ఘనంగా సోనమ్ కపూర్ సీమంతం- తారల సందడి మధ్య గజలక్ష్మిలా మెరిసిపోయిన హీరోయిన్- నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఫొటోలు!
బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ రెండోసారి తల్లి కాబోతున్నారు. ఆదివారం ముంబైలో జరిగిన సోనమ్ కపూర్ సీమంతం వేడుకలో కరీనా కపూర్, అర్జున్ కపూర్ వంటి సినీ ప్రముఖులు సందడి చేశారు. లెమన్ గ్రీన్ లెహంగాలో సోనమ్ మెరిసిపోతుండగా, భార్యపై ఆనంద్ ఆహుజా కురిపించిన ప్రేమ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ప్రస్తుతం తన జీవితంలో అత్యంత మధురమైన క్షణాలను ఆస్వాదిస్తున్నారు. వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాతో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న సందర్భంగా ఫిబ్రవరి 8న ఆమె నివాసంలో సోనమ్ కపూర్ సీమంతం (గోద్ భరాయ్) వేడుక అట్టహాసంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల మధ్య ఈ వేడుక సంప్రదాయబద్ధంగా, ఎంతో హుందాగా సాగింది.

పూల వనంలో 'ప్రెగ్నెన్సీ గ్లో'..
సోనమ్ కపూర్ సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా లెమన్ గ్రీన్ కలర్ లెహంగా చోళీలో సోనమ్ కపూర్ ‘ప్రెగ్నెన్సీ గ్లో’తో వెలిగిపోతూ కనిపించారు.
భారీ ఆభరణాలు, జడతో సోనమ్ కపూర్ ఒక గజలక్ష్మిలా మెరిసిపోయారు. పూజలో కూర్చున్న సమయంలో భార్య సోనమ్ నుంచి ఆనంద్ ఆహుజా కళ్లు తిప్పుకోలేకపోవడం అక్కడున్న వారిని మురిపించింది.
ఇంటి లోపలి అలంకరణ
అలాగే, ఇంటి లోపల అలంకరణ కూడా ఎంతో విభిన్నంగా ఉంది. పైకప్పు నుంచి వేలాడుతున్న ఊదా రంగు పూలు, 'బర్డ్ ఆఫ్ ప్యారడైజ్' పూల అమరికలతో ఇల్లంతా ఒక అందమైన ఉద్యానవనాన్ని తలపించింది. సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ బ్యూటిఫుల్ సోనమ్‌తో దిగిన ఫోటోను పంచుకుంటూ, "ప్రియమైన సోనమ్.. నీ సీమంతం వేడుకకు నా ప్రేమ, ఆశీస్సులు" అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
తారల మేళవింపు
సోనమ్ కపూర్ బేబీ షవర్ వేడుకకు బాలీవుడ్ దిగ్గజాలు కరీనా కపూర్, భూమి పెడ్నేకర్, షబానా అజ్మీలతో పాటు సోనమ్ సోదరుడు అర్జున్ కపూర్, ఖుషీ కపూర్, అన్షులా కపూర్, మహీప్ కపూర్ వంటి వారు హాజరై సందడి చేశారు.
ప్రేమ, పెళ్లి.. మాతృత్వంపై సోనమ్ మాట
2015లో 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమా ప్రమోషన్స్ సమయంలో సోనమ్, ఆనంద్‌లు మొదటిసారి కలుసుకున్నారు. స్నేహితులు వారిద్దరినీ కలపాలని అనుకోకపోయినా, వారి మధ్య ఫోన్ మెసేజ్‌లతో మొదలైన పరిచయం ప్రేమగా మారింది.
2018లో వీరిద్దరూ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. 2022లో వీరికి కుమారుడు ‘వాయు’ జన్మించాడు. గతేడాది నవంబర్‌లో ప్రిన్సెస్ డయానాను తలపించేలా పింక్ డ్రెస్‌లో ఫోటో షూట్ చేసి రెండోసారి తల్లి కాబోతున్నట్లు సోనమ్ కపూర్ ప్రకటించారు.
పూర్తిగా బిడ్డకే అంకితం
మాతృత్వం గురించి సోనమ్ మాట్లాడుతూ.. "పిల్లలు పుట్టాక ఒక మనిషిగా బాధ్యత పెరుగుతుంది. మన సమయం మనది కాదు, పూర్తిగా బిడ్డకే అంకితం చేయాల్సి ఉంటుంది. అనవసరమైన విషయాల కంటే కుటుంబం, వృత్తికే నేను ప్రాధాన్యత ఇస్తాను" అని సోనమ్ కపూర్ పేర్కొన్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


