Thimmarajupalli TV Review: తిమ్మరాజుపల్లి టీవీ రివ్యూ.. నిర్మాతగా హీరో కిరణ్ అబ్బవరం మూవీ ఎలా ఉందంటే?
Thimmarajupalli TV Movie Review In Telugu: హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి నిర్మించిన లేటెస్ట్ మూవీ తిమ్మరాజుపల్లి టీవీ. సాయితేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె నటించిన ఈ సినిమా 90స్ కాలంలో జరుగుతుంది. ఇవాళ థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా ఎలా ఉందో నేటి తిమ్మరాజుపల్లి టీవీ రివ్యూలో చూద్దాం.
Thimmarajupalli TV Review In Telugu: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రొడ్యూసర్‌గా మారి నిర్మించిన లేటెస్ట్ ఫిల్మ్ తిమ్మరాజుపల్లి టీవీ. వి మునిరాజ్ డైరెక్షన్ చేసిన ఈ సినిమా విలేజ్ లవ్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కింది. నేడు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో నేటి తిమ్మరాజుపల్లి టీవీ రివ్యూలో తెలుసుకుందాం.

టైటిల్: తిమ్మరాజుపల్లి టీవీ
నటీనటులు: సాయితేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, సత్యనారాయణ, అమ్మ రమేష్, లాతిష్ తదితరులు
కథ, ఎడిటింగ్, దర్శకత్వం: వి. మునిరాజ్
సంగీతం: వంశీకాంత్ రేఖన
సినిమాటోగ్రఫీ: అక్షయ్ రామ్
నిర్మాత: కిరణ్ అబ్బవరం
రిలీజ్ డేట్: 17 ఏప్రిల్ 2026
కథ:
1996 సమయంలో రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ ఇది. తిమ్మరాజుపల్లి పల్లెటూరులో ప్రతి శివరాత్రికి ఊరంతా కలిసి చందాలేసుకుని పండుగ జరుపుకుంటారు. అలాగే, సాయంత్రం అద్దెకు తెచ్చుకున్న టీవీ, వీసీఆర్లో కొత్త సినిమాలు వేసుకుని చూస్తూ వినోదం పొందుతారు. అలాంటి ఊరిలోకి తొలిసారిగా సొంతంగా టీవీ కొనుక్కుని తెచ్చుకుంటాడు రాజప్ప (ప్రదీప్ కొట్టె).
దాంతో రాజప్ప ఇంట్లోనే ఊరంతా టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తూ ఆనందిస్తారు. మరోవైపు ఊరిలో చిల్లర దొంగతనాలు చేసే సతీష్ (సాయితేజ్) రాజప్ప చెల్లి శారద (వేద జలంధర్)ను ప్రేమిస్తుంటాడు. టీవీ సాకుతో ప్రతిరోజు శారద కోసం రాజప్ప ఇంటికి వెళ్తాడు సతీష్. ఓసారి సతీష్, శారద ప్రేమ విషయం తెలిసి పెద్ద గొడవ అవుతుంది. కట్ చేస్తే రాజప్ప ఇంట్లో టీవీ దొంగతనం అవుతుంది. ఆ టీవీని సతీషే దొంగలించాడని ఊరంతా నిందిస్తారు. సతీష్‌కు తనపై పడిన నింద పోగొట్టుకునేందుకు 14 రోజుల గడువు ఇస్తారు.
