బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌పై దగ్గుబాటి రానా భార్య మిహీకా బజాజ్ ఎమోషనల్ పోస్ట్- కారణం ఇదే! పాత గొడవలు ముగిసినట్టేనా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ముంబైలో జరిగిన సోమన్ కపూర్ సీమంతం వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ వేడుకలో పాల్గొన్న రానా దగ్గుబాటి భార్య మిహీకా బజాజ్ హీరోయిన్ సోనమ్‌పై ఎమోషనల్ పోస్ట్ చేశారు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహూజా దంపతుల ఇంట్లో మరోసారి సందడి నెలకొంది. సోనమ్ కపూర్ రెండోసారి గర్భం దాల్చడంతో, ముంబైలోని వారి నివాసంలో సీమంతం (Godh Bharai) వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. సోనమ్ కపూర్ సీమంతం ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

చిన్ననాటి స్నేహితురాలి కోసం మిహీకా సందడి
దగ్గుబాటి రానా భార్య మిహీకా బజాజ్ ఈ సీమంతం వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సోనమ్ కపూర్ కుటుంబంతో మిహీకాకు చిన్నప్పటి నుంచే విడదీయరాని అనుబంధం ఉంది. ఈ సందర్భంగా సోనమ్‌తో కలిసి దిగిన ఫోటోలను మిహీకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. "నేను ఎంతగానో ప్రేమించే కుటుంబంలోకి మరో చిన్న ప్రాణం రాబోతోంది" అంటూ మిహీకా మురిసిపోయారు.
"చిన్నప్పుడు నేను నీ వెంటే తిరిగేదాన్ని.. ఇప్పుడు నీ పిల్లలు కూడా నీ వెంటే తిరుగుతుంటే చూడాలని ఉంది. మీరు ఇంత అందమైన జీవితాన్ని నిర్మించుకోవడాన్ని దగ్గరుండి చూడటం నాకు చాలా ప్రత్యేకం. మీ జీవితంలో మొదలవుతున్న ఈ కొత్త అధ్యాయానికి నా తరఫున బోలెడంత ప్రేమతో శుభాకాంక్షలు" అని మిహీకా బజాజ్ ఎమోషనల్ అయ్యారు.
పాత గొడవలు మర్చిపోయి..
సోనమ్ సోదరి రియా కపూర్‌తో కూడా మిహీకాకు మంచి స్నేహం ఉంది. ఇదిలా ఉంటే, గతంలో 'కింగ్ ఆఫ్ కోత' ప్రమోషన్ల సమయంలో రానా దగ్గుబాటి చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపాయి. దుల్కర్ సల్మాన్‌తో నటిస్తున్నప్పుడు ఒక బాలీవుడ్ హీరోయిన్ షాపింగ్ చేస్తూ సమయం వృధా చేసిందని రానా సరదాగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
అది సోనమ్ కపూర్‌ను ఉద్దేశించే అన్నారని వార్తలు రావడంతో రానా క్షమాపణలు కూడా చెప్పారు. తాజాగా మిహీకా ఈ వేడుకకు హాజరుకావడాన్ని చూస్తుంటే, రెండు కుటుంబాల మధ్య ఉన్న విభేదాలు పూర్తిగా తొలగిపోయాయని అర్థమవుతోంది.
సందడిగా వేడుకలు
సోనమ్ సీమంతం వేడుకలో కపూర్ ఫ్యామిలీతో పాటు బాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. భూమి పెడ్నేకర్, మసాబా గుప్తా, అనుపమ్ ఖేర్, షనాయా కపూర్, అన్షులా కపూర్ తదితరులు హాజరయ్యారు. సోనమ్ అత్తగారు ప్రియా అహూజా కోడలికి హారతి ఇస్తున్న ఫోటోలు, సోనమ్-ఆనంద్ దంపతులు కలిసి పూజ చేస్తున్న దృశ్యాలను అన్షులా కపూర్ షేర్ చేశారు.

కాగా, సోనమ్ కపూర్, ఆనంద్ అహూజా 2018లో వివాహం చేసుకున్నారు. వీరికి 2022లో మొదటి సంతానంగా 'వాయు కపూర్ అహూజా' జన్మించాడు. ఇప్పుడు వాయుకు తోడుగా మరో చిన్నారి రాబోతుండటంతో అటు అహూజా కుటుంబంలో, ఇటు అనిల్ కపూర్ నివాసంలో పండుగ వాతావరణం నెలకొంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


