OTT Horror: ఓటీటీలోకి రేపే తెలుగు హారర్ థ్రిల్లర్ సిరీస్ పోచమ్మ.. పని రాక్షసులు ఉన్నచోట పరాజయం ఉండదన్న నటి శ్రీ పూజ!
Pochamma OTT Streaming Special Premiere: ఓటీటీలోకి తెలుగు హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పోచమ్మ ఏప్రిల్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో నేడు పోచమ్మ స్పెషల్ ప్రీమియర్ నిర్వహించి ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ఈవెంట్‌లో నటి శ్రీ పూజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అవి వైరల్‌గా మారాయి.
Pochamma Special Premiere: ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ"ను సబ్‌స్క్రైబర్స్ ముందుకు తీసుకొస్తోంది. మిస్టికల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ ఓటీటీ సిరీస్‌లో అంబటి అర్జున్, రమేశ్ ఇందిర, ప్రియ శతమర్షన్, స్నేహల్ కామత్, శృతి నాయుడు, శ్రీ పూజ, కీలక పాత్రల్లో నటించారు.

ఆహా ఓటీటీలో
పోచమ్మ వెబ్ సిరీస్ ఈ నెల 17వ తేదీ నుంచి ఆహాలో తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్‌కు రాబోతోంది. అయితే, గోల్డ్ సబ్‌స్క్రైబర్స్ 24 గంటల ముందుగా యాక్సెస్ పొందవచ్చు. అంటే, ఈ ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్స్ మాత్రం నేటి నుంచే పోచమ్మను ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు.
పోచమ్మ స్పెషల్ ప్రీమియర్
ఇక ఈ వెబ్ సిరీస్‌ను శ్రుతి నాయుడు చిత్ర బ్యానర్‌పై శ్రుతి నాయుడు నిర్మిస్తోంది. పోచమ్మ వెబ్ సిరీస్‌కు రమేష్ ఇందిర దర్శకత్వం వహించారు. కాగా, ఇవాళ (ఏప్రిల్ 17) పోచమ్మ వెబ్ సిరీస్ స్పెషల్ ప్రీమియర్ ప్రదర్శించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
స్నేహాల్ కామత్ కామెంట్స్
ఈ కార్యక్రమంలో నటి స్నేహల్ కామత్ మాట్లాడుతూ.. "పోచమ్మ వెబ్ సిరీస్ జెస్సీ అనే క్యారెక్టర్‌లో నటించాను. ఈ సిరీస్ షూటింగ్ మొత్తం చిక్ మంగళూరులో చేశాం. ఈ సిరీస్‌కు నన్ను సెలెక్ట్ చేసుకున్న ప్రొడ్యూసర్ శృతి నాయుడుకి థ్యాంక్స్ చెబుతున్నా. అలాగే రమేష్ ఇందిర మంచి దర్శకుడు కాదు మంచి కోస్టార్ కూడా. నా కోస్టార్స్ అందరితో కలిసి నటించడం మర్చిపోలేని ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్‌ను మీరంతా చూడాలని కోరుకుంటున్నా" అని అన్నారు.
పని రాక్షసులు
నటి శ్రీ పూజ మాట్లాడుతూ.. "ఈ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న మొదటి రోజే తప్పకుండా సక్సెస్ అవుతుందని నమ్మాను. ఎందుకంటే మా ఓటీటీ సిరీస్‌కు పనిచేసిన వారంతా పని రాక్షసులు. పని రాక్షసులు ఉన్నచోట పరాజయం ఉండదు. ఈ సిరీస్ తమిళం, తెలుగులో ఈ నెల 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మిమ్మల్ని తప్పకుండా ఎంగేజ్ చేసేలా సిరీస్ ఉంటుంది" అని తెలిపారు.
పోచమ్మ ఓటీటీ సిరీస్ కథ
ఇదిలా ఉంటే, పోచమ్మ సిరీస్ ఓ ఇంటి కథగా సాగుతుంది. ధనవంతులు ఆవరణలో అమ్మోరు విగ్రహం ఉంటుంది. అనుకోకుండా ఆ ఇంటి యజమాని ఆ విగ్రహాన్ని తీయేంచిస్తాడు. ఆ తర్వాత ఆ ఇంట్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే కథగా పోచమ్మ ఓటీటీ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్‌ను లవ్, రివేంజ్, సస్పెన్స్, హారర్, మిస్టరీ వంటి అంశాలతో రూపొందించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


