘డ్రాగన్’ అనే పేరును అధికారికంగా అనౌన్స్ చేశారు. ప్రత్యేక గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. డ్రాగన్ మూవీ ప్రపంచాన్ని పరిచయం చేసిన ఈ గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

డ్రాగన్ టైటిల్
చాలా రోజులుగా సాగుతున్న సస్పెన్స్‌కు తెరదించుతూ.. ఎన్టీఆర్-నీల్ మూవీకి 'డ్రాగన్' (Dragon) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఇవాళ (మే 20) ఎన్టీఆర్ బర్త్ డే. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి 11.52 గంటలకు గ్లింప్స్ రిలీజ్ చేశారు.
4.28 నిమిషాల నిడివి ఉన్న ఈ గ్లింప్స్ వీడియో డ్రాగన్ సినిమా ప్రపంచాన్ని, అందులోని కీలక పాత్రలను, వారి ఉద్దేశాలను స్పష్టంగా చూపిస్తూనే థియేటర్లలో పూనకాలు తెప్పించే స్థాయి యాక్షన్‌ను రుచి చూపించింది.
ప్రశాంత్ నీల్ సరికొత్త వ్యూహం
దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాల్లో సాధారణంగానే అనేక పాత్రలు ఉంటాయి. వాటి వల్ల మొదట్లో ప్రేక్షకులు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈసారి ఆయన ఒక తెలివైన వ్యూహాన్ని ఎంచుకున్నారు. గ్లింప్స్ నిడివిని కాస్త ఎక్కువగా ఉంచి కథా ప్రపంచాన్ని ముందే వివరించారు. భారతదేశంలో బ్రిటీష్ పాలన కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌తో ఈ 'డ్రాగన్' కథ సాగుతుంది. హెరాయిన్‌ను తయారు చేసే నల్లమందు (Opium) తోటల వ్యాపారం కోసమే బ్రిటీషర్లు అప్పట్లో భారతదేశాన్ని ఆక్రమించినట్లు ఇందులో చూపించారు.
అఫ్గానిస్తాన్, గోల్డెన్ ట్రయాంగిల్ పోరు
ప్రపంచంలోనే అత్యధికంగా నల్లమందు పండించే రెండు ప్రధాన ప్రాంతాలుగా అఫ్గానిస్తాన్, గోల్డెన్ ట్రయాంగిల్ గుర్తింపు పొందాయి. బ్రిటీషర్లు భారతదేశాన్ని విడిచి వెళ్ళినప్పటికీ, ప్రపంచంలోనే అత్యధిక లాభాలు తెచ్చిపెట్టే ఈ దందాను ఇక్కడే వదిలేశారు. దీనివల్ల కాలక్రమేణా రెండు పెద్ద మాఫియా ముఠాలు పుట్టుకొచ్చాయి. అవే 'అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ', 'ది గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ'.
డెవిల్ పుట్టాడు
హీరోయిన్ రుక్మిణి వసంత్ ఓ కథ చెప్తూ ఉంటుంది. దేవుడు ఎలా క్రియేట్ చేశాడు అనేది వివరిస్తుంది. ఆమె కథ ఆధారంగా పాత్రలు ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. చివర్లో అప్పుడే డెవిల్ పుట్టాడు అని ఆమె చెప్పగానే ఎన్టీఆర్ పవర్ ఫుల్ ఎంట్రీ డ్రాగన్ గ్లింప్స్ కే హైలైట్ గా నిలిచింది.
అదే స్టోరీ లైన్
ఈ రెండు బలమైన గ్రూపుల మధ్య నల్లమందు వ్యాపారాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి, మార్కెట్‌లో ఆధిపత్యం చలాయించడానికి సాగే భీకర పోరాటమే 'డ్రాగన్' సినిమా ప్రధాన కథాంశం. ఈ రక్తపాత ప్రపంచంలో అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన అత్యంత ప్రమాదకరమైన ప్రధాన హంతకుడు (Assassin-in-Chief) 'లూజెన్' పాత్రలో ఎన్టీఆర్ విశ్వరూపం చూపించనున్నాడు.
మైండ్ బ్లోయింగ్ విజువల్స్
డ్రాగన్ గ్లింప్స్‌లో కనిపించిన ప్రతి ఫ్రేమ్ ఒక విజువల్ వండర్‌లా ఉంది. ఎన్టీఆర్ పలికిన పవర్‌ఫుల్ డైలాగ్స్, సంక్లిష్టమైన కథలను నడిపించడంలో ప్రశాంత్ నీల్‌కు ఉన్న పట్టు, నిర్మాణ విలువలు, ప్రతి చిన్న విషయంలోనూ తీసుకున్న జాగ్రత్తలు, పదునైన ఎడిటింగ్ అన్నీ కలిసి ఈ వీడియోను టాప్ నాచ్‌గా నిలబెట్టాయి.
ఎన్టీఆర్ డైలాగ్స్
ఇక ఎన్టీఆర్ తన స్టైల్లో పలికిన డైలాగ్ లో కేకలు పెట్టిస్తున్నాయి. ‘‘దేవును నాకొక గొప్ప వరం ఇచ్చాడు.. ట్రిగ్గర్ నొక్కగానే మరిచిపోవడం. నిద్రపోయినప్పుడు నా కలలోకి నేను చంపినవాళ్ల ముఖాలు రావు. మిగిలి ఉన్న శత్రువుల ముఖాలే కనపడతాయి. పొరపాటున కూడా నా కలలోకి రావొద్దు’’ అని డ్రాగన్ గెటప్ లో ఎన్టీఆర్ పలికిన డైలాగ్ అదిరిపోయింది.
రిలీజ్ డేట్
డ్రాగన్ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ మరోసారి అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రుక్మిణి వసంత్, అనిల్ కపూర్, బిజు మీనన్, ఖుష్బూ సుందర్, గురు సోమసుందరం, రాజీవ్ కనకాల, అశుతోష్ రాణా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
- ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ఏమిటి?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రానికి 'డ్రాగన్' (Dragon) అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
2. 'డ్రాగన్' సినిమా కథా నేపథ్యం ఏమిటి?
భారతదేశంలో బ్రిటీష్ పాలన కాలం నాటి నల్లమందు (Opium) స్మగ్లింగ్ దందా నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతోంది. అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ, గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీల మధ్య సాగే ఆధిపత్య పోరాటమే దీని కథ.
3. సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఏమిటి?
ఈ చిత్రంలో ఎన్టీఆర్ 'అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ'కి చెందిన అత్యంత ప్రమాదకరమైన ప్రధాన హంతకుడు (Assassin-in-Chief) 'లూజెన్' పాత్రలో కనిపించనున్నారు.
4. 'డ్రాగన్' సినిమా ఎప్పుడు విడుదలవుతుంది?
ఈ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


