Hrithik Roshan Girl Friend: కూరగాయలు బాగా కడిగి తినండి.. లేదంటే ఇలా.. హాస్పిటల్ బెడ్‌పై హృతిక్ రోషన్ గర్ల్‌ఫ్రెండ్ సబా

Hrithik Roshan Girl Friend: హృతిక్ రోషన్ గర్ల్‌ఫ్రెండ్ సబా ఆజాద్ హాస్పిటల్ బెడ్ ఎక్కింది. సలాడ్లు బాగా కడిగి తినండనీ చెబుతోంది. లేదంటే తన పరిస్థితే వస్తుందని, బ్యాక్టీరియా కారణంగా తనకు ఈ పరిస్థితి ఎదురైందని ఆమె చెప్పింది.

Published on: Mar 28, 2026, 09:54:33 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో డేటింగ్ చేస్తున్న యాక్టర్, సింగర్ సబా ఆజాద్ రీసెంట్‌గా హాస్పిటల్ పాలైంది. సైక్లోస్పోరియాసిస్ అనే ఒక డేంజరస్ ఇన్ఫెక్షన్ రావడంతో ఆమెను హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. సోషల్ మీడియాలో తన హెల్త్ అప్‌డేట్ ఇస్తూ, కూరగాయలను పక్కాగా కడగాలని, లేకపోతే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయని నెటిజన్లను హెచ్చరించింది. ఆమె పెట్టిన ఈ పోస్ట్ చూసి ఇంటర్నెట్‌లో జనాలు బాగా టెన్షన్ పడుతున్నారు.

Hrithik Roshan Girl Friend: సలాడ్ బాగా కడిగి తినండి.. లేదంటే ఇలా.. హాస్పిటల్ బెడ్ ఎక్కిన హృతిక్ రోషన్ గర్ల్‌ఫ్రెండ్ సబా
Hrithik Roshan Girl Friend: సలాడ్ బాగా కడిగి తినండి.. లేదంటే ఇలా.. హాస్పిటల్ బెడ్ ఎక్కిన హృతిక్ రోషన్ గర్ల్‌ఫ్రెండ్ సబా

సబా ఆజాద్ పెట్టిన ఎమోషనల్ పోస్ట్..

తన లైఫ్‌లో గడిపిన చెత్త 14 రోజుల గురించి బాలీవుడ్ నటి సబా ఆజాద్ తన పోస్ట్‌లో చాలా ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఏకంగా 4 కిలోల బరువు తగ్గానని, కనీసం నడవలేని పరిస్థితికి వెళ్లిపోయానని ఆమె చెప్పింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తన బాధను పంచుకుంటూ.. "నా లైఫ్‌లో అత్యంత దారుణమైన 14 రోజులు ఇవి. సైక్లోస్పోరా కయెటానెన్సిస్.. నువ్వు నిజంగా ఒక చెత్త బ్యాక్టీరియావి! నేను ఎప్పుడూ ఇంట్లో వండిన ఫుడ్ మాత్రమే తింటాను, ఎక్కడికి వెళ్లినా నా వాటర్ బాటిల్ నా వెంటే ఉంటుంది. అలాంటిది ఈ స్టమక్ బగ్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకే అర్థం కాలేదు. అది కూడా నా కెరీర్‌లో అత్యంత బిజీగా ఉన్న టైమ్‌లో ఇది ఎటాక్ చేసింది. కేవలం రెండు వారాల్లోనే నేను ఏకంగా 4 కిలోల బరువు తగ్గిపోయాను. ఇప్పుడు కనీసం నడవడానికి కూడా నావల్ల కావట్లేదు" అని వాపోయింది.

టూత్‌పిక్ కూడా ఎత్తలేనంత వీక్‌గా..

ఒకప్పుడు రోజుకు రెండుసార్లు ట్రైనింగ్ చేస్తూ, పుల్ అప్స్ చేస్తూ, బరువైన వెయిట్స్ లిఫ్ట్ చేసిన తాను.. మరుసటి రోజుకే సగం సైజ్ అయిపోయాను అని సబా చెప్పింది. ఇప్పుడు తనలో కనీసం ఒక చిన్న టూత్‌పిక్ ఎత్తేంత బలం కూడా లేదని, ఇక వెయిట్స్ ఎత్తడం గురించి దేవుడెరుగు అని ఆమె బాధపడింది. ప్రస్తుతం తను కోలుకుంటున్నట్లు ఆమె క్లారిటీ ఇచ్చింది.

ఆకుకూరలు తినేవాళ్లకు సలహా.. హృతిక్ సపోర్ట్..

ఈ సందర్భంగా నెటిజన్లకు ఆమె ఒక మంచి సలహా ఇచ్చింది. "మీ పొట్ట ఆరోగ్యం మీద మీకు ప్రేమ ఉంటే దయచేసి ఆకుకూరలు, సలాడ్స్, వెజిటేబుల్స్‌ను ప్రాణం పెట్టి కడగండి. ఎందుకంటే ఒక్కోసారి నిజంగానే మన ప్రాణాలు వాటి మీదే ఆధారపడి ఉంటాయి. మేం ఇప్పుడు కొత్తగా బేకింగ్ సోడా, వెజ్జీ వాష్ కలిపి కూరగాయలను కడుగుతున్నాం" అని సబా రికమండ్ చేసింది.

ఆ టైమ్‌లో తన పక్కనే ఉండి చూసుకున్న హృతిక్ రోషన్ తీసిన ఒక హాస్పిటల్ పిక్‌ను కూడా సబా పోస్ట్ చేసింది. "నా మూడ్ ఎంత చెత్తగా ఉన్నా, ఎప్పుడూ నవ్విస్తూ ఉన్న హృతిక్ రోషన్ ఈ ఫోటో తీశాడు. ఫోటోలో నేను మరీ కుంచించుకుపోయినట్లు కనిపిస్తున్నాను కానీ, ఆ హాస్పిటల్ బెడ్ చాలా పెద్దది, ఫోటో యాంగిల్ కూడా వైడ్‌గా ఉండటం వల్ల అలా అనిపిస్తోంది" అని తన పోస్ట్‌ను ముగించింది.

రియాక్ట్ అయిన సెలబ్రిటీలు, నెటిజన్లు..

ఆమె పోస్ట్ చూసిన వెంటనే బాలీవుడ్ సెలబ్రిటీలు, నెటిజన్లు చాలామంది స్పందించారు. ప్రీతీ జింటా స్పందిస్తూ.. "త్వరగా కోలుకో స్వీట్‌హార్ట్" అని కామెంట్ చేసింది. ఇక మరో నటి కొంకణా సేన్ శర్మ కామెంట్ చేస్తూ.. "అయ్యో పాపం! సెండింగ్ లాట్స్ ఆఫ్ లవ్" అని రాసుకొచ్చింది.

ఇక ఒక అభిమాని స్పందిస్తూ.. "నేను కూడా ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఏకంగా 8 కిలోల బరువు తగ్గాను. ఇది మన మజిల్ మాస్‌ను దారుణంగా తగ్గించేసి, హిమోగ్లోబిన్ లెవల్స్‌ను పడేస్తుంది" అని తన ఎక్స్‌పీరియన్స్ పంచుకున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More