NTR Neel Movie: ఎన్టీఆర్, నీల్ మూవీకి వార్ 2 దెబ్బ.. స్క్రిప్ట్‌లో మార్పులు.. అందుకే ఇంత ఆలస్యం: మైత్రీ సీఈవో చెర్రీ

NTR Neel Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ (NTR-Neel) ఎందుకు ఆలస్యమవుతుందో మైత్రీ మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ స్పష్టత ఇచ్చారు. కొన్ని స్క్రిప్ట్ మార్పుల కారణంగానే షూటింగ్ రీ-షెడ్యూల్ అయిందని ఆయన వెల్లడించారు.

Published on: Apr 30, 2026, 16:57:13 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

NTR Neel Movie: దేవర, వార్ 2 ఫ్లాపుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రశాంత్ నీల్ సినిమాపై ఎట్టకేలకు ఒక అధికారిక క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్ నుంచి వస్తున్న మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఆశించిన స్థాయిలో వేగంగా జరగకపోవడంతో ఫ్యాన్స్‌లో నెలకొన్న గందరగోళానికి మైత్రీ మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ తాజాగా తెరదించారు.

NTR Neel Movie: ఎన్టీఆర్, నీల్ మూవీకి వార్ 2 దెబ్బ.. స్క్రిప్ట్‌లో మార్పులు.. అందుకే ఇంత ఆలస్యం: మైత్రీ సీఈవో చెర్రీ
NTR Neel Movie: ఎన్టీఆర్, నీల్ మూవీకి వార్ 2 దెబ్బ.. స్క్రిప్ట్‌లో మార్పులు.. అందుకే ఇంత ఆలస్యం: మైత్రీ సీఈవో చెర్రీ

వార్ 2 ప్రభావంతో స్క్రిప్ట్ మార్పులు

ఇటీవల 'జెట్లీ' (Jetlee) చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న మైత్రీ మూవీ మేకర్స్ సీఈవో చెర్రీ.. ఎన్టీఆర్-నీల్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ప్రకటించిన తేదీకే అంటే వచ్చే ఏడాది సినిమాను థియేటర్లలోకి తీసుకువస్తాం. ప్రశాంత్ నీల్ గారు చాలా ఫాస్ట్‌గా పనిచేస్తారు. అయితే ఎన్టీఆర్ గారి హిందీ చిత్రం 'వార్ 2' ఫలితం నేపథ్యంలో.. మేము కొంత సమయం తీసుకుని స్క్రిప్ట్‌లో కొన్ని కీలక మార్పులు చేశాం. ఇప్పుడు అంతా సెట్ అయింది. ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్‌లో ఉంది" అని ఆయన పేర్కొన్నారు.

సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాల్లో యాక్షన్ డోస్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.

మే 20న స్పెషల్ ట్రీట్

ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని మే 20న ఈ సినిమా టైటిల్‌తో పాటు 'ఫస్ట్ గ్లింప్స్' (First Glimpse) విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రేజీ యాక్షన్ డ్రామాకు 'డ్రాగన్' (Dragon) అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఇప్పటికే ప్రచారం సాగుతోంది.

ఈ భారీ బడ్జెట్ మూవీ జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 'సప్త సాగరదాచే ఎల్లో' ఫేమ్ రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. కేజీఎఫ్, సలార్ చిత్రాలకు మరుపురాని మ్యూజిక్ ఇచ్చిన రవి బస్రూర్ ఈ ప్రాజెక్ట్‌కు పనిచేస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గతంలో వచ్చిన రూమర్లకు భిన్నంగా, సినిమా పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తోందని చెర్రీ ఇచ్చిన క్లారిటీతో నందమూరి అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది?

ఈ చిత్రం 2027, జూన్ 11వ తేదీన థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది.

2. ఎన్టీఆర్ నీల్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడు వస్తుంది?

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.

3. ఎన్టీఆర్ నీల్ సినిమాలో హీరోయిన్ ఎవరు?

కన్నడ నటి రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటిస్తోంది.

4. ఎన్టీఆర్ నీల్ సినిమా ఆలస్యానికి కారణం ఏమిటి?

స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేయడం వల్ల షూటింగ్ షెడ్యూల్స్‌లో స్వల్ప మార్పులు జరిగాయని నిర్మాత చెర్రీ వెల్లడించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More