Vijay Devarakonda: హనీమూన్ ఓవర్? మళ్లీ మూవీ షూటింగ్ కు విజయ్ దేవరకొండ రెడీ.. ఆ యాక్షన్ డ్రామా కోసం

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ మళ్లీ షూటింగ్ కు రెడీ అవుతున్నాడు. రష్మిక మందన్నతో పెళ్లి తర్వాత తిరిగి ఫస్ట్ టైమ్ సెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు.  రిసెప్షన్ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడీ బయట కనిపించలేదు. దీంతో వీళ్లు హనీమూన్ కు వెళ్లారేమోనని వార్తలు వచ్చాయి. 

Published on: Mar 9, 2026, 13:25:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దాదాపు 15 రోజులుగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి, రిసెప్షన్ వార్తలు ట్రెండింగ్ లో కొనసాగాయి. మార్చి 4న హైదరాబాద్ లో విరోష్ రిసెప్షన్ ముగిసింది. సెలబ్రేషన్స్ ఓవర్ ఇక అండర్ గ్రౌండ్ వెళ్లిపోతామని రిసెప్షన్ ముగిసిన తర్వాత విజయ్ దేవరకొండ చెప్పాడు. విజయ్ సరదాకే చెప్పాడేమో అనుకున్నారు కానీ ఆ తర్వాత విరోష్ జోడీ ఎక్కడా కనిపించలేదు.

రణబాలి మూవీ పోస్టర్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న
రణబాలి మూవీ పోస్టర్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న

హనీమూన్ ఓవర్

రిసెప్షన్ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హనీమూన్ వెళ్లారనే వార్తలు వచ్చాయి. మరోవైపు పెళ్లి, రిసెప్షన్ సందడి తర్వాత విరోష్ జోడీ రెస్ట్ తీసుకుంటుందని కొంతమంది అంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడనే బజ్ క్రేజీగా మారింది.

రణబాలి

విజయ్ దేవరకొండ ప్రస్తుతం హీరోగా చేస్తున్న సినిమాల్లో ‘రణబాలి’ ఒకటి. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా, రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్. ఈ రణబాలి మూవీ షూటింగ్ కోసం విజయ్ దేవరకొండ మళ్లీ సెట్ లో అడుగుపెట్టబోతున్నాడని తెలిసింది. మార్చి 12 నుంచి అతను షూటింగ్ పాల్గొనబోతున్నాడని ఫిల్మ్ వర్గాలు చెప్తున్నాయి.

ఫస్ట్ మూవీ షూటింగ్

రష్మిక మందన్నతో పెళ్లి తర్వాత తిరిగి విజయ్ దేవరకొండ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్న ఫస్ట్ మూవీ రణబాలి. దీనికి రాహుల్ సాంకృత్యాన్‌ డైరెక్టర్. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్, విరోష్ వెడ్డింగ్ సందర్భంగా రిలీజ్ చేసిన ‘ఏందయ్యా సామి’ సాంగ్ అదిరిపోయాయి.

హ్యాట్రిక్ మూవీ

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘రణబాలి’. ఈ జోడీ ఇప్పటివరకూ గీత గోవిందం (2018), డియర్ కామ్రేడ్ (2019) సినిమాల్లో కలిసి నటించింది. గీత గోవిందం సినిమా చేసేటప్పుడే ఈ జంట లవ్ లో పడిందని టాక్. డియర్ కామ్రేడ్ షూటింగ్ విరోష్ జోడీ మరింత దగ్గరైందని అంటున్నారు.

విరోష్ వెడ్డింగ్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ లో గ్రాండ్ గా జరిగింది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో అత్యంత సన్నిహితంగా జరిగిన ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీ నుంచి తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, ఆషికా రంగనాథ్, సందీప్ రెడ్డి వంగా తదితరులు హాజరయ్యారు. ఆ తర్వాత మార్చి 4న హైదరాబాద్ లో వెడ్డింగ్ రిసెప్షన్ ను భారీగా నిర్వహించారు. దీనికి రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More