Money Heist: నెట్‌ఫ్లిక్స్ సంచలన ప్రకటన.. మనీ హీస్ట్ మళ్లీ వచ్చేస్తోంది.. టీజర్ అదుర్స్
Money Heist: ప్రపంచవ్యాప్త క్రేజ్ సంపాదించిన 'మనీ హీస్ట్' సిరీస్ ముగిసిపోలేదని నెట్‌ఫ్లిక్స్ సంచలన ప్రకటన చేసింది. కొత్త సీజన్ లేదా స్పిన్-ఆఫ్ రూపంలో భారీ యాక్షన్, థ్రిల్లింగ్ దోపిడీలతో ఈ సిరీస్ త్వరలో మన ముందుకు రానుంది.
Money Heist: పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లి సంచలన ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అభిమానులను ఊర్రూతలూగించిన ‘మనీ హీస్ట్’ (Money Heist) ప్రపంచం ఇంకా ముగియలేదని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా స్పష్టం చేసింది. ఒరిజినల్ సిరీస్ ఐదో సీజన్ ముగిసి దాదాపు ఐదేళ్లు కావస్తున్న తరుణంలో, మళ్లీ అదే ఉత్కంఠభరితమైన దోపిడీలు, యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ ఫ్రాంచైజీ తిరిగి రాబోతోంది.

కొత్త టీజర్
మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘బెర్లిన్’ సీజన్ 2 కంటే ముందే నెట్‌ఫ్లిక్స్ ఒక సంచలన టీజర్‌ను వదిలింది. “మనీ హీస్ట్ ప్రపంచం కొనసాగుతోంది” అంటూ ఈ టీజర్ విడుదలైంది. మనీ హీస్ట్ యూనివర్స్ కేవలం స్పిన్-ఆఫ్స్‌కే పరిమితం కాదని, మరింత విస్తరించబోతోందని ఈ టీజర్ చెప్పకనే చెప్పింది. అయితే, ఇది నేరుగా ఆరో సీజన్‌గా వస్తుందా? లేక ప్రొఫెసర్ పాత్ర చుట్టూ తిరిగే మరో కొత్త కథగా ఉంటుందా? అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
వైరల్ పోస్ట్
మనీ హీస్ట్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎరుపు, నలుపు థీమ్‌తో కూడిన ఈ పోస్ట్‌లో కరెన్సీ నోట్ల వర్షం, బంగారం, విలువైన కళాఖండాలు కనిపిస్తుండగా.. చేతిలో మెషిన్ గన్లతో రెడ్ జంప్‌సూట్ గ్యాంగ్ సిద్ధంగా ఉన్నట్టు చూపించారు. "బెల్లా చావో ఇంకా వినిపిస్తూనే ఉంది.. లా కాసా డి పాపెల్ ప్రపంచం కొనసాగుతోంది" అని క్యాప్షన్ ఇచ్చి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.
స్పెయిన్ నదిపై
ఈ ప్రకటన చేయడంలో కూడా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ తనదైన శైలిలో ‘గ్రాండ్’గా వ్యవహరించింది. కేవలం ఒక ప్రెస్ రిలీజ్‌తో సరిపెట్టకుండా.. స్పెయిన్‌లోని సెవిల్లె నగరంలో ఒక భారీ పీఆర్ స్టంట్‌ను ప్లాన్ చేసింది. గ్వాడల్క్వివిర్ నదిలో రెడ్ జంప్‌సూట్లు, దాలీ మాస్క్‌లు ధరించిన వ్యక్తులు ఒక బోటులో ప్రయాణిస్తూ సందడి చేశారు. ఆ సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో ఐకానిక్ సాంగ్ ‘బెల్లా చావో’ వినిపిస్తుండగా, వేలాది మంది అభిమానుల సమక్షంలో ఈ ఫ్రాంచైజీ భవిష్యత్తు గురించి అధికారిక ప్రకటన చేశారు.
టీజర్‌లో గతంలోని రాయల్ మింట్, బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ దోపిడీలను గుర్తు చేస్తూనే.. రాబోయే సాహసాలు అంతకు మించి ఉంటాయనే సంకేతాలు ఇచ్చారు. "ఇది డబ్బుతో మొదలైంది.. తర్వాత బంగారం, వెలకట్టలేని సంపద వైపు వెళ్లింది. కానీ ఈ విప్లవం ఇంకా ముగియలేదు. నెక్ట్స్ ఏంటీ అనేది ఇప్పటికే మొదలైంది" అంటూ టీజర్‌లో కనిపించిన డైలాగులు కథలో లోతును సూచిస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా
నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీషేతర భాషా సిరీస్‌లలో అత్యధిక వీక్షణలు పొందిన సిరీస్‌గా ‘మనీ హీస్ట్’ రికార్డు సృష్టించింది. అలెక్స్ పినా సృష్టించిన ఈ క్రైమ్ డ్రామా.. ‘ప్రొఫెసర్’ అనే మేధావి తన గ్యాంగ్‌తో కలిసి చేసే పక్కా ప్లాన్డ్ దోపిడీల చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీ నుంచి పోలీస్ విభాగం కోణంలో లేదా నేరుగా ప్రొఫెసర్ ప్రయాణంపై మరో సిరీస్ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, ప్రొఫెసర్ మాస్టర్ ప్లాన్లు మళ్లీ చూడబోతున్నామనే వార్త నెటిజన్లకు ఫుల్ జోష్ ఇస్తోంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: మనీ హైస్ట్ సీజన్ 6 రాబోతోందా?
జవాబు: నెట్‌ఫ్లిక్స్ ఈ మనీ హీస్ట్ ప్రపంచం కొనసాగుతుందని టీజర్ విడుదల చేసింది. అయితే ఇది ఆరో సీజన్‌గా వస్తుందా లేదా స్పిన్-ఆఫ్‌గా వస్తుందా అనే అధికారిక వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
ప్రశ్న: బెర్లిన్ సీజన్ 2 ఎప్పుడు విడుదల అవుతుంది?
జవాబు: ‘బెర్లిన్’ సీజన్ 2 మే 15న ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.
ప్రశ్న: మనీ హీస్ట్ టీజర్ సారాంశం ఏమిటి?
జవాబు: విప్లవం ఇంకా ముగియలేదని.. డబ్బు, బంగారం తర్వాత అంతకంటే పెద్ద కథ రాబోతోందని టీజర్ సూచించింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


