Pochamma Review: పోచమ్మ రివ్యూ- విగ్రహం కూల్చేయడంతో పగబట్టే దేవత- ఓటీటీకి ఇవాళ వచ్చిన హారర్ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందంటే?

Pochamma Web Series Review In Telugu: ఓటీటీలోకి ఇవాళ తెలుగు హారర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ పోచమ్మ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అర్జున్ అంబటి, స్నేహల్ కామత్, అచ్యుత్ కుమార్ తదితరులు నటించిన పోచమ్మ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ తెలుగు వెబ్ సిరీస్ ఎలా ఉందో నేటి పోచమ్మ రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Apr 17, 2026, 21:51:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Pochamma Review In Telugu: ఓటీటీలోకి ఇవాళ (ఏప్రిల్ 17) వచ్చిన ఇంట్రెస్టింగ్ కంటెంట్‌లో పోచమ్మ ఒకటి. తెలుగులో హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌గా తెరకెక్కిన పోచమ్మకు రమేష్ ఇందిరా దర్శకత్వం వహించడంతోపాటు ఓ కీలక పాత్ర పోషించారు. ఆయనతోపాటు అర్జున్ అంబటి, అచ్యుత్ కుమార్, స్నేహల్ కామత్, శ్రుతి నాయుడు, శ్రీ పూజ, ప్రియ శతమర్షన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

పోచమ్మ రివ్యూ- విగ్రహం కూల్చేయడంతో పగబట్టే దేవత- ఓటీటీకి ఇవాళ వచ్చిన హారర్ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందంటే?
పోచమ్మ రివ్యూ- విగ్రహం కూల్చేయడంతో పగబట్టే దేవత- ఓటీటీకి ఇవాళ వచ్చిన హారర్ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందంటే?

ఐదు ఎపిసోడ్స్‌తో సుమారు 22 నిమిషాల రన్‌టైమ్ ఉన్న పోచమ్మ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆహాలో నేడు పోచమ్మ ఓటీటీ రిలీజ్ అయింది. మరి ఈ తెలుగు హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందో నేటి పోచమ్మ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

ఓ గ్రామంలో పోచమ్మ విగ్రహంతో ఉన్నఎస్టేట్ ఉంటుంది. ఆ ఎస్టేట్‌ను ఫెడ్రిక్ (రమేష్ ఇందిరా) కొనుక్కుంటాడు. అయితే, క్రిస్టియన్ అయిన ఫెడ్రిక్ పోచమ్మ విగ్రహాన్ని తొలగిస్తాడు. అక్కడ పనిచేసే రఘుపతి (అచ్యుత్ కుమార్) ఎంత చెప్పిన వినకుండా పోచమ్మ విగ్రహాన్ని తీయించేసి ఏసు క్రీస్తు విగ్రహాన్ని పెడతాడు ఫెడ్రిక్. ఆ తర్వాత ఫెడ్రిక్ ఇంట్లో అనూహ్య సంఘటనలు ఎదురవుతాయి. ఫెడ్రిక్ చిన్న కూతురు జెస్సీ (స్నేహల్ కామత్) పైనుంచి కిందపడి చనిపోతుంది.

జెస్సీ ఎందుకు చనిపోయింది? అందుకు కారణం పోచమ్మ విగ్రహం కూల్చడమేనా? ఫెడ్రిక్ ఇంటిపై పోచమ్మ దేవత పగబట్టిందా? మరే ఇతర కారణాలు ఉన్నాయా? ఫెడ్రిక్ జీవితంలో ఉన్న రహస్యాలు ఏంటీ? అనేది తెలియాలంటే? పోచమ్మ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

విశ్లేషణ:

పోచమ్మ వెబ్ సిరీస్ నిజానికి మర్డర్ ఇన్విస్టిగేషన్‌తో సాగే హారర్ మిస్టికల్ థ్రిల్లర్. ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌కు డివోషనల్ టచ్ ఇచ్చి డైరెక్టర్ రమేష్ ఇందిరా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. కథలోని పాత్రలు, వారి పరిచయం, పోచమ్మ ఎస్టేట్ వంటి అంశాలతో మొదటి రెండు ఎపిసోడ్స్ బాగా సాగుతుంది. ఆ తర్వాత జెస్సీ చనిపోవడం, దాని వెనుకున్న కారణాలతో సిరీస్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది.

అలాగే, నాలుగో ఎపిసోడ్‌లో పోచమ్మ అమ్మోరుకు సంబంధించి వచ్చే ఎలిమెంట్స్ అట్రాక్ట్ చేస్తాయి. నాలుగో ఎపిసోడ్‌ చివరిలో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక ఆఖరి ఎపిసోడ్ ఫుల్ గ్రిప్పింగ్‌గా ఎంగేజ్ చేస్తుంది. చిక్కుముడులు విప్పి మంచి ట్విస్టులతో అలరిస్తాయి. క్లైమాక్స్ బాగానే ఉంది.

అదిరిపోయిన బీజీఎమ్

ఆద్యంతం సిరీస్ గ్రిప్పింగ్‌గా సాగుతుంది. ఎక్కడ బోర్ కొట్టించకుండా పర్ఫెక్ట్ రన్‌టైమ్‌తో సిరీస్‌ను మలిచిన విధానం చాలా బాగుంది. ఓ మర్డర్‌కు స్థానిక నమ్మకాలను జోడించి బాగా ఆవిష్కరించారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. అక్కడక్కడ హారర్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. బీజీఎమ్ అదిరిపోయింది. ఎడిటింగ్ సూపర్బ్ అని చెప్పొచ్చు.

ఇక నటీనటులు వారి పాత్రల్లో పర్‌ఫెక్ట్‌గా ఒదిగిపోయారు. నెగెటివ్ షేడ్స్‌లో అంబటి అర్జున్ అలరించాడు. స్నేహల్ కామత్ పాత్రలో ఒదిగిపోయింది. అచ్యుత్ కుమార్ తన నటన అనుభవాన్ని ప్రదర్శించారు. అయితే, చాలా తక్కువ రన్‌టైమ్ ఉన్నప్పటికీ కథనం రొటీన్‌గా అనిపిస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే కథనం రొటీన్‌గా ఉన్న గ్రిప్పింగ్ అండ్ ఎంగేజింగ్ సీన్లతో చూపుతిప్పుకోనివ్వని పోచమ్మ.

రేటింగ్: 2.75/5

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More