Rashmika Mandanna: 8 ఏళ్లుగా వేధిస్తున్నారు.. ఇక చూస్తూ ఊరుకోను.. వాళ్లందరికీ 24 గంటల టైమ్ ఇస్తున్నా: రష్మిక వార్నింగ్

Rashmika Mandanna: రష్మిక మందన్న సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. గత 8 ఏళ్లుగా తనపై ఓ పథకం ప్రకారం జరుగుతున్న వేధింపులకు గట్టి సమాధానం ఇస్తూ.. తన ఫ్యామిలీ పేరిట సర్క్యులేట్ అవుతున్న ఓ ఆడియో క్లిప్ ను తొలగించాలని, లేదంటే లీగల్ చర్యలు తప్పవని హెచ్చరించింది.

Published on: Mar 12, 2026, 17:47:34 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యక్తిగత దాడులు, దుష్ప్రచారంపై నటి రష్మిక మందన్న తీవ్రంగా స్పందించింది. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్న ఆమె.. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన, ఘాటైన వార్నింగ్ ఇచ్చింది. తన పేరిట వైరల్ అవుతున్న ఓ పాత ఆడియో క్లిప్ ను 24 గంటల్లో తొలగించాలని, లేదంటే లీగల్ యాక్షన్ అప్పదని రష్మిక హెచ్చరించింది.

Rashmika Mandanna: 8 ఏళ్లుగా వేధిస్తున్నారు.. ఇక చూస్తూ ఊరుకోను.. వాళ్లందరికీ 24 గంటల టైమ్ ఇస్తున్నా: రష్మిక వార్నింగ్ (@thedeverakonda)
Rashmika Mandanna: 8 ఏళ్లుగా వేధిస్తున్నారు.. ఇక చూస్తూ ఊరుకోను.. వాళ్లందరికీ 24 గంటల టైమ్ ఇస్తున్నా: రష్మిక వార్నింగ్ (@thedeverakonda)

'నా ప్రైవసీకి భంగం కలిగించారు'

గత ఎనిమిదేళ్లుగా మీడియాలోని ఒక విభాగం, కొందరు వ్యక్తులు తనపై పథకం ప్రకారం వేధింపులకు, అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని రష్మిక మందన్న ఆవేదన వ్యక్తం చేసింది. "నా మాటలను వక్రీకరించారు, నేను అనని మాటలను అన్నట్లుగా చిత్రికరించారు. కేవలం వ్యూస్, ఎంగేజ్మెంట్ కోసం నాపై ద్వేషాన్ని పెంచారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు విమర్శలు సహజమని ఇన్నాళ్లూ ఓపికగా, మౌనంగా ఉన్నాను. కానీ గడిచిన 24 గంటల్లో జరిగిన సంఘటనలు అన్ని హద్దులను దాటేశాయి" అని ఆమె పేర్కొంది.

రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో చేసిన పోస్ట్ ఇదే
రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో చేసిన పోస్ట్ ఇదే

దాదాపు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఒక ప్రైవేట్ సంభాషణను, తన ప్రమేయం లేకుండా రికార్డ్ చేసి, ఇప్పుడు సందర్భం లేకుండా బయటపెట్టడంపై ఆమె మండిపడింది. తన వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా, వ్యూహాత్మకంగా ఈ వివాదాన్ని సృష్టించారని ఆమె ఆరోపించింది.

24 గంటల గడువు.. లేదంటే లీగల్ యాక్షన్!

తనతో పాటు తన కుటుంబ సభ్యులను, తనతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్న ఇతరులను ఈ వివాదంలోకి లాగడంపై రష్మిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆమె మీడియా సంస్థలకు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది.

తన పరువుకు భంగం కలిగించేలా ఉన్న పోస్ట్‌లను, వీడియోలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ ప్రకటన విడుదల చేసిన 24 గంటల్లోపు ఆ కంటెంట్‌ను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.

నిబంధనలు ఉల్లంఘించే వ్యక్తులు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, మీడియా సంస్థలపై కోర్టు ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని రష్మిక స్పష్టం చేసింది.

నా జీవితం.. నా ఇష్టం

ప్రకటన చివరలో కన్నడ భాషలో స్పందిస్తూ.. "ఇప్పటివరకు నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. ఒక మాట మాత్రం చెప్పాలి.. మా వ్యక్తిగత జీవితాల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వారు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మా జీవితం ఎలా ఉండాలో మీరు నిర్ణయించలేరు. మా నిర్ణయాలు మేమే తీసుకుంటాం" అని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. ఈ మధ్యే విజయ్ దేవరకొండను పెళ్లాడిన రష్మిక మందన్న ఆ వెంటనే ఇలా ఓ ఘాటైన వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

రష్మిక టాలీవుడ్ లో అంతగా పేరు సంపాదించక ముందు అంటే సుమారు 8 ఏళ్ల కిందట ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో రష్మిక వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని వివాదాస్పద అంశాలు ఉండటంతో ఆమె ఇలా తీవ్రంగా స్పందించింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More