Vijay Rashmika Ranabaali Poster: విజయ్, రష్మిక రణబాలి వెడ్డింగ్ పోస్ట్‌పై ట్రోలింగ్.. సుదీర్ఘ వివరణ ఇచ్చిన డైరెక్టర్
ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రణబాలి' (Vijay Rashmika Ranabaali Poster). ఈ సినిమా నుంచి విడుదలైన వెడ్డింగ్ పోస్టర్‌పై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో.. దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఆ పోస్టర్ వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని వివరించాడు.
టాలీవుడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారు జంటగా నటిస్తున్న పీరియడ్ డ్రామా 'రణబాలి' నుంచి మూవీ టీమ్ ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. అయితే ఈ పోస్టర్‌లో వారి ఆహార్యం, కూర్చున్న విధానం 'వింతగా' ఉందంటూ నెటిజన్ల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. దీనిపై తాజాగా డైరెక్టర్ వివరణ ఇచ్చాడు. ఓ సుదీర్ఘ పోస్ట్ చేశాడు.

పోస్టర్ వెనుక కథేంటి.. దర్శకుడి వివరణ ఇలా
ఈ విమర్శలపై రణబాలి మూవీ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ స్పందిస్తూ.. ఇది కేవలం ఒక పోస్టర్ మాత్రమే కాదని, ఒక కాలానికి ప్రతిబింబమని పేర్కొన్నాడు. 'రణబాలి' కథ 1854, 1878 కాలాల మధ్య జరుగుతుంది.
సహజత్వం కోసమే ఇలా చేసినట్లు రాహుల్ వివరించాడు. "పాత కాలం నాటి ఫోటోలను గమనిస్తే మన తాతముత్తాతలు కెమెరా ముందు చాలా సహజంగా ఉండేవారు. కృత్రిమమైన నవ్వులు, పోజులు ఉండేవి కావు. అదే సహజత్వాన్ని ఈ పోస్టర్‌లో చూపించాలనుకున్నాం" అని రాహుల్ వివరించాడు.
ఆ కాలపు హుందాతనాన్ని ఈ పోస్టర్ లో చూడొచ్చని చెప్పాడు. 1800వ కాలంలో వివాహాలు ఎంతో గౌరవప్రదంగా, మూలాలకు దగ్గరగా ఉండేవని.. విజయ్, రష్మిక ఆ వేషధారణలో కనిపించగానే వారు నటుల్లా కాకుండా, ఆ కాలం నుంచి వచ్చిన వ్యక్తుల్లాగే కనిపించారని అతడు చెప్పుకొచ్చాడు. ఇది వారి గత జన్మ నాటి పెళ్లి ఫోటోలా అనిపిస్తుందని దర్శకుడు ఉద్వేగానికి లోనయ్యాడు.
రెడిట్ వేదికగా నెటిజన్ల మద్దతు
మరోవైపు కొందరు నెటిజన్లు కూడా ఈ పోస్టర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. పాత కాలంలో కెమెరా ఎక్స్‌పోజర్ సమయం ఎక్కువగా ఉండేదని, అందుకే ఫోటో దిగేవారు కదలకుండా స్టిఫ్‌గా ఉండాల్సి వచ్చేదని.. అందుకే వారి ముఖాల్లో నవ్వులు ఉండేవి కావని కొందరు విశ్లేషిస్తున్నారు. రష్మిక పోజు తన ముత్తాతల కాలం నాటి ఫోటోలను గుర్తు చేస్తోందని, ఆమె ఆ లుక్‌ను పర్ఫెక్ట్‌గా క్యారీ చేసిందని నెటిజన్లు కితాబిస్తున్నారు.
హిట్ కాంబినేషన్.. పెళ్లి తర్వాత మొదటిసారి
'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత విజయ్ - రష్మిక జంటగా నటిస్తున్న మూడో సినిమా 'రణబాలి'. వీరిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత విడుదలవుతున్న మొదటి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విమానంలో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణిస్తూ రష్మిక డాన్స్ చేసిన వీడియో కూడా నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


