కిరణ్ అబ్బవరం నెక్ట్స్ లెవల్ ప్లాన్.. బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో భారీ మైథలాజీ యాక్షన్ థ్రిల్లర్.. హీరోయిన్‌పై ఉత్కంఠత!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లో మరో భారీ ముందడుగు వేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్, బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ప్రేరణ అరోరా సంయుక్త నిర్మాణంలో ఒక భారీ పాన్-ఇండియా మైథాలజీ యాక్షన్ చిత్రానికి కిరణ్ అబ్బవరం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు తన రూట్ మార్చారు. 'క' (KA) సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ మూవీతో మంచి హిట్ అందుకున్నారు. ఇప్పుడు నేరుగా బాలీవుడ్ మేకర్స్‌తో చేతులు కలిపి ఒక భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టారు.

ప్రముఖ నిర్మాణ సంస్థల కలయిక
భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, పురాణ గాథల నేపథ్యంలో సాగే ఈ చిత్రం కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్, బాలీవుడ్ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ ప్రేరణ అరోరా (Ess Kay Gee Entertainment)తో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు
కీర్తన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్ట్, భారతీయ సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా ఒక మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్‌గా అద్భుతమైన విజువల్స్‌తో రూపొందనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విజువల్స్ పరంగా ఈ చిత్రం సరికొత్త ప్రపంచాన్ని చూపబోతోందని మేకర్స్ పేర్కొన్నారు.
సెప్టెంబర్ నుంచి షూటింగ్ షురూ!
2026 సెప్టెంబర్‌లో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీతోపాటు అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల చేయనున్నారని సమాచారం.
హీరోయిన్ ఎంపికపై ఉత్కంఠ
ఈ భారీ ప్రాజెక్ట్‌లో కిరణ్ అబ్బవరం సరసన నటించే హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ లేదా టాలీవుడ్‌కు చెందిన ఒక స్టార్ హీరోయిన్‌ను ఎంపిక చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. భక్తి, భావోద్వేగం, డ్రామా, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సుల కలయికతో ఈ చిత్రం ఉండనుందని మేకర్స్ తెలిపారు.
పవర్‌ఫుల్ అవతార్‌లో
ఇదిలా ఉంటే, గతంలో ప్రేరణ అరోరా, జీ స్టూడియోస్ కలిసి 'రుస్తమ్' వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించారు. ఇప్పుడు కిరణ్ అబ్బవరంను ఒక పవర్‌ఫుల్ అవతార్‌లో ప్రెజెంట్ చేస్తూ, అంతర్జాతీయ స్థాయిలో టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని వారు ప్లాన్ చేస్తున్నారు.
నెక్ట్స్ లెవెల్ ప్లాన్
ఈ చిత్రానికి సంబంధించిన దర్శకుడు, టైటిల్, ఇతర నటీనటుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. క, కె ర్యాంప్ తర్వాత కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా స్థాయిలో నెక్ట్స్ లెవెల్ ప్లాన్ చేశాడని అభిమానులు సంతోషపడుతున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


