Pallichattambi Review: పళ్లిచట్టంబి రివ్యూ- చర్చ్‌లను కాపాడే రౌడీ- టోవినో థామస్, పృథ్వీరాజ్, కయాదు మూవీ ఎలా ఉందంటే?

Pallichattambi Movie Review In Telugu: మలయాళ స్టార్ హీరో టోవినో థామస్, బ్యూటిపుల్ కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ పళ్లిచట్టంబి. డిజో జోస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు వెర్షన్ ఇవాళ థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి పళ్లిచట్టంబి రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Apr 17, 2026, 13:23:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Pallichattambi Review In Telugu: మలయాళ స్టార్ హీరో టోవినో థామస్‌కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. అందుకే ఆయన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఇవాళ (ఏప్రిల్ 17) తెలుగులో టోవినో థామస్ నటించిన పళ్లిచట్టంబి సినిమా విడుదల అయింది.

పళ్లిచట్టంబి రివ్యూ- చర్చ్‌లను కాపాడే రౌడీ- టోవినో థామస్, పృథ్వీరాజ్, కయాదు మూవీ ఎలా ఉందంటే?
పళ్లిచట్టంబి రివ్యూ- చర్చ్‌లను కాపాడే రౌడీ- టోవినో థామస్, పృథ్వీరాజ్, కయాదు మూవీ ఎలా ఉందంటే?

కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించిన పళ్లిచట్టంబి మలయాళంలో ఏప్రిల్ 15న థియేటర్లలో విడుదల అయింది. రెండు రోజుల గ్యాప్‌తో ఇక్కడ తెలుగులో రిలీజ్ అయింది. డైరెక్టర్ డిజో జోస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో నేటి పళ్లిచట్టంబి రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

130-50 కాలం నాటి సమయంలో కేరళ, కర్ణాటక సరిహద్దులో ఉన్న కణియర్ ప్రాంతంలోని ఓ కొండపై బంగారు గని ఉంటుంది. అది దక్కించుకునేందుకు పటేలర్ కుంజుంబు నంబియార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ప్లాన్ వేస్తాడు. అణగారిన వర్గాలను, ఎదురు తిరిగిన వాళ్లను చంపేస్తుంటాడు. అక్కడికి ఆంగ్లేయులు కూడా వచ్చేందుకు భయపడుతుంటారు. అలా వచ్చిన ఆంగ్లేయులను కిరాతకంగా చంపేస్తాడు నంబియార్.

కట్ చేస్తే 1957లో కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆ తర్వాత రాష్ట్రమంతా కమ్యూనిజం వ్యాపించి చర్చిలను కూలగొడుతుంటారు. చర్చివాళ్లు తమ ఉనికి నిలుపుకునేందుకు ఓ రక్షకుడును కాపాలాగా పెట్టాలనుకుంటారు. అందుకు కృష్ణ పిళ్లై (టోవినో థామస్)ని క్రిస్టోఫర్ చట్టంబిగా రంగంలోకి దింపుతారు. అతన్ని పళ్లిచట్టంబి అనే పేరుతో పిలుస్తారు.

ఆ తర్వాత ఏమైంది? కణియార్‌లో సంభవించిన సంఘటనలు ఏంటీ? కమ్యూనిస్టులకు, క్రిస్టియన్లకు గొడవలు ఎందుకు జరుగుతాయి? వాటి వెనుక ఉన్నది ఎవరు కమ్యూనిస్ట్ పార్టీ కోసం నాటకాలు వేసే రెబెక్కా (కయాదు లోహర్) పాత్ర ఏంటీ? కొండ తరయాట్టుమాలలోని రహస్యం ఏంటీ? దానికి నంబియార్‌కు ఉన్న సంబంధం ఏంటీ? ప్రజలను పళ్లిచట్టంబి కాపాడాడా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

పళ్లిచట్టంబి అంటే తెలుగులో చర్చ్ రౌడీ అనే అర్థం వస్తుంది. అప్పట్లో కేరళలో మొదటిసారి కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చాక చర్చ్‌లను కాపాడుకునేందుకు చట్టంబి అనే రెడీలను నియమించుకునేవారు. వారినే పళ్లిచట్టంబిలు అని పిలిచేవారు. ఈ టైటిల్‌తో వచ్చిన లేటెస్ట్ సినిమా అదే కాన్సెప్ట్‌తో సాగుతుంది.

