Neena Gupta: 66 ఏళ్ల వయసులో బాలీవుడ్ నటి ప్రెగ్నెంట్ అయిందా? ఇదీ ఆమె రియాక్షన్.. మన దేశం చాలా ముందుకు వెళ్తోందంటూ..

Neena Gupta: నీనా గుప్తా 66 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ అయిందా? ఈ మధ్య హైదరాబాద్ లో విజయ్, రష్మిక రిసెప్షన్ కు వచ్చిన ఆమె ఫొటోలకు పోజులిచ్చే సమయంలో నీనా గర్భవతా అన్న అనుమానం కలిగింది. తాజాగా ఈ పుకార్లపై నీనా స్పందించింది.

Mar 13, 2026, 15:45:29 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచింది. 66 ఏళ్ల వయసులో ఆమె గర్భవతి అంటూ సోషల్ మీడియాలో షికారు చేసిన వింత పుకార్లపై ఆమె తనదైన శైలిలో స్పందించి, రూమర్ల నోళ్లు మూయించారు. దేశం చాలా ముందుకు వెళ్తోందంటూ నీనా అనడం గమనార్హం.

Neena Gupta: 66 ఏళ్ల వయసులో బాలీవుడ్ నటి ప్రెగ్నెంట్ అయిందా? ఇదీ ఆమె రియాక్షన్.. మన దేశం చాలా ముందుకు వెళ్తోందంటూ..
Neena Gupta: 66 ఏళ్ల వయసులో బాలీవుడ్ నటి ప్రెగ్నెంట్ అయిందా? ఇదీ ఆమె రియాక్షన్.. మన దేశం చాలా ముందుకు వెళ్తోందంటూ..

పుకార్లు ఎలా మొదలయ్యాయి?

గత వారం హైదరాబాద్‌లో జరిగిన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న వివాహ రిసెప్షన్‌కు నీనా గుప్తా హాజరైంది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో, నెటిజన్లలో ఒక వర్గం ఆమె రూపాన్ని చూసి బేస్‌లెస్ రూమర్లను సృష్టించింది. ఆమె గర్భవతి ఏమో అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఆ ఫొటోలు, వీడియోల్లో నీనా పొట్ట భాగం కాస్త ముందుకు వచ్చినట్లుగా కనిపించడంతో కొందరు ఈ పుకార్లను మొదలుపెట్టారు.

నీనా గుప్తా అదిరిపోయే కౌంటర్

ఈ పుకార్లపై బాలీవుడ్ హంగామాతో మాట్లాడిన నీనా.. చాలా ఫన్నీగా స్పందించింది. "నాకు ఇప్పుడు కావాల్సింది ఇదే.. నిజ జీవితంలో 'బధాయి హో' (ఆమె నటించిన సినిమా, అందులో మధ్య వయసులో గర్భవతిగా కనిపిస్తారు) అన్నమాట" అని చమత్కరించింది.

ఆ అసలు నిజాన్ని వివరిస్తూ.. "అక్కడ ఎలాంటి బధాయి హో లేదు. నేను ప్రెగ్నెంట్ కాదు. ఆ రోజు నేను కట్టుకున్న చీర మెటీరియల్ చాలా మందంగా ఉండటం వల్ల నేను కాస్త లావుగా కనిపించాను అంతే. అయినా ఈ వయసులో నా ప్రెగ్నెన్సీ గురించి ఇంతలా చర్చించుకుంటున్నారంటే.. ఒక దేశంగా మనం ఎంతలా పరిణతి చెందుతున్నామో అర్థమవుతోంది" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.

వ్యక్తిగత జీవితంలో సాహసోపేత నిర్ణయాలు

నీనా గుప్తా తన వ్యక్తిగత జీవితం విషయంలో ఎప్పుడూ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంటోంది. 1980వ దశకంలో వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌తో ఆమె రిలేషన్‌లో ఉంది. పెళ్లి కాకుండానే కుమార్తె మసాబా గుప్తాకు జన్మనిచ్చి, సింగిల్ మదర్‌గా పెంచి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 2008లో చార్టర్డ్ అకౌంటెంట్ వివేక్ మెహ్రాను వివాహం చేసుకుంది.

ఇటీవల సంజయ్ మిశ్రాతో కలిసి 'వధ్ 2' (Vadh 2) చిత్రంలో నటించిన ఆమె, త్వరలో నెట్‌ఫ్లిక్స్ డ్రామా సిరీస్ 'చుంబక్' (Chumbak) లో కనిపించనుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More