NTRNeel: ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ క్రేజీ ప్రాజెక్ట్‌కు పవర్‌ఫుల్ టైటిల్.. బర్త్‌డే బ్లాస్ట్ కు అంతా రెడీ!
NTRNeel: జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న 'NTRNeel' చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలిసింది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా టైటిల్ టీజర్ రిలీజ్ కానుంది.
NTRNeel: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కు ఎట్టకేలకు టైటిల్ ఖరారు చేసినట్లు తెలిసింది. గత కొన్ని నెలలుగా 'NTRNeel' అనే వర్కింగ్ టైటిల్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ టైటిల్ ను ఎన్టీఆర్ బర్త్ డే రోజు రివీల్ చేస్తారని అంటున్నారు.

డ్రాగన్ టైటిల్
ఎన్టీఆర్-నీల్ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ముందు నుంచే ప్రచారంలో ఉంది. ఆ ఊహాగానాలను నిజం చేస్తూ మేకర్స్ ఇదే డ్రాగన్ అనే పేరును టైటిల్ గా ఫిక్స్ చేసినట్లు సమాచారం. టైటిల్ రివీల్ చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. దీని సెన్సార్ కూడా పూర్తయినట్లు టాక్.
4 నిమిషాల 35 సెకన్లు
సాధారణంగా సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ లేదా గ్లింప్స్ అంటే ఒకటి లేదా రెండు నిమిషాల వ్యవధి ఉంటుంది. కానీ, ప్రశాంత్ నీల్ మార్క్ ప్రపంచాన్ని పరిచయం చేయడానికి ఈ సమయం సరిపోదని భావించినట్లున్నారు. అందుకే డ్రాగన్ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ రన్ టైమ్ ను ఏకంగా 4 నిమిషాల 35 సెకన్లుగా లాక్ చేశారు.
ఒక టీజర్ ఇంత సుదీర్ఘంగా ఉండటం భారతీయ సినిమా చరిత్రలోనే చాలా అరుదు. ఈ సుదీర్ఘ నిడివిని బట్టే ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ సృష్టించిన సరికొత్త ప్రపంచం, అందులోని భారీ యాక్షన్ సీక్వెన్సులు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ గ్లింప్స్ సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకుని క్లీన్ చిట్ సాధించింది.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలే!
మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజున ఫ్యాన్స్ కు పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నారు డ్రాగన్ మేకర్స్. ఈ క్రమంలోనే మే 20వ తేదీ అర్ధరాత్రి (మిడ్ నైట్) ఈ భారీ గ్లింప్స్ ను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ముహూర్తం పెట్టారు. సోషల్ మీడియాలో ఇప్పటికే దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్టీఆర్ బర్త్ డే వేడుకలను డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ పై అప్పుడే ప్రారంభించిన ఫ్యాన్స్.. రకరకాల పోస్టర్లు, స్పెషల్ ఎడిట్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నారు.
పాన్ ఇండియా రేంజ్
'డ్రాగన్' సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఈ ఫస్ట్ గ్లింప్స్ ను ఒకేసారి ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు హిందీ, |తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ టీజర్ ఒకే సమయంలో డిజిటల్ స్క్రీన్లను ముంచెత్తనుంది. కేజీఎఫ్ సిరీస్, సలార్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించిన ప్రశాంత్ నీల్.. ఈసారి ఎన్టీఆర్ ను మునుపెన్నడూ చూడని అత్యంత రగ్గడ్, ఇంటెన్స్ యాక్షన్ అవతారంలో చూపించబోతున్నారని ఇండస్ట్రీ టాక్.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న 1: ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమా అధికారిక టైటిల్ ఏమిటి?
జవాబు: జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రానికి 'డ్రాగన్' (Dragon) అనే టైటిల్ ను పెడుతున్నట్లు టాక్.
ప్రశ్న 2: 'డ్రాగన్' సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడు విడుదలవుతుంది?
జవాబు: నటుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20వ తేదీ అర్ధరాత్రి (మిడ్ నైట్) ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేయనున్నారు.
ప్రశ్న 3: ఈ చిత్ర టీజర్ నిడివి ఎంత? ఏయే భాషల్లో వస్తోంది?
జవాబు: ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రికార్డ్ స్థాయిలో 4 నిమిషాల 35 సెకన్ల నిడివితో రాబోతోంది. ఇది తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం ఇలా ఐదు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