భూమి కోసం, మనుగడ, ఉనికి కోసం పోరాటం చేసే కథ ఇది. ఫస్టాఫ్‌లో చాలా వరకు డైలాగ్స్‌తో కథలోకి తీసుకెళ్లారు. అందులో డైరెక్టర్ తన అనుభవాన్ని చాటుకున్నారు. అయితే, కొంతమేర ఆడియెన్స్‌కు గందరగోళంగా సాగుతుంది. ఏది ఎందుకు జరుగుతుంది అనేది అర్థం కాదు.

అయితే, సెకండాఫ్‌లో మాత్రం ఆ సన్నివేశాలకు సరైన క్లారిటీ వస్తుంది. ఏది ఎందుకు చేశారో అన్నింటికి సమాధానం దొరుకుంది. అందుకే ఫస్టాఫ్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి సెకండాఫ్‌పై క్యూరియాసిటీ పెంచారు. ఒక హిందువును చర్చ్ రక్షకుడిగా నియమించడం, కణియార్ ప్రజలకు హీరో కలరిపయట్టు నేర్పించడం వంటి సీన్లతో ఆసక్తిగా సాగుతుంది.

పార్ట్ 2 ఉంది

హీరోయిన్ ఎంట్రీ కమ్యూనిస్ట్ నాటకాలు, హీరోతో లవ్ ట్రాక్ అంశాలు ఓకే అనిపిస్తాయి. ఇలా ఏదో ఒక అంశంతో ప్రీ క్లైమాక్స్ వరకు ఎంగేజ్ చేసేలా ఉంటుంది. ఇక క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతుంది.దేవుడు ఒక్కడే అనేటువంటి అర్థం వచ్చే డైలాగ్స్, హీరో గెటప్, లుక్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ పర్వాలేదనిపిస్తుంది. అయితే ఇంకో పార్ట్ ఉంటుందని క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఇవ్వడం షాకింగ్‌గా అనిపిస్తుంది.

సినిమా టెక్నికల్ వర్క్ చాలా బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్‌లో వచ్చే సినిమాటోగ్రఫీ హైలెట్ అవుతుంది. బీజీఎమ్ దానికి తగినట్లుగా మెప్పిస్తుంది. ఎడిటింగ్ పర్వాలేదు. సంగీతం బాగుంది. నిర్మాణల విలువలు రిచ్‌గా ఉన్నాయి. డైరెక్టర్ టేకింగ్ చాలా బాగుంది. కానీ, కథనంలో ఇంకాస్తా వేగం పెంచాల్సింది.

టోవినో థామస్ తన నటనతో మరోసారి అదరగొట్టాడు. ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లో మెప్పించాడు. కయాదు లోహర్ బ్యూటిఫుల్‌గా కనిపించడమే కాదు నటన పరంగా మెప్పిస్తుంది. తెలుగు యాక్టర్ శత్రు తన పాత్రలో ఆకట్టుకున్నాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ తన విలనిజంతో భయపెట్టిస్తాడు.

ఫైనల్‌గా చెప్పాలంటే?

అయితే, అంతా మలయాళ నటులు కావడంతో తెలుగు ఆడియెన్స్ కాస్తా డిస్‌కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫైనల్‌గా చెప్పాలంటే తెలుగు నేటివిటీ మిస్ అయిన ఆకట్టుకునే మలయాళ సినిమా పళ్లిచట్టంబి.

రేటింగ్: 3/5

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More