Today OTT: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 6 సినిమాలు- తెలుగులో 5 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 3- పవన్ ఉస్తాద్ టు హారర్ థ్రిల్లర్!

OTT Release Movies Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 6 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో చూసేందుకు అన్నీ స్పెషల్‌గా ఉంటే తెలుగులో ఏకంగా 5 ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో పవన్ కల్యాణ్ యాక్షన్ డ్రామా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి హారర్ థ్రిల్లర్ పోచమ్మ వరకు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

Apr 16, 2026, 15:10:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Today OTT Release Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఆరు సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో పవన్ కల్యాణ్ యాక్షన్ డ్రామా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి రూరల్ హారర్ థ్రిల్లర్ పోచమ్మ వరకు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 6 సినిమాలు- తెలుగులో 5 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 3- పవన్ ఉస్తాద్ టు హారర్ థ్రిల్లర్!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 6 సినిమాలు- తెలుగులో 5 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 3- పవన్ ఉస్తాద్ టు హారర్ థ్రిల్లర్!

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఉస్తాద్ భగత్ సింగ్ (తెలుగు యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- ఏప్రిల్ 16

యూత్ (తెలుగు డబ్బింగ్ తమిళ న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- ఏప్రిల్ 16

బీఫ్ సీజన్ 2 (ఇంగ్లీష్ డార్క్ కామెడీ సైకలాజికల్ డ్రామా అంథాలజీ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 16

ఆహా ఓటీటీ

ఆ గ్యాంగ్ రేపు 3 (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్)- ఏప్రిల్ 16

పోచమ్మ (తెలుగు మిస్టికల్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 16 (ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్స్)

ఈటీవీ విన్ ఓటీటీ

అలా చేరే సీత రాముని చెంతకు (తెలుగు లవ్ ఎమోషనల్ డ్రామా చిత్రం)- ఏప్రిల్ 16

ఇలా ఇవాళ (ఏప్రిల్ 16) ఆరు సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో చూసేందుకు అన్నీ సినిమాలు స్పెషల్‌గా ఉంటే తెలుగులో ఏకంగా 5 మూవీస్ ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అంతేకాకుండా వీటన్నింటిలో ఏకంగా 3 సినిమాలు ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే అందుబాటులో ఉన్నాయి. మరి ఈ ఓటీటీ సినిమాల ఇంట్రెస్టింగ్ విషయాలపై లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్‌లో 'ఉస్తాద్' రచ్చ.. డబ్బింగ్ సినిమాల జోరు

ఇవాళ ఓటీటీ వరల్డ్‌లో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది పవన్ కల్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ పక్కా మాస్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ఏప్రిల్ 16 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో పవర్ స్టార్ మేనరిజమ్స్, డైలాగులతో దుమ్మురేపిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

తమిళంలో మంచి విజయం సాధించిన న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ చిత్రం 'యూత్' కూడా నేటి నుంచే తెలుగు ప్రేక్షకులను పలకరిస్తోంది. యువతకు కనెక్ట్ అయ్యే అంశాలతో సాగే ఈ చిత్రం రొమాన్స్, కామెడీ కలయికగా సాగుతుంది.

ఇక ఇంగ్లీష్ కంటెంట్ ఇష్టపడే వారి కోసం అవార్డు విన్నింగ్ వెబ్ సిరీస్ 'బీఫ్' సీజన్ 2 సిద్ధమైంది. ఇద్దరు వ్యక్తుల మధ్య చిన్న గొడవ చిలికి చిలికి గాలివానలా మారి వారి జీవితాలను ఎలా అతలాకుతలం చేసిందనే సైకలాజికల్ డ్రామాగా ఇది సాగుతుంది.

ఆహాలో హారర్ సెన్సేషన్.. 'పోచమ్మ' వచ్చేసింది

తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' ఎప్పుడూ వైవిధ్యమైన కథలతో ముందుంటుంది. తాజాగా 'పోచమ్మ' అనే మిస్టికల్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. గ్రామీణ నేపథ్యంలో సాగే భయానక అంశాలు, రహస్యాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే, ఏప్రిల్ 16 నుంచి ఇది కేవలం 'ఆహా గోల్డ్' సబ్‌స్క్రైబర్స్ కోసం మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారి కోసం 'ఆ గ్యాంగ్ రేపు 3' అనే షార్ట్ ఫిల్మ్ కూడా నేటి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. తక్కువ నిడివితో ఉత్కంఠ రేకెత్తించే అంశాలు ఇందులో ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఈటీవీ విన్‌లో మనసుని హత్తుకునే ప్రేమకథ

చిన్న సినిమాలకు, ఎమోషనల్ డ్రామాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈటీవీ విన్ నుంచి 'అలా చేరే సీత రాముని చెంతకు' అనే సినిమా విడుదలైంది. ఒక స్వచ్ఛమైన ప్రేమకథగా, కుటుంబ విలువల నేపథ్యంలో సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. హడావుడి లేని ప్రశాంతమైన సినిమా చూడాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More