ఆ తర్వాత ఏమైంది? సతీష్ తనపై పడిన నింద తొలగించుకున్నాడా? అసలు టీవీని ఎవరు దొంగలించారు?, వారికి ఏం అవసరం? రాజప్ప టీవీని దొంగలించిన వారిని సతీష్ పట్టుకున్నాడా? సతీష్-శారద ప్రేమ ఏమైంది? అనేది తెలియాలంటే? ఈ మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇప్పుడు అంటే ఓటీటీలు రావడంతో అంతా స్మార్ట్ ఫోన్‌లలోనే అన్ని రకాల కంటెంట్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ, 80-90వ దశకంలో టీవీ అనేది చాలా మందికి స్ట్రాంగ్ ఎమోషన్. ఓ వీధికో, ఊరుకో ఒక టీవీ ఉండేది. ఊరంత చేరి అదే టీవీలో సినిమాలు, పాటలు చూసేవారు. ఆ సమయంలో టీవీ ఉన్నవారికి, లేనివారికి ఇగో సమస్యలు, గొడవలు వంటివి కూడా జరిగేవి. అలాంటి పాయింట్‌తోనే వచ్చిన సినిమానే ఇది.
రూటెడ్ కథతో వచ్చిన తిమ్మరాజుపల్లి టీవీ మూవీతో అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేశారు డైరెక్టర్ మునిరాజ్. సింపుల్‌గా ఈ మూవీ కథను చూస్తే ఓ టీవీ దొంగతనం, దానితో ముడిపడి ఉన్న హీరో హీరోయిన్ లవ్ స్టోరీ. అయితే, స్టోరీ ఎంత సింపుల్‌గా ఉన్నా డ్రామా, ఎమోషన్స్ పండితే ఆ మూవీ హిట్ అయినట్లే. అందులో ఈ మూవీ సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు.
కథలో సంఘర్షణ అప్పుడే
తిమ్మరాజుపల్లి ఊరు తీరు, అక్కడ ఉండే మనుషుల వ్యక్తిత్వం వంటి అంశాలతో కథలోకి తీసుకెళ్లారు డైరెక్టర్. పాత్రల పరిచయం, ఒకరితో మరొకరికి ఉన్న సంబంధాలు, హీరో హీరోయిన్ లవ్ ట్రాక్, రాజప్ప టీవీ తేవడం, దాని గురించి గొప్పగా అంతా మాట్లాడుకోవడం అంతా మన జీవితంలో జరిగినట్లుగా సహజంగా చూపించారు. ఇక హీరో హీరోయిన్ ప్రేమాయణం రాజప్పకు తెలిసిన తర్వాత కథలో కాన్‌ఫ్లిక్ట్ మొదలవుతుంది.
ఆ తర్వాత కథ మలుపు తిరుగుతుంది. టీవీ దొంగతనం చేసింది ఎవరు, ఎందుకు, వారిని పట్టుకునేందుకు సతీష్ ఏం చేశాడు, ఈ క్రమంలో సతీష్‌ను ఊరు ఏ విధంగా చూసింది, తను ప్రేమించిన అమ్మాయి ఎలా రియాక్ట్ అయింది వంటి అంశాలతో చాలా బాగా ఎంగేజింగ్‌గా తెరకెక్కించారు. క్లైమాక్స్ బాగుంది. కథలో ఉన్న చిక్కుముడులను లాజికల్‌గా విప్పి మంచి ఎమోషనల్ క్లైమాక్స్‌తో మూవీని ముగించిన తీరు బాగుంది.
పాత్రల్లో ఒదిగిపోయిన నటీనటులు
సినిమాలో నటించింది అంతా కొత్తవారే. కానీ, నటనతో మెప్పించారు. ప్రతి ఒక్కరు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సినిమాలో ఓ పాత్ర ట్విస్ట్ మెప్పిస్తుంది. పాటలు బాగున్నాయి. బీజీఎమ్ ఓకే. ఎడిటింగ్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ అలరిస్తాయి.
డైరెక్టర్ తన టేకింగ్‌తో ఆకట్టుకున్నారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. నిర్మాతగా కిరణ్ అబ్బవరం సక్సెస్ అయినట్లే చెప్పొచ్చు. తక్కువ బడ్జెట్‌తో ఇలాంటి సినిమాను చూపించడం మెచ్చుకునే విషయం. ఫైనల్‌గా చెప్పాలంటే హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా నిర్మించిన తిమ్మరాజుపల్లి టీవీ మెప్పించే సినిమా.
రేటింగ్: 3/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


