418: హారర్ మూవీల్లో నవ్వింది చాలు.. ఇక భయపడాల్సిందే.. క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన మైత్రీ.. ప్రశాంత్ నీల్ సపోర్ట్
418: పాపులర్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఆడియన్స్ ను భయపెట్టడానికి రెడీ అవుతోంది. ఈ బ్యానర్ కింద ఓ హారర్ థ్రిల్లర్ ను తెరకెక్కించనున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ టైటిల్ ను అనౌన్స్ చేశారు.
418: వరుస సినిమాలతో జోరుమీదున్న పాపులర్ ప్రొడక్షన్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసింది. ఆడియన్స్ ను భయపెట్టేలా హారర్ థ్రిల్లర్ సినిమాను తీసుకొస్తున్నామని ప్రకటించింది. శనివారం (ఏప్రిల్ 18) ఈ మూవీ టైటిల్ ను మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసింది. టైటిల్ డిఫరెంట్ గా ఉంది.

418 మూవీ
మైత్రీ మూవీ మేకర్స్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. తమ కొత్త సినిమాకు ‘418’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ ను ఇవాళ ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నవీన్ యెర్నేని, రవి శంకర్ నిర్మిస్తున్నారు.
‘‘418 రాబోతుంది. ఇది మీ కలలను కాదు పీడకలలను నిజం చేస్తుంది. 418 ది ఫిల్మ్ తో మైత్రీ హారర్ ను తీసుకొస్తుంది. హారర్ మూవీస్ లో నవ్వింది చాలు. ఇక భయపడాల్సిన టైమ్ వచ్చింది’’ అని మైత్రీ మూవీ మేకర్స్ ఎక్స్ లో పోస్టు చేసింది.
ప్రశాంత్ నీల్ సపోర్ట్
418 సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సపోర్ట్ గా నిలుస్తున్నాడు. అతను ఈ మూవీని ప్రజెంట్ చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ కూడా మూవీ టీమ్ లో భాగం కావడంతో 418 చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ హారర్ థ్రిల్లర్ కు కీర్తన్ నడగౌడ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
భయపెట్టేలా
హారర్ కు కామెడీ యాడ్ చేసి సినిమాలను తెరకెక్కించడం అనేది ఇప్పుడు ట్రెండ్. రీసెంట్ గా ఇలాగే వచ్చిన రాకాస సూపర్ హిట్ గా నిలిచింది. దెయ్యాలతో భయపెట్టడంతో పాటు కామెడీతో నవ్వించడం కలిసొస్తుంది. అయితే 418 సినిమాతో మాత్రం పూర్తిగా భయపెట్టనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించడం ఆసక్తి రేపుతోంది.
ఫస్ట్ టైమ్
పుష్ప సినిమాలతో మైత్రీ మూవీ మేకర్స్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని నిర్మించిన ఈ ప్రొడక్షన్ హౌస్.. ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా రణబాలిని తెరకెక్కిస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు రూట్ మార్చి ఫస్ట్ టైమ్ హారర్ థ్రిల్లర్ ను తీసుకురాబోతుంది. 418ను పక్కా హారర్ మూవీగా తీర్చిదిద్దేందుకు రెడీ అయింది. ఈ బ్యానర్ లో శ్రీమంతుడు, రంగస్థలం, నాని గ్యాంగ్ లీడర్, ఉప్పెన, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు వచ్చాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


