Horror: భయానికి సరికొత్త నిర్వచనంగా తెలుగు డార్క్ సైకలాజికల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్- ప్రీ లుక్ పోస్టర్- చంద్రబోస్ రచన!

M3 Media And Maha Movies Production 4 Movie: యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఒక డార్క్ సైకలాజికల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది. ప్రీ-లుక్ పోస్టర్‌తోనే భీతి గొల్పుతున్న ఈ సినిమా, హారర్ జానర్‌లో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Apr 16, 2026, 09:40:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

M3 Media And Maha Movies Production 4 Movie: సినిమా అంటే కేవలం కల్పిత కథలు మాత్రమే కాదు, కళ్ల ముందు జరిగిన దారుణాలను కూడా వెండితెరపై ఆవిష్కరించవచ్చని నిరూపించనున్నారు దర్శకుడు సూర్యాస్. M3 మీడియా, మహా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న లేటెస్ట్ చిత్రం ప్రస్తుతం 'ప్రొడక్షన్ నెం. 4'గా రూపొందుతోంది.

భయానికి సరికొత్త నిర్వచనంగా తెలుగు డార్క్ సైకలాజికల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్- ప్రీ లుక్ పోస్టర్- చంద్రబోస్ రచన!
భయానికి సరికొత్త నిర్వచనంగా తెలుగు డార్క్ సైకలాజికల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్- ప్రీ లుక్ పోస్టర్- చంద్రబోస్ రచన!

రియల్ సంఘటనలతో

"ఇన్‌స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్" అనే ట్యాగ్‌లైన్ ఈ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. మన చుట్టూ జరిగిన, మనకు తెలియని కొన్ని మిస్టీరియస్ సంఘటనలను నేపథ్యంగా తీసుకుని ఈ కథను రాసుకున్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా హారర్ సినిమాలు అంటే ఆత్మలు, దెయ్యాలు అనే రొటీన్ ఫార్ములా కనిపిస్తుంది. కానీ, ఈ చిత్రం డార్క్ అండ్ డేంజరస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఒక సైకలాజికల్ హారర్ మిస్టరీగా ఉండబోతోందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. తాజాగా విడుదలైన ప్రీ-లుక్ పోస్టర్ చూస్తుంటే, ఆ గాఢమైన చీకట్లు, భయంకరమైన గుర్తులు ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి.

ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ కలం బలం

ఈ ప్రాజెక్టుకు మరో ప్రధాన ఆకర్షణ ఆస్కార్ విజేత, ప్రముఖ గీత రచయిత చంద్రబోస్. ఒక హారర్ థ్రిల్లర్ సినిమాలో ఆయన పాటలు రాయడం సినిమాకు భారీ మైలేజ్ తీసుకువచ్చే అవకాశం ఉంది. తన కలంతో భయాన్నీ, భావోద్వేగాన్ని ఎలా పలికించబోతున్నారో చూడాలని సంగీత ప్రియులు ఆత్రుతగా ఉన్నారు. అలాగే అచ్చు రాజమణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఆయన ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ హారర్ మిస్టరీని మరో స్థాయికి తీసుకెళ్తుందని టెక్నికల్ టీమ్ భావిస్తోంది.

షూటింగ్ అప్‌డేట్, టైటిల్ అనౌన్స్‌మెంట్

మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాణంలో, మహర్షి కూండ్ల సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం టెక్నికల్ పరంగా చాలా ఉన్నతంగా ఉండనుందని సమాచారం. మిర్లాన్ నసీర్ సినిమాటోగ్రఫీ, వంశీ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇవాళ (ఏప్రిల్ 16) ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక టైటిల్‌ను ప్రకటించనున్నారు. ఇప్పటికే ప్రీ-లుక్ పోస్టర్‌తో సోషల్ మీడియాలో చర్చ మొదలవగా, టైటిల్ ఏమై ఉంటుందా అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. వచ్చే నెల నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో విభిన్నమైన హారర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా వాస్తవికతకు దగ్గరగా ఉండే కథలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తున్నాయి. భయానికి సరికొత్త నిర్వచనం అంటూ వస్తోన్న ఎమ్3 మీడియా, మహా మూవీస్ నిర్మాణ సంస్థ ప్రొడక్షన్ నెం. 4 మూవీ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More