War 2 TV Premiere Date: జూనియర్ ఎన్టీఆర్ తొలి హిందీ మూవీ టీవీలోకి వచ్చేస్తోంది.. వార్ 2 ప్రీమియర్ డేట్ ఇదే
War 2 TV Premiere Date: యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలిసి నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'వార్-2' (WAR 2) వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఖరారైంది. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ మాలో ఈ చిత్రం ప్రసారం కానుంది.
War 2 TV Premiere Date: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్డేట్. అతడు నటించిన తొలి బాలీవుడ్ మూవీ టీవీ ప్రీమియర్ కు సిద్ధమైంది. స్పై థ్రిల్లర్ మూవీ వార్ 2 బుల్లితెరపై సందడి చేయబోతోంది. బాలీవుడ్ బిగ్గెస్ట్ ఫ్రాంచైజీ 'వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్'లో భాగంగా వచ్చిన ఈ మూవీ.. థియేటర్లు, ఆ తర్వాత ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకున్న తర్వాత ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైంది.

వార్ 2 టెలివిజన్ ప్రీమియర్ వివరాలు
ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ 'స్టార్ మా' (Star Maa) వార్ 2 సినిమా శాటిలైట్ హక్కులను దక్కించుకుంది. తాజా అధికారిక ప్రకటన ప్రకారం ఈ ఆదివారం అంటే మే 3వ తేదీ సాయంత్రం 6:00 గంటలకు 'వార్-2' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానుంది. తెలుగులో ఈ మూవీ టెలికాస్ట్ అవుతుంది.
వారం అంతా పని ఒత్తిడిలో ఉన్నవారికి ఈ ఆదివారం సాయంత్రం ఒక పర్ఫెక్ట్ యాక్షన్ విందు కాబోతోంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు.
ఎన్టీఆర్ vs హృతిక్: పోరు మామూలుగా ఉండదు
హృతిక్ రోషన్ పోషించిన మేజర్ కబీర్ పాత్రకు, మేజర్ విక్రమ్ గా ఎన్టీఆర్ తోడవ్వడంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఎన్టీఆర్ ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా, హృతిక్ వంటి స్టార్ నటుడితో సమానమైన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లతో అదరగొట్టారు. వీరిద్దరి మధ్య వచ్చే ఫేస్-ఆఫ్ సీన్స్, హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
యాక్షన్ కు కేరాఫ్ అడ్రస్
అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిన యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్ ఎఫెక్ట్స్, ఎన్టీఆర్-హృతిక్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అలరించనున్నాయి. థియేటర్లలో చూడని వారు లేదా మరోసారి ఈ విజువల్ వండర్ ని ఆస్వాదించాలనుకునే వారు ఈ వీకెండ్ లో స్టార్ మాలో ట్యూన్ అవ్వొచ్చు. ఇప్పటికే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు స్టార్ మాలోకి తెలుగులో వస్తోంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
1. ‘వార్-2’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఏ ఛానల్ లో వస్తుంది?
ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఛానల్ ‘స్టార్ మా’లో ప్రసారం కానుంది.
2. వార్ 2 టీవీ ప్రీమియర్ సమయం ఎప్పుడు?
ఈ ఆదివారం అంటే మే 3వ తేదీ సాయంత్రం 6 గంటలకు ‘వార్-2’ సినిమా ప్రసారం అవుతుంది.
3. ‘వార్-2’ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పేరు ఏమిటి?
ఈ చిత్రంలో ఎన్టీఆర్ ‘మేజర్ విక్రమ్’ అనే పవర్‌ఫుల్ ఏజెంట్ పాత్రలో నటించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


