OTT Horror: 2 ఓటీటీల్లోకి రొమాంటిక్ హారర్ థ్రిల్లర్- చనిపోయిన వారిని బతికించే ప్రయోగం వికటిస్తే- కానీ, అదొక్కటే మైనస్!
The Bride OTT Release: ప్రముఖ దర్శకురాలు మ్యాగీ గిలెన్‌హాల్ ప్రతిష్టాత్మక సినిమా ది బ్రైడ్ ఓటీటీలోకి వచ్చేయనుంది. క్లాసిక్ ఫ్రాంకెన్‌స్టైన్ కథకు ఆధునిక హంగులు అద్ది ఆవిష్కరించిన ది బ్రైడ్ రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవనుంది. హారర్, రొమాన్స్, యాక్షన్ అంశాల ది బ్రైడ్ ఓటీటీ రిలీజ్ ఎక్కడో తెలుసుకుందాం.
The Bride OTT Streaming: 1935 నాటి 'బ్రైడ్ ఆఫ్ ఫ్రాంకెన్‌స్టైన్' ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ది బ్రైడ్. 1930ల కాలం నాటి అమెరికా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. మేరీ షెల్లీ (జె జెస్సీ బక్లీ) తాను రాసిన నవల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తాను నిజంగా రాయాలనుకున్న ఒక లేడి ఒరియెంటెడ్ కథను మనకు పరిచయం చేయడంతో ఈ సినిమా మొదలవుతుంది.

ప్రయోగంతో పునర్జన్మ
ఇక్కడే దర్శకురాలు ఒక కొత్త ప్రయోగానికి తెరలేపారు. ఐడా అనే మహిళ మరణించిన తర్వాత, ఒంటరితనంతో బాధపడుతున్న ఫ్రాంకెన్‌స్టైన్ మాన్‌స్టర్ (క్రిస్టియన్ బేల్) అభ్యర్థన మేరకు ఒక డాక్టర్ ఆమెకు మళ్లీ ప్రాణం పోస్తుంది. చనిపోయిన ఐడాను బతికించేందుకు ప్రయోగం చేస్తారు. అంటే ప్రయోగంతో పునర్జన్మ ప్రసాదిస్తారు. అయితే, ఆ ప్రయోగం వికటిస్తుంది.
ఐడా తిరుగుబాటు
పునర్జన్మ పొందిన ఐడాకు గతమేమీ గుర్తుండదు. ఆమెను తన భర్తగా ఫ్రాంకెన్‌స్టైన్ నమ్మిస్తాడు. అక్కడి నుంచి వీరిద్దరి ప్రయాణం ఎలా సాగింది? సమాజం పట్ల ఆమె తిరుగుబాటు ఎలా మొదలైంది? అనేదే ఈ 'ది బ్రైడ్!' సినిమా.
హారర్, రొమాన్స్ అంశాలు
వార్నర్ బ్రదర్స్ నిర్మాణంలో వచ్చిన 'ది బ్రైడ్' సినిమాలో క్రిస్టియన్ బేల్, జెస్సీ బక్లీ ప్రధాన పాత్రల్లో నటించారు. మార్చి 6న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. హారర్, రొమాన్స్, యాక్షన్ వంటి అంశాలతో ది బ్రైడ్ సినిమాను తెరకెక్కించారు.
ది బ్రైడ్ ఓటీటీ స్ట్రీమింగ్
ఆసక్తికర కథా కథనంతో సాగే ది బ్రైడ్ ఓటీటీలోకి వచ్చేయనుంది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ది బ్రైడ్ ఓటీటీ రిలీజ్ కానుంది. ఏప్రిల్ 17 నుంచి ప్రైమ్ వీడియోలో ది బ్రైడ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది. అయితే, రెంటల్ విధానంలో మాత్రమే ది బ్రైడ్ సినిమాను వీక్షించగలం. ఇప్పటికీ పెయిడ్ వ్యూ ద్వారానే ది బ్రైడ్ ఓటీటీలోకి రానుంది. అయితే, ఇదొక్కటి మైనస్‌గా మారింది.
రెంటల్ విధానంలో
అమెజాన్ ప్రైమ్‌తోపాటు మరో ఓటీటీలో కూడా సందడి చేయనుంది ది బ్రైడ్ సినిమా. అదే బుక్ మై షో. అయితే, బుక్ మై షో ఓటీటీలో మాత్రం ఎలాంటి రెంటల్ విధానం లేకుండా సబ్‌స్క్రిప్షన్ ఉన్న యూజర్స్ ది బ్రైడ్ చిత్రాన్ని చూడొచ్చు. ఏప్రిల్ 17 నాడే బుక్ మై షోలో కూడా ది బ్రైడ్ ఓటీటీ ప్రీమియర్ కానుంది.
తెలుగులో వస్తుందా
ఇలా రెండు ఓటీటీల్లో హారర్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ది బ్రైడ్ డిజిటల్ స్ట్రీమింగ్ అవనుంది. అయితే, ది బ్రైడ్ తెలుగు భాషలో ఓటీటీలోకి వస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు. ఇందులో మెయిన్ లీడ్ రోల్ చేసిన క్రిస్టియన్ బేల్ బ్యాట్‌మ్యాన్ మూవీ ద్వారా తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.
అమెజాన్ ప్రైమ్, బుక్ మై షో ఓటీటీల్లో
ఇక ది బ్రైడ్‌లో క్రిస్టియన్ బేల్ విలక్షణమైన మేకప్, నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. హర్రర్ సినిమాలను ఇష్టపడే తెలుగు ఓటీటీ ఆడియెన్స్ ది బ్రైడ్ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్, బుక్ మై షో ఓటీటీల్లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


